Link copied!
Sign in / Sign up
4
Shares

కండోమ్స్ గురించి మీకు తెలియని 5 ఆశ్చర్యపరిచే నిజాలు


కండోమ్స్, అందరికి తెలిసిన విధంగా అత్యంత చవకైన గర్భనిరోధకాలు. ఇవి సెక్స్ లో స్కలనం జరిగిన తరువాత వీర్యాన్ని గర్భాశయంలోకి వెళ్లనీకుండా ఆపుతుంది. ఫలితంగా మీరు సెక్స్ చేసిన కూడా గర్భం దాల్చరు. ఇవి అందరికి తెలిసిన విషయాలు. కానీ కండోమ్ గురించి మనకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి… అవేంటో చూడండి…

1. ఇలా తయారుచేస్తారు

 

ఇది చాలా మందికి తెలియని విషయం. అందరూ సాధారణంగా మాములు రబ్బర్ తో కండోమ్ తయారు చేస్తారు అని అనుకుంటారు. కండోమ్ రుబ్బర్ తో తయారు చేసిన కానీ దాని తయారి విధానం వేరుగా ఉంటుంది. రబ్బర్ చెట్టు బెరడు నుంచి వచ్చే పాలను వివిధ ఉష్ణోగ్రత్తల దగ్గర వేడి చేసి పల్చటి రబ్బర్ ను తయారు చేస్తారు. దీనితో కండోమ్ ను తయారు చేస్తారు.

2. చాలా పాతది

అందరికి తెలిసినంత వరకు, కండోమ్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత నుండి అందుబాటులో ఉన్నాయి. కానీ కండోమ్లను మానవులు వేల సంవత్సరాల క్రితంనుండి వాడుతున్నట్టు ఈ మధ్య తెలిసింది. కొన్ని పురాతన పెయింటింగ్స్ లో మనవలు కండోమ్ వాడినట్టు తేలింది.

3. అప్పుడు ఎలా చేసారు?

ఇప్పుడంటే కండోమ్ తయారు చేయడానికి రబ్బర్, అధునాతన టెక్నాలజీ వుంది. కానీ పూర్వ కాలంలో కండోమ్ లను ఎలా తయారు చేసేవారు? కండోమ్లను ప్రత్యేకంగా తయారు చేయడం కాదు. వివిధ వస్తువులను కండోమ్లగా వాడే వారు. జంతు చర్మం , ఆయిల్ పేపర్ తో తర్వాత కాలంలో కండోమ్లను తయారు చేయడం మొదలు పెట్టారు.

4. తుపాకి కోసం

అవును నిజమే తుపాకి కోసం కూడా కండోమ్లను వాడారు. అసలు జరిగిన విషయం ఇది, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తాము వాడుతున్న తుపాకులు తుప్పు పట్టకుండా సైనికులు కండోమ్లను వాటికి తొడుగులుగా వాడే వారు.

5. 2 శాతం మాత్రమే

సెక్స్ సమయంలో కండోమ్ విఫలమయ్యే అవకాశం కేవలం 2 శాతం మాత్రమే. అంటే కండోమ్లు గర్భాన్ని నిరోధించడంలో చాలా ప్రభావంతంగా పని చేస్తాయి. విఫలమవ్వడానికి కారణాలు తయారి లోపాలు, ఎక్కడంటే అక్కడ కండోమ్లను పెట్టడం వలన వేడి వలన పాడైపోవచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon