Link copied!
Sign in / Sign up
15
Shares

డెలివరీ జరిగిన ఎన్ని రోజుల తర్వాత సెక్స్ లో పాల్గొనాలి? వైద్యులు చెప్పిన నిజాలు

సహజ కాన్పు అయిన, సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినప్పుడు మహిళలలో కొన్ని శారీరక, మానసిక మార్పులు జరుగుతాయి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ వచ్చే సందేహం ఏంటంటే ప్రసవం తర్వాత మళ్ళీ ఎప్పుడు దంపతులు సెక్స్ లో పాల్గొనవచ్చు? అని. ఈ సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి అందరికీ తెలిసేలా SHARE చేయగలరు.

రక్తస్రావం రాకుండా ఉంటే

మహిళలలో ప్రసవం తర్వాత శక్తి తగ్గిపోయి శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండలేరు. అటువంటి సమయంలో గర్భవిచ్ఛిత్తి జరుగుతుందేమోనని ప్రతి ఒక్కరిలో భయం ఉంటుంది. సహజకాన్పు అయిన ఒక నెలన్నర (45 రోజుల) తర్వాత యోని నుండి ఎటువంటి దుర్వాసన, బ్లీడింగ్ రాకుండా గర్భసంచి మునుపటి స్థానంలో ఉంటే ఇద్దరికీ ఇష్టమైతే భయంలేకుండా సెక్స్ లో పాల్గొనవచ్చు.

సిజేరియన్ తర్వాత శృంగారం

సిజేరియన్ ఆపరేషన్ జరిగిన తర్వాత అయినా సహజ కాన్పు జరిగిన తర్వాత అయినా సరే మొదటి 6 వారాలు శృంగారానికి దూరంగా ఉండటం మంచిది. సిజేరియన్ అయినప్పుడు కుట్లు, అక్కడ నొప్పిగా ఉంటుంది, ఎప్పుడైతే కుట్లు ఎండిపోయి, మహిళకు నొప్పి లేదు అనిపించి శృంగారంలో పాల్గొనేందుకు మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉంటే సెక్స్ లో పాల్గొనవచ్చు. లేదంటే 3 నెలలు దంపతులు శృంగారానికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

పాలిచ్చే తల్లులు శృంగారంలో

బిడ్డకు పాలు ఇచ్చే తల్లులు శృంగారంలో పాల్గొనడం వలన మళ్ళీ గర్భం వచ్చే అవకాశం ఉంది, అందుకని గర్భ నిరోధక సాధనాలు వాడటం మంచిది. పురుషులు ఐతే కండోమ్, మహిళలు అయితే కాపర్ T లేదా గర్భ నిరోధక మాత్రలు వాడటం మంచిది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

సెక్స్ చేయడం ఆపేసిన తరువాత మహిళల శరీరంలో జరిగే 7 మార్పులు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon