Link copied!
Sign in / Sign up
0
Shares

ఈ మహిళ చేసిన సాహసం చూస్తే దిమ్మ తిరుగుతుంది : ‘డేరింగ్ లేడీ’ అంటున్న సోషల్ మీడియా

మహిళలు ఏదైనా విషయంలో తెగించి కాస్త ముందడుగు వేస్తే వారిని ఆపడం ఎవరి వలనా కాదని ఎన్నోసార్లు నిరూపితమైంది కూడా. ఇక్కడ చెప్పుకోబోయేది కూడా అటువంటి సంఘటన గురించే. మీకు ఇది బోర్ కొడుతుందేమో గానీ, మనకు సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యకు ఎదురుగా నిలబడి పోరాడాలి అని తెలిపే ఈ సంఘటన రెండు వారాల క్రితం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియో ఇదే… అసలు ఏం జరిగిందో వివరంగా ఇక్కడ తెలుసుకోండి..

Video Credits : RT
అసలు ఏం జరిగిందంటే..

బ్రెజిల్ లో రెండువారాల క్రితం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక బస్టాప్ లో కొందరు మహిళలు తమ చిన్నారులతో కలిసి నిల్చున్నారు. ఇంతలో అక్కడికి ఓ దొంగ చేతిలో గన్ తో వచ్చి వారిపై ఎక్కుపెట్టి బెదిరించసాగాడు. ఆ దొంగ అలా గన్ గురి పెట్టడంతో అక్కడున్న మహిళలు చిన్నారులు భయపడి పోయారు. కానీ ఒక్క మహిళ మాత్రం ఏ మాత్రం భయం లేకుండా తన వద్ద ఉన్న మరో గన్ తో అతడిపై ఎక్కుపెట్టి కాల్చింది. బుల్లెట్ తాకగానే అతడు కిందపడిపోయాడు. అతడి చేతిలో ఉన్న తుపాకీ కాస్త దూరంలో పడిపోయింది. వెంటనే అతడి దగ్గరకి వెళ్లి కాలితో తుపాకీని దూరంగా తోసివేసింది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ఈమె ఎవరో తెలుసా..!

అంత ధైర్యంగా దొంగపై తుపాకీతో కాల్చివేసిన ఈ మహిళ ఓ పోలీస్ అధికారి. తన కూతురిని స్కూల్ లో వదిలి పెట్టేందుకు తీసుకు వెళ్తుండగా ఇది చోటు చేసుకుంది. అయితే అప్పుడు ఆమె పోలీస్ డ్రెస్ లో లేకపోవడంతో ఆ దొంగ తెలుసుకోలేకపోయాడు. బ్రెజిల్ పోలీస్ అధికారిగా పనిచేస్తున్న ఈమె పేరు కటియా దా సిల్వా సస్త్రే. ఈ పేరు పలకడానికి కాస్త కష్టంగా ఉంది కదూ. అందుకే ఈమెను అందరూ ‘డేరింగ్ లేడీ’ అంటూ సోషల్ మీడియాలో అంటున్నారు.

పోలీస్ ఆఫీసర్ అని కాదు గానీ, ఒక మహిళగా ప్రమాదాన్ని ఎదుర్కుని ధైర్యంగా ముందుకు వెళ్లిన ఈమెను అభినందించాల్సిందే. ఏమంటారు ఫ్రెండ్స్.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon