Link copied!
Sign in / Sign up
7
Shares

సిజేరియన్ (C-Section) అవసరం రాకుండా సహజ ప్రసవం జరగడానికి 5 మార్గాలు


ప్రసవం అనేది సహజమైన ప్రక్రియ. కానీ, కొన్ని సార్లు సిజేరియన్ అవసరం రావచ్చు, తప్పులేదు. సిజేరియన్ అవసరం రావడానికి కారణాలు అనేకం. కానీ, సహజ ప్రసవం జరిగితే తల్లికి బిడ్డకి ఇద్దరికీ మంచిది. అందుకే, సిజేరియన్ అవసరం రాకుండా సహజ ప్రసవం జరగడానికి 5 మార్గాలు మీతో పంచుకుంటున్నాము.

1. వ్యాయామం

చేయడానికి కష్టమనిపించినా రోజు చిన్నపాటి వ్యాయామాలు చేయడం ద్వారా సిజేరియన్ అవసరం రాదు. డాక్టర్స్ కూడా వ్యాయామాలు చేయమని సిఫారసు చేస్తారు. అందువలన మీకు సహజ ప్రసవం జరగాలనుకుంటే డాక్టర్ని అడిగి ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చునో తెలుసుకొని చేయండి.

ఒక పరిశోధన ప్రకారం రోజు వ్యయం చేసిన వాళ్లకు సిజేరియన్ ఆపరేషన్ జరిగే అవకాశం తక్కువగా ఉంది అని తెలిసింది.

2. మంచి డాక్టర్ని సంప్రదించండి

ఈ మధ్య చాలా హాస్పిటల్స్లో అవసరం లేకపోయినా సిజ్హేరియన్ చేస్తున్నారు అని చాలా మంది చెప్తున్నారు. అది నిజమో అబద్దమో మాకు తెలీదు కానీ మంచి డాక్టర్ని ఎంచుకోవడం మాత్రం అనేక కారణాల వలన అవసరం.

3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

ఆరోగ్యకరమైన ఆహరం తినడం ద్వారా సిజేరియన్ అవసరం రాకుండా చేయవచ్చు. మీ ఆకలి కోరికలు ఎలా ఉన్నా, వాటిని అదుపులో పెట్టుకొని ఆరోగ్యకరమైన ఆహరం మాత్రమే తీసుకోండి.

4. మీ భర్తకు మీకు సహజ ప్రసవం కావాలని చెప్పి పెట్టండి

మీ భర్తకు ఇంట్లో వాళ్ళకు మీరు సహజ ప్రసవం కోరుకుంటునట్టు తెలియచేయండి. ప్రసవ సమయంలో మీ దగ్గర మీ భర్త ఉండాలనుకుంటే అది కూడా ముందే చెప్పండి. తాను కూడా సిద్ధంగా ఉండేలా చూడండి.

Image Credits: Pintrest

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon