Link copied!
Sign in / Sign up
9
Shares

యోని పై భాగంలో ఉండే చిన్న బొడిపి లాంటి భాగం ఏంటి? అది ఏమి చేస్తుంది?

యోని పై భాగంలో ఉండే చిన్న బుడిపి లాంటి భాగాన్ని యోని శీర్షం (క్లిటోరిస్) అంటారు. ఇది చాలా సున్నితమైన భాగం. శృంగార సమయంలో దీని పై జరిగే రాపిడి, మీకు భావప్రాప్తిని కలిగిస్తుంది. ఇంత ముఖ్యమైన పునరుత్పత్తి భాగం గురించి చాలా మంది స్త్రీలకు, చాలా విషయాలు తెలియవు. కానీ ఈ క్లిటోరిస్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే…

1. అందుకు మాత్రమే

శృంగారంలో పొల్గొనేటప్పుడు స్త్రీలకు భావప్రాప్తి కలిగించడంలో ప్రధాన పాత్ర పోషించేది, క్లిటోరిస్. కానీ క్లిటోరిస్ ను, స్త్రీ శరీర భాగాలలో ప్రత్యేకమైనదిగా చేసేది, మీ శరీర భాగాలలో ఆనందాన్ని కలిగించడానికి మాత్రమే క్లిటోరిస్ పనిచేస్తుంది. దాని పని అది ఒక్కటే.

2. మిస్టరీ

1998 వరకు క్లిటోరిస్ గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. స్త్రీలకు భావప్రాప్తి కలిగించడానికి యోని లో ఉండే, కొన్ని గ్లాన్స్ కారణమనుకునే వాళ్ళు. హెలెన్ ఓ కన్నెల్ (Hellen O conell ) అనే ఆస్ట్రేలియన్ యూరోలాజిస్ట్ చేసిన అధ్యయనాల ద్వారా క్లిటోరిస్ గురించి తెలిసింది.

3. అంతకు మించి

క్లిటోరిస్ చూడడానికి ఒక చిన్న బటన్ సైజులో ఉంటుంది. కానీ అంతర్భాగం మీరు అనుకునేంత చిన్నది కాదు. క్లిటోరిస్ అంతర్భాగంలో రెండు స్పాంజ్ లాంటి గ్లాన్స్ కు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ గ్లాన్స్ ని కార్పొర కావెర్నోస (corpora cavernosa) అంటారు. ఇవి రెండు రెక్కల్లాగా శరీరంలోకి విస్తరించి ఉంటాయి. వీటిని క్రురా (crura) అంటారు.

4. నరాలు ఎక్కువే 

క్లిటోరిస్ చిన్నదే అయిన, ఎక్కువ నరాలను కలిగివుంటుంది. యోని భాగాలలో ఎక్కువ నరాలు కలిగి ఉండేది క్లిరోటీస్. ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్లిటోరిస్ లో, పురుషాంగంలో కన్నా ఎక్కువ నరాలు ఉంటాయి.

5. అందరిది ప్రత్యేకమే

మహిళలందరూ ప్రత్యేకమే, అలాగే వారి యోని శీర్షాలు కూడా. కొంతమంది మహిళలు  యోని శీర్షం చుట్టూ ఉన్న ప్రాంతంలో రాపిడి వలన భావప్రాప్తిని పొందుతారు. కొంతమంది మహిళలు యోని శీర్షం పై జరిగే రాపిడి వలన భావప్రాప్తిని పొందుతారు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon