Link copied!
Sign in / Sign up
0
Shares

కండోమ్ వాడేముందు ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి


శృంగారం చేసేముందు గర్భం దాల్చకుండా, హెచ్ఐవి సోకకుండా, ఒకరి శరీరం నుండి మరొకరి శరీరంలోకి ఇన్ఫెక్షన్స్ సోకకుండా కండోమ్ (నిరోధ్ లేదా సేఫ్టీ) ఉపయీగించడం చేస్తుంటారు. కండోమ్ ఉపయోగించడం వలన పైన చెప్పుకున్నట్లుగా ఎంత ప్రయోజనం ఉందో, సైడ్ ఎఫెక్ట్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివరంగా మీకోసం…

మగ-ఆడ ఇద్దరి కోసం

శృంగారం చేసే ముందు మగ, ఆడ..ఇద్దరికోసం ప్రస్తుతం మార్కెట్ లో కండోమ్స్ లభిస్తున్నాయి. కొన్ని ప్లాస్టిక్ తో తయారుచేస్తే, లాటెక్స్ ఉపయీగించి, ఇంకొన్ని జంతువుల చర్మంతో తయారుచేసినవి మార్కెట్ లో ఉన్నాయి. ఐతే వీటిలో జంతువుల చర్మం నుండి చేసిన కండోమ్ వాడటం వలన చర్మంపై మంట, దురద కలుగుతున్నాయని చెప్పేవారు లేకపోలేదు. అలాగే ఒకో సమయంలో ఇద్దరూ వాడాల్సిన అవసరం కూడా లేదు.

లాటెక్స్ అలర్జీ సమస్య

కండోమ్ తయారీకి ఉపయోగించే లాటెక్స్ సరైనది కాకపోయినా, అందులో సరిపడినంత లూబ్రికెంట్ జెల్ లేకపోయినా మగ, ఆడ ఇద్దరి జననాంగాల మధ్య దురద, మంట కలిగే ప్రమాదం ఉంది. అలాగే చర్మం ఊడిపోవడం, చిన్న చిన్న గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. కండోమ్ సరైనది కాకపోతే స్కలనం అయ్యే సమయంలో చీలిపోయి స్త్రీ శరీరంలోకి వీర్యకణాలు ప్రయాణించే అవకాశాలు ఎక్కువ. దీని కారణంగా గర్భం దాల్చడం లేదా హెచ్ఐవి సోకే ఛాన్సెస్ ఎక్కువ.

మగవారిలోనే ఎక్కువ సమస్యలు

రతిలో కండోమ్ ఉపయోగించడం వలన సరైన ఆనందాన్ని, సుఖాన్ని పొందలేకపోతున్నామని అంగం స్తంభించడం కష్టమవుతుందని తాజా ఆరోగ్య పరిశోధనలో తేలిన విషయం. ఎందుకా అని నిపుణులు పరీక్షించి చూడగా, కండోమ్స్ లో ఉపయోగించే లాటిక్స్ మరియు లూబ్రికెంట్ జెల్ ఇందుకు కారణమట.

గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువ

గర్భాన్ని నిరోధించడం కోసం ఉపయోగిస్తున్న కండోమ్ వలన వందకు వంద శాతం సరైన ఫలితం చాలా తక్కువగానే ఉందని, 100 మందిలో 2 ఇద్దరు మాత్రమే బయటపడుతున్నారని, గర్భం పొందేవారు 100 కు 15 మంది ప్రెగ్నన్ట్ అవుతున్నట్లు తెలిసింది. సరైన సైజు ఉన్నవి, ఏది సరైన కండోమ్ అని గుర్తించలేకపోవడం, మధ్యలోనే ఇవి జారిపోవడం కూడా ఇందుకు కారణాలు. సో, జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్పగలం.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon