దంపతులు మధ్య ప్రేమను 100 రెట్లు పెంచడానికి దోహదం చేసే 10 సంధర్భాలు
ఒక జంట చాలా కాలం కలిసి ఉండాలంటే వారు కచ్చితంగా క్లోజ్‌గా ఉండాలి, వారి మధ్య ఎన్నో మధుర ఙ్ఞాపకాలు ఉండాలి. అప్పుడే ఆ జంట ఎక్కువ రోజులు కలిసి ఉండగలరు. అయితే అలా కలిసి ఉండటానికి కొన్ని సంధర్భాలు దోహదం చేస్తాయి. అవేంటంటే,
వర్షం
వర్షం పడుతున్నప్పుడు మీరు, మీభర్త ఒకే చోట ఉంటే రోమాంటిక్ మూడ్ దానంతట అదే వస్తుంది. వర్షం పడుతున్నప్పుడు మీరు ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం, కాఫీ తాగడం వంటీవి చేయడం వల్ల మీమధ్య రొమాన్స్ మొదలై దగ్గరవుతారు.
ఆలింగనం
మీరు, మీభర్త ఇద్దరూ రోజులో ఒక్కసారైనా ఆలింగనం చేసుకుంటే మీమధ్య మంచి బంధం ఏర్పడుతుంది. మీ ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడినా కూడా ఒక్క హగ్ ద్వారా అంతా సర్ధుకుంటుంది. కాబట్టి ఇద్దరి మధ్యా కౌగలింతలు తప్పనిసరి.
ఒకరి కౌగిలిలో ఒకరు
మీరు రోజంతా కష్టపడి రాత్రికి ఒకరి కౌగిలిలో ఒకరు ఇమిడిపోతే మీరు రోజులో పడిన శ్రమ అంతా ఎగిరిపోతుంది. మీరు శృంగారం చేసుకోకపోయినా ఒకరి కౌగిలిలో ఒకరు ఉండటం వల్ల అభద్రతాభావం తగ్గి మీరు దగ్గరౌతారు.
ఎక్కువ రోజులు ప్రేమ
మీప్రేమను ఎక్కువ రోజులు ఉండేలా చూసుకోండి. ఒక్కసారి మీరు ప్రేమించడం మొదలుపెడితే చివరి వరకు వారిని ఇష్టపడాలి. అలా మీ ప్రేమను కలకాలం నిలుపుకొనేలా మీరు ప్లాన్ చేసుకోండి.
నైట్ మూవీ
మీరిద్దరూ అప్పుడప్పుడు సాయంత్రం వేళ సినిమాకు వెళ్ళండి. అలాంటి పనులు వీలున్నప్పుడల్లా చేస్తుంటే మీరు ఒకరితో ఒకరు స్పెండ్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. దీని వల్ల మీరు మరింత దగ్గర అవుతారు.
మంచి శుభోదయాలు
మీరు, మీభర్త కాఫీ తాగుతూ మాట్లాడుకోవడం అనేది మంచి అనుభూతిని ఇస్తుంది. దీని వల్ల మీమధ్య ఉండే తగ్గిపోతుంది. అంతేకాక, మీరు రోజంతా ఉల్లాసంగా ఉండటానికి కావల్సిన మానసిక శక్తిని ఇస్తుంది.
ఏకాంతం
మీఇంట్లో మీరిద్దరు మాత్రమే ఉండి, ఇంట్లో కరెంట్ లేకపోతే, అప్పుడు మీరిద్దరు గతంలో జరిగిన విషయాన్ని మళ్ళీ మాట్లాడుకోవడం లేదా ఫ్యూచర్‌కు సంబందించి ఏదైనా మాట్లాడుకోవడం వంటీవి చేసినప్పుడు మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది.
ఐస్‌క్రీమ్
మీకు బాగా ఇష్టమైన ఐస్‌క్రీమ్ తింటూ మీ భర్తతో మాట్లాడుతూ ఉంటే వచ్చే ఆనందమే వేరు. మీ చుట్టు పక్కల వారి గురించి మాట్లాడే గాసిప్స్, బాతాకానీలు మీకు మంచి మజాను ఇస్తాయి.
ఒకరికొకరు
మీకు లేదా మీభర్తకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేకపోతే మీరు ఒకరి మీద ఒకరు చూపించే కేర్ మీ మధ్య ఉండే బంధాన్ని మరింత బలం చేస్తుంది. కాబట్టి ఒంట్లో బాగలేనప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి.
చిన్న చిన్న ఆనందాలు
మీభర్త మీమీద వేసే చిన్న చిన్న జోక్స్ లేదా చేసే చిలిపి చేష్టల వల్ల మీరు చాలా ఆనందపడతారు. ప్రేమలో అలాంటివన్నీ ఉంటే ఆ ప్రేమ చివరి వరకు ఉంటుంది.
