Link copied!
Sign in / Sign up
2
Shares

ప్రెగ్నన్సీ సమయంలో మరియు డెలివరీకి ముందు యోని భాగంలో షేవింగ్ చేసుకోవడం ప్రమాదమా..?

గర్భంతో ఉన్నప్పుడు మరో కొద్ది రోజుల్లో బిడ్డకు జన్మను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో పవిత్రమైన యోని భాగంలో మహిళ షేవింగ్ చేసుకోవచ్చని కొందరు, చేసుకోకూడదు అని కొందరు చెబుతున్నారు. కానీ, ఇందులో ఏది నిజమో అని అందరూ గందరగోళంలో ఉన్నారు. ఈ రోజు వివరంగా ఈ విషయం గురించి తెలుసుకుందాం..

ప్రెగ్నన్సీ అప్పుడు షేవింగ్ చేసుకోవచ్చా..!

అనుభవజ్ఞులైన వైద్యులు చెబుతున్న ప్రకారం గర్భంతో ఉన్నప్పుడు డెలివరీకి వారం లేదా పది రోజుల ముందు యోని భాగంలో షేవింగ్ చేసుకోవడం మంచిదేనని అంటున్నారు. ఎందుకంటే బిడ్డకు జన్మను ఇచ్చే సమయంలో యోని భాగం క్లీన్ గా ఉండటం వలన ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మరియు బాక్టీరియా చేరదు. అలాగే చెమట, దుర్వాసన లేకుండా శుభ్రంగా ఉండటం వలన బయటకు వచ్చే బిడ్డకు మంచిదని చెబుతున్నారు.

ఎలా షేవింగ్ చేసుకోవాలి?

గర్భంతో ఉన్న మహిళకు ఈ సమయంలో యోని చుట్టూ షేవింగ్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన మరియు బాధాకరమైన విషయం. అందుకని బాత్ టబ్ లో పడుకుని ఎదురుగా అద్దం అమర్చుకుని మీరే లేదా మీ స్నేహితులతో గానీ సన్నిహితులతో గానీ చేయించుకోవచ్చు. ఎలక్ట్రిక్ ట్రిమ్మర్ లేదా రేజర్ తో క్లీన్ చేసుకోవచ్చు. మీరు చేసుకోకపోయినా డెలివరీ సమయంలో సాధారణంగా నర్సులు షేవింగ్ చేస్తారు. ఆ సమయంలో తెలియనివారు ఈ విధంగా చేస్తుంటే భయపడకూడదు. ఎందుకంటే మీ సేఫ్టీ కోసమే చేస్తున్నారు కాబట్టి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

డెలివరీకి ముందు షేవింగ్ చేసుకోవడం అనేది రిస్క్ తో కూడుకున్న విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త రేజర్ బ్లేడ్ ఉపయోగించడం. నర్సు షేవ్ చేస్తున్నప్పుడు కూడా కొత్తదే వాడమని చెప్పడం చేయాలి. ఎటువంటి గాట్లు పడకుండా రక్తం బయటకు రాకుండా చూసుకోవాలి. సగంసగం షేవ్ చేసుకోవడం వలన బయటకు వచ్చే బిడ్డకు వెంట్రుకలు గుచ్చుకునే ప్రమాదం ఉంది. అలాగే డెలివరీ సమయంలో బిడ్డ బయటకు రాకుండా ఇబ్బంది పడుతుంటే డాక్టర్స్ బయటకు తీయడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి, షేవింగ్ చేసుకోవడం ఉత్తమం.

మీకు ఏమైనా అనుమానాలు ఉంటే షేవింగ్ గురించి మీ డాక్టర్ ను గానీ మీ ఫ్రెండ్స్ లేదా పెద్దవారిని అడిగి సలహాలు తీసుకోండి. ఇది చిన్న విషయం అనుకోవడం పొరపాటు. అందరికీ SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon