Link copied!
Sign in / Sign up
6
Shares

డెలివరీ ముందే నీటి సంచి పగిలిపోతే కడుపులో బిడ్డను ఎలా కాపాడుకోవాలి?

మీరు ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు గర్భంలోని బిడ్డ అమ్నియోటిక్ ద్రవాలతో  నిండిన ఒక సంచిలో ఉంటాడు. పిండం ఎదిగే క్రమంలో ఈ ద్రవాలు పిండాన్ని ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తాయి. ఈ సంచిని వైద్యుల పరిభాషలో వాటర్ బాగ్ లేదా నీటి సంచి అంటారు.

మీ కాన్పు మొదలైనప్పుడు ఈ నీటి సంచి పగిలిపోతుంది. అందులోని ద్రవాలు మీ యోని ద్వారా బయటకు వస్తాయి. అయితే కొన్ని సార్లు అనేక కారణాల వలన మీ కాన్పు మొదలవ్వక ముందే నీటి సంచి పగిలిపోవచ్చు. అప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి…

1.ముందుగా మీరు నీటి సంచి పగిలిన తరువాత హాస్పిటల్ కు వీలున్నంత త్వరగా వెళ్ళడానికి ప్రయత్నించండి.

2.ఒక సారి నీటి సంచి పగిలితే, మీ కడుపులోని బిడ్డకు ఇప్పుడు ఇన్ఫెక్షన్ లు సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది.  అందుకే గర్భస్థానం నుండి ఇన్ఫెక్షన్లు బిడ్డకు చేరకుండా జాగ్రత్త పడండి.

3. నీటి సంచి పగిలిన తరువాత స్నానం చేయకండి.

4. తల్లి గర్భస్థానం నుండి ద్రవాలు ఇంకా వస్తు ఉంటే, డైపర్ వాడడం మంచిది. వేరే పదార్ధాలు యోనిలోకి వెళ్ళకుండా కూడా డైపర్ రక్షణ ఇస్తుంది.

5. కాన్పు దగ్గర పడిన సమయంలో నిదానంగా నడవడం మంచిది. అలాగే గర్భం మీద ఏ వత్తిడి కలగకుండా చూసుకోవడం మంచిది. 

image source : carolina fence.es

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon