Link copied!
Sign in / Sign up
94
Shares

భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా భార్య చేయాల్సిన 5 పనులు

 

అందరు ఒక సంపూర్ణమైన మరియు సంతోషకరమైన బంధాన్ని కోరుకుంటారు.  ప్రేమలో పడటం సులువే కానీ ఆ ప్రేమలో వుండి సంతోషంగా ఉండటానికి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. ఈ రోజుల్లో అందరు ఎంతో ఒత్తిడి మరియు అస్తవ్యస్తమైన జీవితాన్ని జీవిస్తున్నారు.

1.ఎల్లపుడు పని

పని చేయడం వలన ఈ రోజుల్లో భాగస్వామితో గడిపే క్షణాలని అది  ఎంతో ప్రభావితం చేస్తోంది.  విజయం అనేది ఏ రోజు కూడా బంధం ని ప్రభావితం చేయకూడదు. పని కొరకు ఇంట్లో వాళ్ళతో గడిపే సమయాన్ని ఏనాడు త్యాగం చేయకూడదు. ఇంట్లోవాళ్లతోను మరియు పనిలోను సమానంగా సమయం కేటాయించి రెండిటినీ సరైన రీతిలో సమకూర్చుకోవాలి.

2. అహం బంధం కంటే మరింత ముఖ్యమైనది అయినప్పుడు.

ఇది బంధానికి ఎంతో ప్రమాదకరమైంది. కొన్ని సార్లు నష్టం ఎంత అంటే మరమ్మతు కూడా చేయలేము. జంటలు మధ్య తగాదాలు అనేవి చాలా సహజం. కానీ  అది ఎక్కువగా అయితే మంచిది కాదు. నిజమైన సమస్య అహం వచ్చినపుడు ఎదురు అవుతుంది. అహంని అడ్డు తొలగించకుంటే అది మీ బంధాన్ని ముక్కలు గా చేస్తుంది.

3. గతం

మీ భాగస్వామి తో గడిపే ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఎన్నో బంధాల్లో గతాన్నే పట్టుకుని కూర్చోవటం వల్లే ఇబ్బందులు ఎదురు అవుతాయి. గతాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ క్షణాన్ని జీవించండి. గతాన్నే పట్టుకుని కూర్చుంటే అది మీ రేపటిని కూడా బాధిస్తుంది.

4. స్వయబుద్ధి

అవతల వారి మాటలు మీ బంధం పైన ప్రభావితం కాకుండా చూసుకోండి. బంధువులు, మిత్రువులు మరియు ఇతరులు ఎన్నో చెప్తారు అవన్నీ మీరు పట్టించుకోవలసిన అవసరం లేదు. వారి మాటలను వినండి కానీ మనసుకి తీసుకోకండి. ఎవరో మాయ మాటలు నమ్మి లేదా విని మీ భాగస్వామి తో గొడవలు పెట్టుకోకండి. నిజాయితీగా ఉండండి మరియు మీ భాగస్వామిని నమ్మండి.

5. అభద్రత భావన

అభద్రతా భావం మరియు అసూయ ఎన్నో ఏళ్లగా బంధాలని బాధిస్తూనే ఉంది. స్కూల్ , కాలేజీ లేదా పని చేసే చోటు కానివ్వండి వ్యతిరేక లింగము ఉండటం అనేది సహజం. దీనికి మీరు కలత చెందకూడదు. పరిస్థితి చేయి దాటిపోతే గనక వెంటనే మీ భాగస్వామికి మీ మనసులోని మాటలను తెలియపరచండి.

6. ఇద్దరి మధ్య దూరం

ఒక బంధం లో ప్రేమ, నమ్మకం ఎంత ముఖ్యమో స్పేస్ కూడా అంతే ముఖ్యం. ఇది బంధానికి చాలా మంచింది.  ఇది లేని పక్షం లోనే బంధం లో ఇబ్బందులు ఎదురువుతాయి. మీ భాగస్వామి కి వారి ఇష్టాలు మరియు ఇతర పనులు చేసుకోవటానికి స్పేస్ ఇవ్వాలి. ఇవ్వకపోతేనే వారికీ ఇబ్బందికరంగా మరియు అసౌకర్యంగా అనిపించి మీతో గొడవ పెట్టుకుంటారు.

7. ఒకరే సర్దుకుపోవడం

ప్రతి బంధం లోను సదుకుపోవడం అనేది వుంటుంది. కానీ కొని బంధాలలో ఎవరో ఒకరే ఎక్కువగా సదుకుపోతూ వుంటారు. ఇది సరి కాదు. బంధం కోసమే ఒకరే ఎప్పుడు సద్దుకుపోకూడదు. ఇరువైపులా నుండి ప్రయత్నం ఉండాలి.

8. వస్తువులు

ఖరీదైన వస్తువులలో ఉండదు ప్రేమ అనేది. ఎంత డబ్బు వున్న ఎన్ని ఖరీదైన బహుమానాలు ఇచ్చిన స్వచయమయిన ప్రేమ ని కొనలేము.

9. ప్రేమ అంటే అదొక్కటి మాత్రమే కాదు.

కొంతమందికి భాగస్వామితో ఏకాంతంగా గడపడం అంటే ఎంతో ఇష్టం వుంటుంది.  అందుకు ఏ రోజు కూడా అన్నిటికి కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. మీ భాగస్వామి ఇష్టాలకి కూడా విలువ ఇవ్వండి. వారిని ఎప్పుడు కూడా బలవంతపెట్టకండి.

10. ఇతరుల ముందు చిన్న చూపు చూడటం.

మీ భాగస్వామిని ఇతరుల ముందు చిన్న చూపు చూడటం గాని బయట వారి ముందు ఏ రోజు కూడా తక్కువ చేసి మాట్లాడకండి. అది వారిని ఎంతో బాధ పెడుతుంది.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon