Link copied!
Sign in / Sign up
7
Shares

డెలివరీ కోసం హాస్పిటల్ ను ఎలా ఎంచుకోవాలి?

మీ ప్రెగ్నన్సీ నిర్ధారణ అయ్యిందా? మొదటి నెల కూడా గడిచిపోయిందా?ఇపుడు మీ మనసులో మెదులుతున్న ప్రశ్న ఏంటో మాకు తెలుసు. డెలివరీ కోసం ఎలాంటి హాస్పిటల్ ఎంచుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా జాగ్రతగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు ఎంచుకున్న హాస్పిటల్లో, మీకు కావాల్సిన సదుపాయాలు అన్ని ఉన్నాయా లేవా? అక్కడ పని చేసే డాక్టర్స్ ఎలాంటి వారు? ఇలా మీరు హాస్పిటల్ ఎంచుకునే ముందు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాంటి ముఖ్యమైన 5 విషయాలు ఏంటో చూడండి….

1.మెటర్నిటీకి సంబంధించిన అన్ని పరికరాలు ఉన్నాయా?

ఇదే మీరు ముందు వేసుకోవాల్సిన ప్రశ్న. ప్రెగ్నన్సీ తో ఉన్నపుడు, ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులు రావచ్చు. అలాంటి అత్యవసర పరిస్తితిలో కావాల్సిన అన్ని పరికరాలు హాస్పిటల్లో ఉండాలి. ముందుగా ఆపరేషన్ థియేటర్ (O T). ఐసీయూ (ICU) 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఇంక్యూబేటర్ లాంటి పరికరాలు ఉన్నాయా? లేవా? ముందే తెలుసుకోండి.

2. సి-సెక్షన్(C-section), విబిఏసి( VBAC) సదుపాయాలు ఉన్నాయా?

మీ కాన్పు ఎలా అయినా జరగచ్చు. సాధారణ కాన్పు జరిగితే ఏ సమస్య లేదు. కానీ మాములు కాన్పు కుదరని పరిస్థితిలో సి-సెక్షన్ (C-section) జరగడానికి అన్ని సదుపాయాలు మీరు ఎంచుకునే హాస్పిటల్లో ఉండాలి. అలాగే విబిఏసి-VBAC (Vaginal Birth After Cesarean), మొదటి కాన్పు సిజేరియన్ అయితే, రెండవ కాన్పు సాధారణ కాన్పు అవ్వడానికి అవలంబించే పద్ధతులు తప్పకుండా ఉండాలి. ఆ పద్ధతులనే విబిఏసి(VBAC) అంటారు.

3.సరైన అవగాహనా కల్పిస్తున్నారా?

ప్రెగ్నన్సీ తో ఉన్న అందరికి డెలివరీ గురించి చాలా అనుమానాలు, భయాలు ఉండడం సహజం. మీరు ఎంచుకున్న హాస్పిటల్ మీ అనుమానాలన్నిటికి సమాధానం ఇవ్వాలి, మీ భయాలన్నీ పోగొట్టాలి. ప్రెగ్నన్సీ గురించి, డెలివరీ గురించి, డెలివరీ తర్వాత వచ్చే సమస్యల గురించి మీకు పూర్తి అవగాహనా కల్పించాలి.

4.హాస్పిటల్ మీ ఇంటికి దగ్గరగా ఉండాలి

మీకు నొప్పులు ఎప్పుడైనా రావచ్చు. ఏ సమయంలోనైనా హాస్పిటల్ కి వెళ్ళాల్సిన పరిస్తితి రావచ్చు. అందుకే మీరు ఎంచుకునే హాస్పిటల్ మీ ఇంటికి దగ్గర ఉండేలా చూసుకోండి. ఏ సమయం లోనైనా హాస్పిటల్ కి వెంటనే చేరుకునే విధంగా ఉండాలి.

5.మానసిక సమస్యలకు సరైన వైద్యం అందుతుందా?

డెలివరీ తరువాత కొంతమంది మహిళలలో మానసిక సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలకు మీరు ఎంచుకున్న హాస్పిటల్ లో సరైన వైద్యం అందించాలి. గైనకాలోజిస్ట్ తో పాటు సైక్రియార్టిస్ట్ కూడా అవసరాన్ని బట్టి అందుబాటులో ఉండాలి.   

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon