Link copied!
Sign in / Sign up
104
Shares

20 రోజుల చిన్నారి ప్రాణాలను తీసిన ఒక ముద్దు : అసలు కారణం తెలిస్తే గుండె తరుక్కుపోతుంది

అప్పుడే పుట్టిన పసిపిల్లలను ముద్దు పెట్టుకుంటే ఏం జరుగుతుంది? అని చాలామంది తల్లితండ్రులు మమ్మల్ని అడగడం జరిగింది. నిజంగా ఇది ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. పుట్టిన వెంటనే పసిపిల్లలను ముద్దాడటం వలన పిల్లల ప్రాణాలకు ముప్పు ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రమాదమే కాదు,ఇక్కడ ఒక చిన్నారి ముద్దు వల్ల ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఈ విషాదకరమైన సంఘటన ఎవరి జీవితంలో జరగకుండా ఉండాలంటే అందరికీ SHARE చేయగలరు…

సిజేరియన్ ద్వారా జన్మించిన పాప

తమ ఇద్దరి జీవితంలో ఆనందాన్ని పెంచడానికి ఒక బిడ్డ రాబోతుందని ఎంతో సంతోషించారు ఆ తల్లితండ్రులు. 9 నెలలు నిండి, ప్రసవానికి సిద్ధమైనా కూడా ప్రసవ  నొప్పులు రాకపోవడంతో సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మించింది. అందంగా పండంటి పాప జన్మించింది. ఆ ఆలుమగల ఆనందానికి అవధులు లేవు. 20 రోజుల తర్వాత ఈ సంతోషాన్ని తమ శ్రేయస్సును కోరే బంధుమిత్రులతో జరుపుకోవాలని ఇంటి దగ్గరే పార్టీకి ఆహ్వానించారు.

ప్రాణం తీసిన పార్టీ..
తమ చిన్నారిని ఆశీర్వదించడానికి వచ్చిన బంధుమిత్రులు ముద్దుగా ఉన్న పాపను తమ చేతుల్లోకి తీసుకుని ఆదుకోవడం ముద్దుపెట్టుకోవడం చేశారు. పార్టీ అయిపోగానే అందరికీ ఇంటికి వెళ్లారు, ఉదయాన్నే తన ఉద్యోగానికి బయలు దేరాడు పాప తండ్రి. ఆ రోజు నుండి పాప పాలు తాగడం లేదు, చేతుల్లోకి తీసుకుంటే కిందకు జారిపోతోంది. ఇలా మూడు రోజులు అయినా పాప చలాకీగా లేకపోవడంతో హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. మొదట ఇలా సాధారణమే అనుకున్నారు వైద్యులు. కానీ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ‘హెర్ప్స్’ అనే వైరస్ సోకింది. చాలా ప్రమాదం అని వెంటనే వైద్యం మొదలుపెట్టారు. ఐతే అప్పటికే చేజారిపోవడంతో పాప ప్రాణాలను వదిలేసింది.
పాప చనిపోవడానికి కారణం

పార్టీకి వచ్చిన బంధుమిత్రులు చిన్నారిని ఆడిస్తూ దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకున్నారు.  అందులో ఒకరికి జలుబు, అనారోగ్యం కారణంగా ఆ వైరస్ చిన్నారికి చేరి ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని వైద్యులు చెప్పారు. ఇది తెలిసి ఆ తల్లితండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. ఇంకో విషయం ఏమిటంటే అప్పుడే పుట్టిన పిల్లలు మేథో మజ్జా అనే వ్యాధితో కొందరు బాధపడుతూ ఉంటారు. ఇటువంటప్పుడు వారిని ముద్దుపెట్టుకోవడం వలన ఇన్ఫెక్షన్స్, బాక్టీరియా వారి శరీరానికి త్వరగా చేరి ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది.. ఆ చిన్నారి పేరు 'ఎలాయిస్ లాంప్టన్'..

ఇది తప్పకుండా చదవండి

అప్పుడే పుట్టిన పిల్లలను ముద్దుపెట్టుకోవడం వలన ఏం జరుగుతుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి.. 

మీకోసం మేము అందిస్తున్న నూతన సంవత్సర కానుక. ఈ లింక్ ద్వారా మీరు అమెజాన్ కు వెళ్ళండి.....ఆశ్చర్యపరిచే ఆఫర్లు పొందండి...

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon