Link copied!
Sign in / Sign up
4
Shares

పెరుగుతో మీ ముఖంపై నలుపును తొలగించి, మృదువుగా చేసే 5 ఉత్తమ చిట్కాలు : ఎలా వాడాలో తెలుసుకోండి

వివిధ రకాల క్రీములను ముఖం మరియు చర్మంపై రాయడం వలన నలుపుగా మారడం, ముఖంపై మొటిమలు, మంట పుట్టడం, చర్మం ఎప్పుడు పొడిగా ఉండటం..ఇలా చాలా రకాలుగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడంటే క్రీములు అవి వాడటం చేస్తున్నారు గానీ ఒకప్పుడు సహజమైన చిట్కాలను మాత్రమే ఫాలో అయ్యేవారు. అలాంటి వాటిలో మన ఇంట్లో లభించే పెరుగు ఒకటి. పెరుగుతో మీ ముఖాన్ని అందంగా, చర్మాన్ని మృదువుగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకోండి. ఇవి మన పెద్దలు ఫాలో అయినవి మరియు ఆయుర్వేద నిపుణులు చెప్పిన విషయాలు..

పెరుగుతో చర్మానికి కలిగే ఉపయోగాలు:

1. చర్మాన్ని మృదువుగా, అందంగా ఉంచుకోవచ్చు

2. ముఖంపై నల్లని మచ్చలు, మొటిమలు దూరం అవుతాయి

3. జుట్టు కాంతివంతం, నిగారింపు అవుతుంది

4. ముఖంపై ఉన్న జిడ్డు, బాహ్య భాగాలలో నలుపు తొలగిపోతుంది

5. కళ్లపై ఉండే వేడి దూరం చేసుకోవచ్చు

ముఖం మరియు చర్మ అందం కోసం :

మీ ముఖాన్ని అందంగా, చర్మాన్ని మృదువుగా ఉంచుకోవాలంటే ఇక్కడ చెప్పుకునే ఈ పదార్థాలను ఉపయోగించి మీ ముఖంపై రాసుకోవాలి. అందుకు కావాల్సిన పదార్థాలు..

◼️ ఒక టేబుల్ స్పూన్ పెరుగు

◼️ ఒక టీ స్పూన్ తేనె

◼️ రెండు స్పూన్ల రోజ్ వాటర్

ముఖంపై ఎలా అప్లై చేసుకోవాలి..!

◼️ ఈ మూడు పదార్థాలను ఒక చిన్న గిన్నెలో వేసుకుని మెత్తని పేస్ట్ గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పదార్థాన్ని ముఖంపై రాసుకుని సున్నితంగా రాసుకోవాలి.

◼️ పదిహేను నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం వలన మీ ముఖంపై ఉన్న జిడ్డుతనం, నలుపు తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా, చిన్న పిల్లల చర్మంలా సాఫ్ట్ గా ఉంటుంది.

పెరుగు మరియు నిమ్మకాయ రసం :

నలుపుగా చర్మం ఉందని ఫీలయ్యేవారు, జిడ్డు, బాహ్య భాగాలలో నలుపు ఎక్కువగా ఉంటే ఒక టేబుల్ స్పూన్ పెరుగులో కాస్త నిమ్మరసం కలిపి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, నలుపుగా ఉండే మోచేతులు మరియు మోకాళ్లపై రాసుకుని కొన్ని నిముషాలు ఆగి నీటితో శుభ్రం చేసుకుంటే కాంతివంతంగా ఉంటుంది.

ముఖంపై మొటిమలు తగ్గడానికి :

ముఖంపై మొటిమలు మరియు నల్లగా ఉండే మచ్చలు తొలగిపోవాలంటే ఇక్కడ చెప్పుకునే ఈ అద్భుతమైన చిట్కాలు వారానికి ఒకసారి ఫాలో అయినట్లయితే మంచి ఉపశమనం కలుగుతుంది. అందుకు కావాల్సిన పదార్థాలు

◼️ రెండు టేబుల్ స్పూన్ల నారింజ తొక్కల పొడి

◼️ ఒక టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు పౌడర్

◼️ ఒక స్పూన్ తేనె

◼️ ఒక టేబుల్ స్పూన్ పెరుగు

ఎలా తయారు చేసుకోవాలి..?

◼️ ముందుగా పైన చెప్పుకున్న పదార్థాలను ఒక గిన్నెలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మిశ్రమంగా మారిన ఈ క్రీమును ముఖంపై రాసుకుని మెత్తగా స్క్రబ్ చేయాలి.

◼️ ఇలా పదిహేను నిముషాలు గడిచిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై ఉండే నల్లని మచ్చలు మరియు మొటిమలకు గుడ్ బై చెప్పవచ్చు.

జుట్టు కాంతివంతంగా ఉండాలంటే :

మీ జుట్టు కాంతివంతంగా నిగారింపుగా ఉండాలంటే గిన్నెలో పెరుగు తీసుకుని అందులో కాసిన్ని మెంతి గింజలు వేసి రాత్రి పడుకునేముందు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే దీనిని మిక్సీ పట్టుకుని అందులో ఒక స్పూన్ తేనె మరియు రెండు చుక్కల నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుని తర్వాత తలస్నానం చేసుకోవడం వలన జుట్టుకి సరికొత్త నిగారింపు వస్తుంది.

ఇవే కాకుండా ఇంకా మీకు తెలిసిన చిట్కాలు ఉంటే COMMENT చేసి అందరికీ తెలిసేలా చేయవచ్చు. అలాగే మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే అందరికీ SHARE చేయండి.

Tags : curd face pack in telugu, beauty benefits of curd in telugu, best health tips in telugu, best beauty tips in telugu, amazing health and beauty benefits of curd, curd face pack for different type of skin, tips for glowing skin in telugu, face pack in telugu, face glow tips, beauty tips for face in telugu

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon