Link copied!
Sign in / Sign up
13
Shares

సంవత్సరం లోపు పిల్లలు ఇష్టంగా తినే 3 వంటకాలు : సులభంగా తయారుచేసుకునే విధానం

12 నెలల వయసులో పిల్లలుకు, అన్ని రకాల ఆహారాలను తినిపించచ్చు.  కానీ వారికీ ఏ ఆహారాన్నైనా అలవాటు చేయడానికి ముందు, పిల్లలు దానిని ఇష్టపడుతున్నారా , లేదా అని కూడా ఆలోచించండి. పిల్లలకు ఇష్టంలేనప్పుడు, ఎంత పోషక విలువలతో కూడుకున్న ఆహారమైన వాళ్ళకు తినిపించలేం. అందుకే పిల్లల తప్పకుండా తినాల్సిన ఆహారాలను, వారికీ నచ్చే విధంగా ఎలా తయారు చేయాలో, ఇక్కడ చూద్దాం…

1. ఉప్మా

కావల్సిన పదార్ధాలు:

ఉప్మా రవ్వ - 1 కప్పు

క్యారట్ ముక్కలు - పావు కప్పు

బీన్స్ ముక్కలు - పావు కప్పు

గ్రీన్ పీస్ - పావు కప్పు

గ్రీన్ క్యాప్సికమ్ - పావు కప్పు

ఆనియన్ - పావు కప్పు

పచ్చి మిరపకాయలు - 3

అల్లం ముక్కలు - పావు కప్పు

ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్స్

ఆవాలు - అర టీ స్పూన్

కరివేపాకు - రెండు రెబ్బలు

ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం:

ప్యాన్ మీద ఆలివ్ నూనె వేడి చేసుకున్నాక, ఆవాలు వేసి, కరివేపాకు, తరిగిన ఆనియన్, అల్లం,పచ్చి మిర్చి, ఒక నిమిషం పాటు వేయించండి.

తరువాత 3 కప్పుల నీరు పోయండి, 2-3 నిమిషాల పాటు మరగనివ్వండి.

ఇందులో ముందుగానే తరిగి పెట్టుకున్న, బీన్స్, పీస్, క్యాప్సికమ్, క్యారట్ ముక్కలను కలపండి.

అవి కాస్త మెత్తపడేవరకు ఉడికించి, అందులో ఉప్మా రవ్వను కలపండి.

3-4 ̥నిమిషాల వరకు ఉడికించాక, పిల్లలకు కోసం రుచికరమైన ఉప్మా సిద్దమవుతుంది.

 

2. దోశ

కావాల్సిన పదార్ధాలు:

బియ్యం - 3 కప్పులు

మినప్పప్పు - 1 కప్పు

సెనగ పప్పు - గుప్పెడు

కంది పప్పు - గుప్పెడు

మెంతులు - అర టీ స్పూన్

చక్కర - 1 టేబుల్ స్పూన్

ఉప్పు - 1 టేబుల్ స్పూన్

తయారు చేసే విధానం:

బియ్యం, మినప్పప్పు, సెనగ పప్పు, కంది పప్పు 4-6 గంటల వరకు నీళ్ళల్లో నానపెట్టండి.

తరువాత వాటిని గ్రైండ్ చేసి, ఒక రాత్రంతా ఉంచండి.

ఉదయం పిల్లలకు దోశలు పోసివ్వండి, పిల్లల ఇష్టంగా తింటారు.

3. చపాతీ

కావాల్సిన పదార్ధాలు:

గోధుమ పిండి - 1 కప్పు

నెయ్యి

ఉప్పు

నీళ్ళు

తయారు చెసే విధానం:

గోధుమ పిండిలో తగినంత నీళ్ళు కలుపుకుని,  పిండిని మెత్తగా కలుపుకోండి

చిన్న చిన్న ముద్దలు చేసి, చపాతీలు చేసుకోండి

చపాతీలను కాల్చడానికి నెయ్యి వాడండి.  పిల్లలు ఇష్టపడుతారు  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon