డెలివరీ తరువాత జుట్టు రాలడాన్ని పూర్తిగా ఆపేసే 5 చిట్కాలు
ఆడవారిలో సాధారణంగా రోజుకు 100 వెంట్రుకలు జుట్టునుండి రాలిపోతాయి. ప్రెగ్నన్సీ సమయంలో శరీరంలో ఈస్ట్రోజెన్ విడుదల అధికంగా ఉంటుంది. దీని వలన జుట్టు రాలడం తగ్గుతుంది. అయితే డెలివరీ తరువాత ఈస్ట్రోజెన్ స్థాయిలు పూర్తిగా పడిపోతాయి. జుట్టు రాలడం అధికమవుతుంది. రోజు ఎక్కువ వెంట్రుకలు రాలిపోతాయి. డెలివరీ తరువాత కొన్ని చిట్కాలతో రాలిపోయే జుట్టును తగ్గించచ్చు…
1. టైట్ గా జుట్టు వేసుకోవద్దు
బిగువుగా జుట్టును ముడి వేసుకోవడం వలన, కుదుళ్ళ మీద ఎక్కువ వత్తిడి పడుతుంది. దీనివలన జుట్టు రాలడం అధికమవుతుంది. అందుకే జుట్టును లూస్ గా కట్టుకోండి.
2. సరైన ఉత్పత్తులు వాడండి
ప్రెగ్నన్సీ తరువాత మీ జుట్టుకు వాడడానికి, ఎంచుకునే ఉత్పత్తులను, జాగ్రత్త ఎంచుకోండి. మీ జుట్టు స్వభావానికి వాడదగిన, షాంపూలను, కండీషనర్ లను మాత్రమే వాడండి. వీలున్నంత వరకు కెమికల్స్ తక్కువగా ఉండే ఉత్పత్తులను వాడండి.
3. హెయిర్ డ్రైయర్స్ వాడద్దు
సాధ్యమైనంత వరకు హెయిర్ డ్రైయర్స్, స్ట్రెయిట్’నర్స్, కర్లెర్స్ లాంటివి వాడకండి. వాటి ద్వారా వచ్చే అధిక వేడి, కుదుళ్ళను దెబ్బతీస్తుంది. హెయిర్ ఫాల్ అధికమవుతుంది.
4. జుట్టు తగ్గించుకోండి
డెలివరీ తరువాత జుట్టును షార్ట్ గా ఉంచుకోడానికి ప్రయత్నించండి. జుట్టు షార్ట్ గా ఉంటే మెయింటైన్ చేయడం సులభం. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
5. మంచి ఆహారం
జుట్టుకు కావాల్సిన ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. పండ్లు కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు బలంగా ఉండడానికి చాలా అవసరం.
మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..
Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.
ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.
Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి http://bit.ly/naturalfc
