Link copied!
Sign in / Sign up
2
Shares

దయచేసి క్రమశిక్షణ పేరుతో పిల్లలను క్షోభ పెట్టకండి!!!


ఈ వీడియో చూసిన తరువాత ప్రతి తల్లి మనసు చలిస్తుంది. ఎవరి బిడ్డయినా అలా కన్నీరుకారుస్తూ, చేతులెత్తి తనను కొట్టదు అని వేడుకుంటుంటే, ఏ అమ్మ హృదయమైన బాధపడుతుంది.

అసలు ఏమి జరిగింది?

వీడియోలో ఉన్న పాప వయసు 6 ఏళ్ళు. తను మ్యాథ్స్ హోమ్ వర్క్ చేయించడానికి, తన అమ్మ పెడుతున్న హింసను తట్టుకోలేక, చేతులెత్తి తనను ఇలా హింసించదు అని వేడుకుంటుంది. ఈ వీడియో ఇంటర్నెట్ లో, సామజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. దీనిని చూసిన ప్రతిఒక్కరి హృదయం కదిలిపోతుంది.

అయితే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తోషీ శబరి, ఈ వీడియోలో ఉన్నది తన అక్క కూతురని, అందులో ఆ అక్క తప్పు ఏమి లేదని సంజాయిషీ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఇలా సంజాయిషీ ఇవ్వడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. క్రికెటర్స్ కోహ్లీ, ధావన్ కూడా, వీడియో పాప ఏడుపుకు చలించిపోయి, దయచేసి పిల్లల్ని ఇలా హింసించధ్ధు అని, పిల్లలకు నచ్చినది నేర్పించండి, రానిదాన్ని నిదానంగా నేర్పించండి, అని తల్లి తండ్రులకు విజ్ఞప్తి చేసారు.

వీళ్ళు చెప్పింది నిజం, పిల్లల్ని ఇలా కొట్టడం వలన, వారి మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. IQ స్థాయులు కుడా తగ్గుతాయి. వారి పూర్తి మానసిక ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది.

ఈ వీడియోను SHARE చేయండి. పిల్లలను ఇలా హింసించకూడదు అని అందరికి తెలియచేయండి

ఇవి కూడా చదవండి

మీ కడుపులో పిల్లలు చేసే అల్లరి ఈ వీడియోలో చూడండి….

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon