పిల్లలు ఇష్టపడే 'బెంగాలీ రసగుల్లా' : 10 నిముషాల్లో ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోండి
బెంగాలీ రసగుల్లా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో అందిస్తున్నాం.. తప్పకుండా తెలుసుకోండి

కావల్సిన పదార్ధాలు
పాలు : రెండు కప్పులు
నీరు : ఒకటిన్నర కప్పు
చక్కర : ఒకటిన్నర కప్పు
నిమ్మ రసం : ఒకటిన్నర టేబుల్ స్పూన్
యాలకుల పొడి : చిటికెడు
తయారి విధానం
1. ఒక శుభ్రంగా కడిగిన పాత్రలో, పాలు కాయండి. బాగా మరిగాక టేబుల్ స్పూన్ నిమ్మరసం అందులో కలపండి.
2. బాగా కలియపెట్టండి. పాలు విరిగిపోవడం మొదలవుతుంది. పూర్తిగా విరిగిపోయేవరకు జున్నుగా మారేంతవరకు కలియపెట్టాలి.
3. జున్నును ఒక బట్టలో వేసి నీరును పూర్తిగా పిండేయండి.
4. తరువాత నిమ్మ వగరు పోడానికి జున్నును చల్లని నీరుతో కడగండి.
5. జున్నును ఒక గుడ్డలో మూటకట్టి, ఒక అరగంట సేపు వేలాడదీయండి.
6. ఇప్పుడు పూర్తిగా నీరు లేకుండా, పొడిగా మారిన జున్నును ఉండలుగా చేసి పెట్టుకోండి.
7. ఒక వెడల్పు పాత్రలో ఒకటిన్నర కప్పు నీరుకి, ఒకటిన్నర కప్పు చక్కర కలిపి, లేత చక్కర పాకం పట్టుకోండి.
8. మంట తగ్గించి, పాకంలో ఉండలను జాగ్రత్తగా వేయండి.
9. మూతపెట్టి 10-15 నిమిషాల వరకు, తక్కువ మంటలో అలానే ఉంచండి.
10. తర్వాత దించి చల్లారనించి, కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచండి.
బెంగాల్ రసగుల్లా రెడీ...
