Link copied!
Sign in / Sign up
3
Shares

ఏడాది పిల్లలకు రాత్రి భోజనానికి రెండు అద్భుతమైన వంటకాలు


ఒక ఏడాది నిండిన పిల్లలకు అనేక రకాల ఆహారాలను ఇవ్వచ్చు. అదే సమయంలో మీరు ఇచ్చే ఆహారం పోషకాలతో నిండివుండాలి. అది వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. పిల్లలకు రాత్రి భోజనానికి, రెండు సులువైన వంటకాలు ఎలా యూ చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

పన్నెండు నెలలు వయసు గల పిల్లలు మనం తినే లాగా మాములుగా తినలేరు. అందువలన వారికబాగా మెత్తగా చేసి సులువుగా నమిలి తినేలా తినిపించండి.

డిన్నర్
1. పన్నీర్ పరాఠా
కావాల్సిన పదార్ధాలు 

1. 2 కప్పుల పన్నీర్

2. ½ టేబుల్ స్పూన్ కారం

3. ¼ టేబుల్ స్పూన్గరం మసాలా

4. ఉప్పు తగినంత

5. ఒక అంగుళం అల్లం

6. గుప్పెడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు

7. ఆంచూర్ పొడి

పరాఠా పిండి కొరకు కావలసిన పదార్ధాలు :

1. 1 కప్పు గోధుమ పిండి

2. తగినంత ఉప్పు

3. 1 టేబుల్ స్పూన్ నూనె

4. పిండి కలపడానికి తగినంత

5. ¼ కప్పు గోధుమ పిండి డిస్టింగ్ కొరకు

పరాఠా వేయడానికి కావలసిన పదార్ధాలు :

1. తగినంత అనెయ్యి లేదా నూనె

తయారీ విధానం :

పన్నీర్ తయారీ విధానం:

1. ముందుగా ఒక్క గిన్నె లో పన్నీర్ తీస్కోండి

2. దాంట్లో కారం,గరం మసాలా,ఆంచూర్ పొడి మరియు ఉప్పు వేయండి.

3. కొత్తిమీర ఆకులు మరియు అల్లం వేయండి.

4. బాగా కలిపి పక్కన పెట్టేయండి

పరాఠా పిండి కలపడం :

1. ముందు గా పెద్ద గిన్నె లో గోధుమ పిండి తీసుకుని అందులో తగినంత ఉప్పు వేయండి

2. నీళ్లు వేసి ఐదు నిమిషాల పాటు బాగా కలపండి .

3. పిండి అతుక్కోకుండా ఉండటానికి కొద్దిగా నెయ్యి వేసి కలిపి ఆలా ఇరవై నిముషాలు పక్కన పెట్టేయండి

పన్నీర్ పరాఠా ను అమర్చి రోల్ చేయు విధానం:

1. ముందుగా కొంచెం కలిపినా పిండి తీసుకొని చిన్న ఉండలు చేసి పెట్టుకోండి

2. స్టూఫిన్గ్ ని మధ్యలో పెట్టండి

3. చుట్టుపక్కలవి తీసుకొని (పిండి ఉండలు) మధ్యలోకి రండి.

4. బాగా నొక్కండి

5. కొంచెం పిండి జల్లి నచ్చిన సైజు లో పరోటా చేసుకోండి .

పన్నీర్ పరాఠా వేయించే విధానం:

1. ముందుగా ఒక వేడి అయినా తవా లో ముందుగా చేసి పెట్టుకుని పరాఠా ను రొండు వైపులా వేయించండి.

2.కొద్దిగా నెయ్యి లేదా నూనె వేయండి

3. ఆకారిగా పన్నీర్ పరాఠా ను సాస్ , రైతా లేదా ఆవకాయ తో సర్వ్ చేస్కోండి.

 
చపాతీ మరియు బెండకాయ కూర

కావాల్సిన పదార్ధాలు :

1. 2 టేబుల్ స్పూన్లు నూనె, బెండకాయ వేయించడానికి .

2. 6 బెండకాయలు

3. 2 టేబుల్ స్పూన్లు నూనె , గ్రేవీ కోసం.

4. 1 స్పూన్ జీరా

5. 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్

6. ½ మీడియం సైజు ఉల్లిపాయ, సన్నగా తరిగి

7. 1 టేబుల్ స్పూన్లు కారం

8. ½ టేబుల్ స్పూన్లు పసుపు పొడి

9. 1 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి

10. ½ టేబుల్ స్పూన్లు గరం మసాలా పొడి

11. 1 కప్ / 2 పెద్ద టొమాటోలు గుజ్జు

12. ¼ ఏడూ గుడి పప్పుల పేస్టూ

13. ½-1 కప్పు నీరు తగినంత

14. ఉప్పు తగినంత

15. 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకులు, చిన్నగా తరిగిన

తయారీ విధానం :

1. ముందుగా ఒక కడాయి పెట్టి అది వేడి అయ్యాక అందులో బెండకాయలను ఫ్రై చేయండి.

2. స్టవ్ మీడియం లో పెట్టి అప్పుడపుడు కలుపుతూ ఉండండి.

3. తీసి పక్కన పెట్టేయండి.

4. ఇపుడు అదే కడాయి లో అవసరం అయితే రొండు టేబుల్ స్పూన్స్ నూనె వేయండి.

5. జీలకర్ర కూడా వేసి వేయించండి.

6. దానితరువాత అల్లం-వెల్లులి పేస్ట్ వేయండి.

7. అందులో మల్లి ఉల్లిపాయలు వేసి వేయించండి.

8. మల్లి తరువాత కారం, పసుపు ధనియాల పొడి మరియు గరం మసాలా వేయండి.

9. అన్ని బాగా ఉడికే దాక స్టవ్ ని సిం లో పెట్టి ఉంచండి.

10 . ఇప్పుడు టమాటో గుజ్జు వేసి బాగా చిక్కటి పేస్ట్ వచ్చేదాకా కలుపుతూ ఉండండి

11. ఇప్పుడు గుడి పప్పు పేస్ట్ వేయండి. అవసరమైనంత ఉప్పు మరియు నీళ్లు వేయండి.

12. గ్రేవీ ని బాగా ఉడకనివ్వండి

13. ఇప్పుడు ముందు గ చేసి పక్కన పెట్టేసుకున్న బెండకాయలని వేసుకోండి. వేసేసి బాగా కలపండి.

14. మూత పెట్టి ఐదు నిమిషాల పటు ఉడకనివ్వండి.

15. ఇపుడు కొత్తిమీర ఆకులు వేసి బాగా కలపండి .

16. ఆఖరిగా బెండకాయ కూర ని అన్నం,చపాతీ లేదా రోటి తో కలిపి సర్వ్ చేయండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon