Link copied!
Sign in / Sign up
72
Shares

డెలివరీ తర్వాత మీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించే 6 ఉత్తమ ఇంటి చిట్కాలు

పిల్లలకు జన్మను ఇచ్చిన ప్రతి తల్లిలోనూ ఇది సాధారణంగా ఉండే సమస్య. సహజంగా లేదా సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మను ఇచ్చినప్పుడు పొట్ట చుట్టూ అధిక కొవ్వు ఏర్పడటం, చూడటానికి ఇబ్బందికరంగా ఫీలవుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ సులభ మార్గాల ద్వారా మీ  పొట్ట చుట్టూ  ఉండే కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుని అందరికీ SHARE చేయండి.

పొట్ట చుట్టూ బెల్ట్

డెలివరీ తర్వాత చాలామంది మహిళలు తమకు తెలియకుండానే పొట్ట లావు అవుతూ ఉండటం, అధిక కొవ్వు కలిగి ఉండటం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు తీసుకునే ఆహారమో లేక రెస్ట్ ఎక్కువగా తీసుకోవడం వలనో కాదని గుర్తించండి. సహజంగా డెలివరీ అయిన వారు ఈ బెల్ట్ ను ఒక రోజు తర్వాత వాడవచ్చు. అదే సిజేరియన్ ఐతే ఒక వారం తర్వాత వాడటం మంచిది. ఎప్పుడు దీనిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎలా వాడాలో మీకు డాక్టర్ వివరంగా చెబుతారు.

తేనె మరియు నిమ్మరసం

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు స్పూన్ల నిమ్మరసం మరియు ఒక స్పూన్ తేనె కలుపుకుని ఉదయాన్నే ఈ నీటిని తాగడం చేయాలి. లేదా భోజనం తీసుకునే పది నిముషాల ముందు ఇది తీసుకోవడం వలన పొట్ట ఫ్లాట్ గా అవుతుంది.

బిడ్డకు పాలు ఇవ్వడం వలన

ప్రతి రోజూ మీ బిడ్డకు బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వలన దాదాపు 500 కేలరీలు ఖర్చు అవుతాయి. ఇలా చేయడం వలన మీ శరీరంలో కొవ్వు శాతం క్రమంగా తగ్గిపోతుంది. అలాగే రోజూ ఎంత ఎక్కువ మోతాదులో నీటిని తీసుకుంటే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవచ్చు.

కరివేపాకు మరియు వెల్లుల్లి

ప్రతి రోజూ ఉదయం నోరు శుభ్రం చేసుకున్న తర్వాత రెండు వెల్లుల్లి రిబ్బలను తినడం వలన కొవ్వును శరీరంలోకి చేరనివ్వదు. అలాగే కరివేపాకును మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చేసుకోవాలి. ఇంకా ప్రతిరోజూ ఒక గ్లాస్ నిమ్మరసం తాగడం వలన కొవ్వును దూరం చేసుకోవచ్చు.

గ్రీన్ టీ

ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక కప్పు గ్రీన్ టీ సేవించడం వలన పొట్ట చుట్టూ కొవ్వు చేరకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వలన జబ్బుల బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఆపిల్

ఇందులో అధిక మోతాదులో పీచుపదార్థం ఉండటం వలన త్వరగా తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి కొవ్వు ఏర్పడకుండా కడుపు ఫ్లాట్ గా ఉండేలా సహాయపడుతుంది. ఆపిల్ కేవలం ఆరోగ్యాన్ని ఇవ్వడానికే కాదు, నడుం, పొట్ట చుట్టూ ఉండే కొవ్వును దూరం చేస్తుంది.

ఇది మిస్ అవ్వకండి

ఆహారం తీసుకోవడం వలనే నేను లావు, బరువు పెరుగుతున్నాను అనేది తప్పు. అంతకన్నా మీరు సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా మరో కారణం. అందుకని రోజులో 4 సార్లు అయినా సరే కొద్దిమొత్తంలో తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి. మీరు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మిస్ అవ్వడం వలన పొట్టలో గ్యాస్ ఫామ్ అయ్యి కొవ్వుశాతాన్ని పెంచుతుంది.

ఈ విధంగా మీరు ఫాలో ఐతే తక్కువ టైములోనే మీరు మళ్ళీ నాజూకుగా అవుతారు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon