Link copied!
Sign in / Sign up
2
Shares

ఎదిగే పిల్లలకు వత్తిడి ఇంత ప్రమాదమా?


పెద్దవాళ్లకు రకరకాల సమస్యలు, ఒత్తిళ్లు ఉంటాయి. కానీ పిల్లలు హ్యాపీగా , కేర్ ఫ్రీగా ఉంటారని అందరూ అనుకుంటారు. పిల్లలకు ఏ బాధ్యతా ఉండదు కాబట్టి సంతోషంగా ఉంటారని అనుకోకూడదు. వాళ్లకూ దిగులుంటుంది. ఎన్నో రకాలుగా బాధ పడుతుంటారు. అవి ఎలా ఉంటాయంటే ...

పిల్లల్లో ఒత్తిడికి కారణాలు
టైం కి చేయాలని 

ఫలానా పని ఫలానా టైంలో జరగాలన్నప్పుడు పెద్దలే కాదు, పిల్లలూ ఒత్తిడికి లోనవుతారు. టైంకు హోంవర్క్ కంప్లీట్ చేయకపోతే వారి మనసుపై ఒత్తిడి కలుగుతుంది. మరీ చిన్నపిల్లల్లో అంటే కిండర్ గార్టెన్ కు వెళ్లే చిన్నారులు – స్కూల్లో ఉన్నప్పుడు అమ్మా-నాన్న కనపడక కంగారు పడతారు. అలాగే, స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు రిలాక్స్ గా ఉండాలనుకుంటారు. అప్పుడు కూడా ఏదోక పని చెప్పి చేయమంటే వాళ్లు ఒత్తిడికి గురవుతారు. వాళ్లకు విశ్రాంతి లేకుండా చేయకూడదు.

సరదా ఆక్టివిటీస్ 

పిల్లలకు చదువే కాకుండా కాస్త సరదా యాక్టివిటీస్ కూడా ఉండాలి. స్కూల్లో అలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాటి గురించి తలిదండ్రులు పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. పెద్దలు వాళ్లను దగ్గరికి తీసుకుని అడగకపోతే డిసపాయింట్ అవుతారు. పిల్లలు సరదాగా గడిపేందుకు కొంత సమయాన్ని పెద్దవాళ్లే కేటాయించాలి.

గొడవ పడడం 

పిల్లలు ఇంటా, బయటా తాము చూసిన సంఘటనల గురించి కూడా అదే పనిగా ఆలోచిస్తారు. ఇంట్లో తలిదండ్రులు పదే పదే గొడవ పడుతుంటే పిల్లలు దిగులుగా ఉంటారు. అలాగే ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా, బంధువులెవరైనా చనిపోయినా –అది చూసి వాళ్లు డల్ అయిపోతారు.

అధికంగా టీవీ చూడడం

ఈ రోజుల్లో పిల్లలు అదే పనిగా టీవీ చూడ్డానికి అలవాటు పడ్డారు. టీవీ వార్తల్లో కనిపించే కొన్ని దృశ్యాలు కూడా పిల్లల్ని ఆవేదనకు గురిచేస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, టెర్రరిజం వంటి మేటర్స్ కు సంబంధించిన విజువల్స్ పిల్లల మనసుల్ని ప్రభావితం చేస్తాయి. ఇక విడాకులు తీసుకున్న దంపతులు పిల్లల ఎదుట ఒకరినొకరు తిట్టుకోకూడదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే --- తలిదండ్రులు విడిపోతే తమను ఎవరు చూస్తారు? అన్న భయం పిల్లలకు పట్టుకుంటుంది. ఇలాంటి విషయాల్లో పెద్దలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఒత్తిడి లక్షణాలు

పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురి అయ్యారో లేదో అని గుర్తించడం అంత సులభం కాదు. అయితే వాళ్ల మూడ్స్ బట్టి కనిపెట్టవచ్చు. నిద్ర పోకపోవడం, చురుకుగా లేకపోవడం, పక్క తడపడం వంటివి చూసి, పిల్లలు ఏదో ఆందోళనలో ఉన్నారని తెలుసుకోవాలి. అలాగే స్కూల్ వర్క్ పూర్తి చేయడంలో శ్రద్ధ చూపకపోవడం, ఇబ్బంది పడడం వంటి లక్షణాలు కనబడతాయి.

మానసికంగా బాధపడుతున్న పిల్లలు దాన్ని పైకి చెప్పుకోలేరు. మనసులో బాధపడుతూ, పైకి చికాకు పడతారు. చిన్న విషయాలను సైతం తట్టుకోలేరు. అలాగే చదువులో వెనకబడడం, రాత్రి పూట ఏదైనా పీడకలలు రావడం కూడా పిల్లల ఒత్తిడికి కారణమవుతాయి.

ఒత్తిడి ఎలా తగ్గించాలి?

పిల్లల్లో ఒత్తిడి తగ్గించాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. తలిదండ్రులు రోజూ కొంత సమయాన్ని కేటాయించుకుని పిల్లల్ని దగ్గరికి తీసుకుని వాళ్లతో గడపాలి. మాట్లాడాలి. అమ్మా నాన్న తమను పట్టించుకోవడం లేదన్న ఫీలింగ్ వాళ్లలో రాకూడదు. అది వాళ్లను చాలా బాధిస్తుంది. ఆఫీసులో పనిచేసి అలసిపోయి వచ్చి, పిల్లలతో గడిపే ఓపిక లేదనుకోకూడదు. తప్పనిసరిగా వాళ్లను అటెండ్ కావాలి. అలా చేస్తే పిల్లలు సంతోషపడతారు. తలిదండ్రులకు పిల్లలు ఏదో చెప్పాలనుకుంటారు. పెద్దలు వినిపించుకోకుంటే వాళ్లు ఫీలవుతారు. వాళ్లను బుజ్జగించి అడిగితే ఎన్నో చెబుతారు. వాళ్లకు ధైర్యం, ఉత్సాహం వస్తుంది. తమ బాధను కూడా ఎలాంటి సంకోచం లేకుండా చెబుతారు. ఇలా చేస్తే పిల్లలు తమలో తాము బాధపడరు. అలాగే వాళ్లకేదైనా సమస్య వచ్చినప్పుడు వెనక తామున్నమన్న నమ్మకాన్ని పెద్దలు కలిగించాలి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon