Link copied!
Sign in / Sign up
2
Shares

ప్రగ్నన్సీ సమయంలో కాఫీ తాగవచ్చా..! కడుపులోని బిడ్డకు ఏమవుతుంది..!!

అమ్మ అవ్వడం అనేది మహిళలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. ప్రగ్నన్సీ దాల్చిన వెంటనే మహిళల మనస్సులో ఎన్నెన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి, తనకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటారు, ఎంత అందంగా ఉంటారు, నా కడుపునుండి ఈ ప్రపంచంలోకి ఎప్పుడు బయటకు వస్తాడని ఎప్పుడు ఇవే ఆలోచనలు. అలాగే ప్రగ్నన్సీ సమయంలో కొందరు మహిళలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేయడం వలన గర్భస్రావం జరగడం లేదా పుట్టబోయే బిడ్డ చాలా తక్కువ బరువుతో పుట్టడం జరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అటువంటి వాటిలో ప్రగ్నన్సీ సమయంలో కాఫీ తాగడం మంచిదేనా? కాదో? తెలుసుకోండి. ఈ విషయాన్ని తెలియనివాళ్లకు తెలియజేయండి.. 

ప్రగ్నన్సీ సమయంలో కాఫీ..?

గర్భం దాల్చిన తర్వాత ప్రతి ఒక్కరూ చెప్పే ఆరోగ్య సూచనలలో ఆహారం చాలా ముఖ్యమైనది. కడుపుతో ఉన్న తల్లితో పాటు, బిడ్డ పెరుగుదల కొన్ని ఆహారాలు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి, అందుకని తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. ఇటువంటి ఆహారాలలో కాఫీ ఒకటి. చాలామందికి కాఫీ అలవాటు ఉండటం వలన గర్భం దాల్చిన తర్వాత కూడా కాఫీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ప్రగ్నన్సీ సమయంలో కాఫీకి దూరంగా ఉండటం మంచిదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాఫీకి దూరంగా ఉండకపోయినా 200 మి.గ్రా. లకు మించకుండా తీసుకోవాలని చెబుతున్నారు. ఇందులో కెఫీన్ అధికంగా ఉండటం వలన మిస్ క్యారేజ్ అయ్యే ప్రమాదశాతం ఎక్కువగా ఉందని, లేదా పుట్టబోయేబిడ్డ తక్కువ బరువుతో పుట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం వలన వయస్సు పెరిగేకొద్దీ కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాకుండా గర్భంతో ఉన్న మహిళకు త్వరగా నిద్రపట్టకపోవడం, హైపర్ టెన్షన్ మరియు రక్తస్రావం కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాఫీ మాత్రమే కాదు, టీ కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీలైతే రెండిటికీ దూరంగా ఉండటం ఉత్తమం. గర్భంతో ఉన్న మహిళలు చేయాల్సిన మరియు చేయకూడని 14 పనులు

గర్భంతో ఉన్నప్పుడు గ్రీన్ టీ..!!

ప్రగ్నన్సీ సమయంలో కాఫీ అధికంగా తీసుకోవడం వలన ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో తెలుసుకున్నారు కదా, మరి గర్భంతో ఉన్నప్పుడు గ్రీన్ టీ సేవించవచ్చా? అనే అనుమానాలు ఉన్నాయి చాలామందికి. ఈ విషయంలో ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం, గ్రీన్ టీ తీసుకోవడం వలన ఎటువంటి ప్రమాదం లేదని ఇంకా నిరూపితం కాలేదు కాబట్టి.. రోజుకి ఒకటి లేదా రెండు గ్లాసులు తక్కువ మోతాదులో గ్రీన్ టీ తీసుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే జున్ను పదార్థాలు, సరిగ్గా ఉడకని మాంసం, బొప్పాయి, మెర్క్యూరీ ఫిష్, కారం, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాలు, అధిక ఉప్పు గర్భంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి, అందుకని వీటికి దూరంగా ఉండటం మంచిది. 

ఈ విషయాలు ప్రతి గర్భిణీ మహిళకు తెలిసేలా షేర్ చేయగలరు.  

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon