Link copied!
Sign in / Sign up
11
Shares

డబల్ చిన్ ని ఇంట్లోనే సులువుగా తగ్గించుకోవడానికి 7 మార్గాలు

 దవడ కింద గడ్డం భాగం పెరిగి అసహ్యంగా కనపడుతోంది అని ఆందోళన చందుతున్నారా? ఆ కారణంగా సెల్ఫీలు తీసుకోవడానికి భయపడుతున్నారా? మీ డబల్ చిన్ ని కవర్ చేయడానికి స్కార్ఫ్ లాంటివి కట్టుకొని మ్యానేజ్ చేస్తున్నారా? ఇంక అవసరం లేదు. ఈ సులభమైన 7 చిట్కాలు పాటిస్తే అతి తక్కువ సమయంలోనే బరువు తగ్గకుండానే డబల్ చిన్ పోయి మీ ముఖం అందంగా కనపడుతుంది. అవేంటో చూద్దామా… 

1. చూయింగ్ గం

డబల్ చిన్ తగ్గించుకోవడానికి అతి సులభమైన మార్గం చూయింగ్ గం నమలడం. గమ్ నమలడం ద్వారా మీరు దవడ కండరాలు నిరంతరం వ్యాయామం చేస్తున్నారు, ఆ కదలిక క్రమంగా జరగడం ద్వారా కండరాళ్ళలో చలనం కలిగి కొవ్వు తగ్గడానికి సహకరిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, చూయింగ్ గం తినండి, ఛుబ్బి ముఖాన్ని కాస్త చలాకీగా నాజుకుగా మార్చుకోండి.

2. చిన్ (గడ్డం) వ్యాయామం

మీరు మీ పొట్ట ప్రాంతంలో క్రొవ్వు కోల్పోవడానికి ఏమి చేస్తారు? పొట్టకు వ్యాయామం చేస్తున్నారు కదా! అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. అదేంటి డబల్ చిన్ కి కూడా వ్యాయామాలు ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారా? ఉంటాయి మరియు ప్రభావివితమైనవి కూడా. అత్యంత ప్రభావితమైన మరియు సులభమైన ఈ 3 వ్యాయామాలు మీకోసం. నేను ఇంట్లో లేదా పని వద్ద మీరు అభ్యాసం చేయవచ్చు.

మెడ భ్రమణం

మెడ భ్రమణాలన్నీ మీరు పాఠశాలలో డ్రిల్ చేసే రోజుల్లో చేసుంటారు. అయితే, దానినే కొంచెం మార్చి చేస్తే డబల్ చిన్ తగ్గడానికి మంచి వ్యాయామం అవుతుంది. ఈ వ్యాయామం కోసం మీరు నిటారుగా నిలుచొని తలని కిందకి వంచి ఛాతీని తాకడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కిందికి వంగి ఉన్న తలను కొంచం కుడి వైపుకి వాల్చి 5 సెకండ్స్ ఉండండి. తరువాత మెల్లగా మెడను ఇంతక ముందు ఉన్న స్థితికి తీసుకుని రండి. ఇలానే ఎడమ వైపుకి కూడా చేయండి.

పీజియన్ మూవ్

పావురం దాని తలను మాటి మాటికీ తిప్పుతూ ఉండటం గమనించవచ్చు. ఈ వ్యాయామం కూడా అలాంటిదే. మీ బటను వేలును ఒక దవడ మీద మిగిలిన వేళ్ళను మరొక దవడ మీద పెట్టి మీ ముఖాన్ని స్థిరంగా పట్టుకొని తల ఆడించడానికి ప్రయత్నించండి. ఇలా 30 సెకెన్ల పాటు చేయండి. కొన్ని రోజులలోనే మార్పుని గమనించవచ్చు.

గాలిని ముద్దాడడం

ముందుగా మీరు నేరుగా నిలబడి ఉన్నారని నిర్ధారించుకోండి. ఇప్పుడు సీలింగ్ వైపు చూస్తూ మెడను సాంచి గాలిని ముద్దుపెట్టుకోండి. సుమారు 5 సెకన్ల పాటు ఈ పొజిషన్లో ఉండండి మరియు 10-15 సార్లు ఈ వ్యాయామాన్ని రిపీట్ చేయండి.

3. గుడ్డు తెల్లసొన

డబల్ చిన్ వదిలించుకోవడానికి గుడ్డు సొన మరొక మంచి ఇంటి నివారణ. గుడ్డు సొనలోని కొన్ని లక్షణాలు చర్మాన్ని బిగుసుకునేలా చేస్తాయి. అందువలన దీనిని చర్మానికి పూసుకోవడం వలన వదులుగా ఉన్న చర్మం బిగుసుకుంటుంది. ఈ ప్యాక్ చేయడానికి, 1 గుడ్డు తెలుపు, 1 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ పాలు మరియు 1 టీస్పూన్ నిమ్మ రసం కలపాలి మరియు ఈ మిశ్రమానికి పిప్పరమింట్ నూనె యొక్క కొన్ని చుక్కలను జోడించండి. ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై 15 నిమిషాలపాటు ఉంచి తరువాత కడగాలి. ఈ మిశ్రమంలో హాని చేసే పదార్థాలు లేవు కావున రోజు దీనిని వాడినా ఎటువంటి దుష్ప్రయోజనాలు ఉండవు.

4. కోకో వెన్న

కోకో వెన్న నిజానికి చర్మం ఎలాస్టిసిటీ పెరగడంలో ఉపయోగపడుతుందని అంటారు. కోకో వెన్న తీసుకోని మైక్రోవేవ్ లో 5-10 సెకన్ల పాటు వేడి చేయండి. ఇప్పుడు, స్నానం చేయటానికి ముందు మీ చిన్ ని రోజు మసాజ్ చేయండి. ఇది రక్త ప్రవాహాన్ని పెంచి డబుల్ చిన్ల రూపాన్ని తగ్గించడానికి దోహద పడుతుంది.

5. గ్రీన్ టీ బాగ్స్

గ్రీన్ టీ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిలో ఒకటి డబల్ చిన్ ని తగ్గించడం. గ్రీన్ టీ కూడా కోకో వెన్న లానే చర్మం ఎలాస్టిసిటీని పెంచుతుంది. ఇది మీ చర్మం లేతగా ఉండేలా చేసి సాగడం వంటివి జరగకుండా ఆపుతుంది. ఉడికించిన టీ బాగ్స్ తో మీ చర్మాన్ని రోజుకి 5 నిముషాలు మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

6. విటమిన్ E నూనె

విటమిన్ E నూనె చర్మంలో కొత్త కణాలను పుట్టించి బిగువుగా ఉండడానికి సహకరిస్తుంది. అందువలన విటమిన్ E ఆయిల్ తో రోజుకి 15 నిముషాలు మర్దనా చేసుకుంటే మీ డబల్ చిన్ తగ్గడం మీరే గమనించవచ్చు.

7. గ్లిజరిన్ మరియు ఎప్సోమ్ సాల్ట్

ఒక టీ స్పూన్ గ్లిజరిన్ మరియు అర టీ స్పూన్ ఎప్సోమ్ సాల్ట్ ని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూసుకోవాలి. మొదట్లో కొంచెం నవ్వగా అనిపించవచ్చు, కంగారుపడకండి, అది సర్వసాధారణం. 5 నుంచి 10 నిముషాలు ఉంచిన తరువాత చాలా చల్లటి నీళ్ళతో కడిగేయాలి.

ఈ 7 మార్గాల ద్వారా  అతి తక్కువ సమయంలోనే మీ డబల్ చిన్ ని తగ్గించుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, పాటించండి - మీ చుట్టూ అందం అనే పరిమలాన్ని వెదజల్లండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon