Link copied!
Sign in / Sign up
9
Shares

డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులకు స్నానం చేయాలి? ఎలా చేయాలి?

తల్లిగా మీరు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. మీ బిడ్డను మీ చేతుల్లోకి తీసుకున్న ఎంత ఆనందం, ఉత్సాహం, సంతోషం ఉంటుందో ప్రసవం తర్వాత అలసట, వికారం, నొప్పులు ఉండటం సహజమే. అయితే డెలివరీ అయిన తర్వాత తల్లి ఎప్పుడు స్నానం చేయాలి అనే విషయంపై చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ వివరంగా చెప్పడం జరిగింది.

నార్మల్ డెలివరీ జరిగినట్లయితే..!

మీరు యోని నుండి బిడ్డకు (నార్మల్ డెలివరీ) జన్మను ఇచ్చినట్లయితే ఒక రోజు తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రసవం తర్వాత జ్వరం వస్తున్నా, రక్తస్రావం జరుగుతున్నా వెంటనే వైద్యుడి సలహా తీసుకుని ఎప్పుడు స్నానం చేయాలో అడగాలి. ఎందుకంటే ప్రసవం తర్వాత జ్వరం, రక్తస్రావంగా ఉంటే స్నానం చేయాల్సిన అవసరం లేదు.

ప్రసవం జరిగిన వెంటనే స్నానం చేయడం వలన కలిగే ఉపయోగాలు

నార్మల్ డెలివరీ అయిన తర్వాత వెంటనే స్నానం (కొన్ని గంటలు గడిచాక లేదా ఒక రోజు తర్వాత) మీకు నడవడానికి ఓపిక, ఒంట్లో శక్తి ఉండి, ఆక్టివ్ గా ఉన్నట్లయితే స్నానం చేయవచ్చు. అది కూడా మరీ వేడి నీరు, చల్ల నీరు కాకుండా గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ప్రసవం తర్వాత స్నానం చేస్తే కలిగే ఉపయోగాలు…

*ప్రశాంతంగా, రిలీఫ్ గా ఉండేలా చేస్తుంది. రక్త ప్రసరణ బాగా జరగడానికి ఉపయోగపడుతుంది.

*యోని నుండి వచ్చే దుర్వాసనను ఆపుతుంది. రక్తస్రావం తర్వాత ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కలగకుండా చేస్తుంది.

*మీ శరీరం నుండి చెమట దుర్వాసన, ఒళ్ళు నొప్పుల కారణంగా మంచి నిద్ర కలగదు కాబట్టి స్నానం చేయడం వలన మంచి నిద్ర వస్తుంది.

సిజేరియన్ డెలివరీ జరిగినట్లయితే..!

ఇది చాలా ముఖ్యమైన విషయం. సిజేరియన్ డెలివరీ జరిగిన తర్వాత ఎప్పుడు స్నానం చేయాలి అనే అపోహ అందరిలోనూ ఉంది. డెలివరీ అయిన మరుసటి రోజు స్నానం చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అని చాలామంది అడుగుతున్నారు. C-సెక్షన్ జరిగాక పొట్ట చుట్టూ కుట్లు, గాట్లు ఉంటాయి కాబట్టి, వెంటనే స్నానం వద్దని వైద్యులు సూచిస్తారు. ఐతే మీరు ఒకరోజు గడిచాక నడవగలవుతున్నట్లయితే, ఆక్టివ్ గా ఉన్నట్లయితే స్నానం చేయవచ్చని చెబుతున్నారు. అయితే సి-సెక్షన్ తరవాత స్నానం చేసేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

*పొట్ట చుట్టూ ఉన్న కుట్ల వద్ద సోప్, వాటర్ తో బాగా శుభ్రం చేసుకోవాలి. అలాగే బాగా తడి ఆరేవరకు తుడుచుకోవాలి. ఇలా చేయడం వలన కుట్లు పడిన చోట ఇన్ఫెక్షన్స్ రాకుండా దోహదపడుతుంది.

*నిజానికి C-సెక్షన్ జరిగిన తరవాత ఒక వారం లేదా పది రోజుల తర్వాత స్నానం చేయమని చెబుతుంటారు. నొప్పి ఎక్కువగా ఉంటుంది కాబట్టి షవర్ కింద నిలబడి లేదా బాత్ టబ్ లో పడుకుని స్నానం చేయాలి. ఎందుకంటే కూర్చోవడం వలన ఉదరంపై నొప్పి తీవ్రత ఉంటుంది కాబట్టి.

డెలివరీ అయ్యాక స్నానం చేసేముందు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

1. ప్రసవం తర్వాత ఎన్ని రోజులకు స్నానం చేయాలి. అలాగే బిడ్డకు స్నానం ఎప్పుడు చేయించాలో అడగండి.

2.జ్వరం లేదా ఇన్ఫెక్షన్స్ సమస్య ఉంటే వెంటనే వైద్యుడి సలహా తీసుకోవాలి. 24 గంటలలోపు స్నానం చేసేవారు మరీ వేడి నీరు, చల్లనీరు వాడకూడదు. మైకం కమ్మే ప్రమాదం ఉంది.

3.స్నానాల గదిలోకి బాగా గ్రిప్ ఉన్న చెప్పులను వేసుకోవడం చేయాలి. బాత్ రూమ్ లో కొన్ని చెప్పులు జారడం వలన మీకు గోడలు పట్టుకునే వీలు ఉండదు మరియు మీకు ప్రమాదం కూడా.

4.సి సెక్షన్ జరిగిన వారు కాకుండా మిగతా వారు కొన్ని రోజుల పాటు స్టూల్ పై కూర్చుని స్నానము చేయడం మంచిది.

5.స్నానం చేసిన తర్వాత శుభ్రంగా తడి ఆరేవరకు తుడుచుకోవడం చేయాలి. మనదేశంలో డెలివరీ అయిన కొన్ని రోజులకు ఒంటిపై ఆయిల్ తో మసాజ్ చేసి ఒక ప్రత్యేకమైన రోజు అనుకుని వెచ్చని నీటితో స్నానం చేయించడం ఆనవాయితీగా వస్తోంది. 

ఈ ముఖ్యమైన విషయాన్ని అందరికీ SHARE చేయండి.  

 

Cover Image Source : Pexels

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon