Link copied!
Sign in / Sign up
7
Shares

ఏడాదిలోపు పిల్లలకు మధ్యాహ్నం పూట తినిపించాల్సిన 3 అద్భుతమైన ఆహారాలు

అప్పుడే పుట్టిన పిల్లలకు, ఏడాది వయస్సులోపు పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు చాలామంది తల్లులు. ఇక్కడ చెప్పుకోబోయే ఈ ఆహారాన్ని 8 నెలల వయస్సున్న పిల్లలకు గానీ ఏడాదిలోపు పిల్లలకు మధ్యాహ్నం పూట తినిపించడం వారి ఆరోగ్యానికి మంచిది. ఈ ఆహారాన్ని  ఎలా తయారుచేసుకోవచ్చో ఈ వీడియోలో కూడా తెలుసుకోవచ్చు.

1. రైస్, కాలీఫ్లవర్, స్వీట్ పొటాటో

 కావలసిన పదార్థాలు

2 కప్పుల రైస్, ¼ వంతు తరిగిన కాలీఫ్లవర్, ¼ వంతు తరిగిన బీట్ రూట్ ముక్కలు, 3 కప్పుల మంచి నీరు.

ఎలా తయారు చేసుకోవాలి?

⇒ముందుగా రైస్ బాగా కడిగి అందులో 3 కప్పుల నీటిని పోసి ఉడికించాలి. అందులోనే తరిగిన బీట్ రూట్ ముక్కలు మరియు కాలీఫ్లవర్ వేసుకుని చిన్నని మంటపై ఉడికించాలి.

⇒20 నిముషాల పాటు బాగా ఉడికించి కిందకు దించాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తగా చేసి తినిపిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.

2. రైస్, బెండకాయ, క్యారెట్

 కావలసిన పదార్థాలు

2 కప్పుల నీరు, ¼ వంతు బెండకాయలు, ¼ వంతు క్యారెట్ మరియు 3 కప్పుల నీరు.

ఎలా తయారు చేసుకోవాలి?

⇒ముందుగా రైస్ బాగా కడిగి అందులో 3 కప్పుల నీటిని పోసి ఉడికించాలి. అందులోనే చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు మరియు బెండకాయ ముక్కలు వేసి ఉడికించాలి.

⇒20 నిముషాల పాటు బాగా ఉడికించి కిందకు దించాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తగా చేసి తినిపిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.

3. రైస్, బ్రోకలీ మరియు మూంగ్ దాల్

 కావలసిన పదార్థాలు

2 కప్పుల రైస్, ¼ వంతు బ్రోకలీ, 1 టేబుల్ స్పూన్ మూంగ్ దాల్, 3 కప్పుల నీరు

ఎలా తయారు చేసుకోవాలి?

⇒ముందుగా బియ్యం బాగా కడిగి అందులో మూంగ్ దాల్ వేసి నీటిని కలిపి ప్యాన్ లో ఉంచాలి. ఆ తర్వాత బ్రోకలీని క్లీన్ చేసుకుని అందులో యాడ్ చేసుకోవాలి.

⇒కొన్ని నిముషాల పాటు ఉడికించి బాగా మెత్తగా అయ్యేలా పిల్లలకు తినిపించడం వలన బాగా ఇష్టంగా తింటారు.

ఎలా తయారు చేసుకోవాలో అనుమానంగా పై వీడియోలో ఒక్కసారి చూసి తెలుసుకోండి.   

Video Credits : c4cooking

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon