Link copied!
Sign in / Sign up
2
Shares

డెలివరీ తరువాత ఈ 6 లక్షణాలు కనపడితే ముందే జాగ్రత్త పడండి

 9 నెలలు బిడ్డను మోసి ప్రసవించిన తరువాత, మీ శరీరం తిరిగి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది ఆ కోలుకునే సమయంలో శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. వాటిలో కొన్ని సహజంగా జరిగేవి అయితే మరికొన్ని ఏదైనా సమస్యకు లక్షణాలు కావచ్చు. అందుకే డెలివరీ తరువాత మీరు నిర్లక్ష్యం చేయకూడని కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటో ముందే తెలుసుకుని జాగ్రత్తపడండి…

1. మూత్రానికి పోయే సమయంలో మంట

డెలివరీ తరువాత ఇలా సహజంగా జరుగుతుంది. మూత్రానికి పోయే సమయంలో మూత్రం కుట్లు దగ్గర లేదా పొత్తి కడుపులో తగిలి మంట రావడం సహజం. కానీ మూత్రానికి పోయే సమయంలో యోని లోపల మంట రావడం ఏదైనా ఇన్ఫెక్షన్ కు సూచన కావచ్చు. తప్పకుండా డాక్టర్ ను సంప్రదించండి.

2. రక్తస్రావం

డెలివరీ తరువాత రక్తస్రావం లేదా రక్తం గడ్డ కట్టడం సహజంగా జరుగుతాయి. కానీ ఎక్కువ మోతాదులో రక్తం పోతుంటే మీరు తప్పకుండ జాగ్రత్త పడాలి. రోజు రెండు ప్యాడ్స్ మారిస్తే ఎక్కువ రక్తం పోతున్నట్టు అర్ధం చేసుకోవాలి.

3. తలనొప్పి

డెలివరీ సమయంలో ఎపిడ్యూరల్ ఇవ్వడం వలన తలనొప్పి రావడం సహజం. అలాగే మైగ్రేన్ ఉన్న తలనొప్పి వస్తూవుంటుంది. కానీ తల నొప్పితో పాటు కళ్ళు మసకగా కనిపించడం, వికారం లాంటి లక్షణాలతో తల నొప్పి ఉంటే అది ఏదైనా సమస్యకు సూచన కావచ్చు ముందే జాగ్రత్త పడాలి.

4. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

మీరు ఏదైనా పని చేసిన తరువాత బాగా అలసిపోవడం, లేదా శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడడం లాంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. అందుకు కారణం ఊపిరితిత్తుల్లో రక్తం గెడ్డ కట్టడం కావచ్చు. వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

5. జ్వరం

డెలివరీ తరువాత అప్పుడప్పుడు జ్వరం రావడం సహజమే. కానీ తీవ్రమైన జ్వరం ఎక్కువ సార్లు వస్తూ ఉంటే ఏదైనా సమస్యకు కారణం కావచ్చు. తప్పకుండా డాక్టర్ ను సంప్రదించండి.

6. చాతి నొప్పి

డెలివరీ సమయంలో ఎక్కువ బలాన్ని ఉపయోగించడం వలన లేదా ముందు  నుంచి ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్ వలన డెలివరీ తరువాత చాతి నొప్పి రావచ్చు. కానీ ఇంకా ప్రమాదమైన కారణం ఏంటంటే, పల్మనరీ ఎంబాలిజం. అంటే ఊపిరి తిత్తుల్లో రక్తం గడ్డ కట్టడం. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon