Link copied!
Sign in / Sign up
29
Shares

వీరు నర్సులు కాదు నరరూప రాక్షసులు : చిన్నారికి ప్రత్యక్ష నరకం చూపించారు, బయటకు లీకైన వీడియో..

దేవుడి కన్నా ఈ భూమిపై ఎక్కువగా నమ్మేది ఒక్క వైద్యులను, వైద్య వృత్తిని మాత్రమే. దేవుడితో సమానమైన వైద్యుల దగ్గర పనిచేస్తూ రోగిని ఆత్మీయంగా  చూసుకుంటూ సఫర్యలు చేయాల్సిన నర్సులు నరరూప రాక్షసులుగా మారారు. నర్సుల వృత్తినే అవమానపరిచేలా 10 రోజుల పసికందును చిత్రహింసలు చూపించారు. ప్రపంచం మొత్తం వైరల్ గా మారిన ఈ న్యూస్ వింటే ఒక పసికందును ఇలా హింసించడానికి మీకు చేతులెలా వచ్చాయి అని అనకుండా ఉండలేరు..

అసలు ఏం జరిగింది..?

10 రోజుల పసికందును ముగ్గురు మహిళా నర్సులు చిత్ర హింసలు పెట్టిన సంఘటన సౌదీ అరేబియాలోని తైప్ సిటీలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో జరిగింది.  తల్లి గర్భం నుండి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ బిడ్డకు మూత్రనాళ సమస్య ఉండటంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతున్న ఈ బిడ్డ తల, ముఖం, మెడను పైకి కిందకు అదుముతూ, పక్కకు తిప్పుతూ రాక్షస ఆనందం పొందారు. ఆ బిడ్డకు ఇలా చేస్తే ఏమైనా జరుగుతుందో అని కనీస భయం, కనికరం లేకుండా నవ్వుతూ ఇలా చేయడం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది.

బయటకు తోసిన హాస్పిటల్ యాజమాన్యం

అమ్మలాగా ఆప్యాయతను పంచి, రోగికి సఫర్యలు చేయాల్సిన నర్సులు ఇలా ఓ బిడ్డను హింసించడంతో హాస్పిటల్ యాజమాన్యం వారి నర్సుల లైసెన్స్ క్యాన్సిల్ చేసి, హాస్పిటల్ నుండి బయటకు పంపించారు. తమ బిడ్డకు అనారోగ్యం బాగోలేక చికిత్సకు తీసుకువస్తే పసికందు అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురిచేయడం నర్సుల వృత్తికే అవమానకరమని తన బాధను వ్యక్తం చేశారు ఈ బిడ్డ తండ్రి.

Video Credits : Lemonfeed Lemonfeed

ఇటువంటి నీచమైన పనులు ఇంకెవ్వరూ మరోసారి చేయకుండా అందరూ ఈ వీడియోను SHARE చేస్తూ తమ ఆగ్రహం తెలుపుతున్నారు..

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon