Link copied!
Sign in / Sign up
177
Shares

చిన్నపిల్లల్లో జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఇంటి చిట్కాలు

సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లల్లో కొందరికి జుట్టు ఎక్కువగానూ, కొందరికి తక్కువగానూ ఉంటుంది. కొందరిలో  జుట్టుకు కావల్సిన పోషకాలు సరిగ్గా  అందకపోవడం వల్ల పెరగడం ఆలస్యం కావచ్చు. ఏదేమైనా జుట్టు ఎదగడం ఆలస్యం అవుతున్నప్పుడు స్నానం చేయించే విధానం లో, ఆహారంలో కొన్ని మార్పులు చేయడం మంచిది. చిన్నారి జుట్టు వొత్తుగా, ఆరోగ్యాంగా, బలంగా  ఎదగడానికి చేయాల్సిన అలాంటి  కొన్ని మార్పులు, చిట్కాలు ఏంటో తెలుసుకోండి.

జుట్టుకు నూనె పట్టించడం

తలకు నూనె పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని మనకు తెలిసిందే. చిన్న పిల్లల జుట్టుకు నూనె పట్టించడం వల్ల తల భాగంలో రక్త ప్రసరణ బాగా జరిగి కుదుళ్ళు బలంగా తయారయ్యే అవకాశం ఉంది. నూనె క్రమం తప్పకుండా పట్టించడం వల్ల తలలో దురద ఉంటె తగ్గుతుంది. కొబ్బరి నూనె, ఆముదం వంటి నూనెలను మిక్స్ చేసి కూడా తలకు పట్టించవచ్చు. కొబ్బరినూనెలో కొన్ని మిరియాలు, 4-5 బియ్యపు గింజలు వేసి వేడి చేసి తలకు పట్టించినా మంచి ఫలితం ఉంటుంది.

మంచి డైట్‌ను ఇవ్వడం

జుట్టు బాగా పెరగాలంటే మంచి డైట్‌ను ఫాలో అవ్వాలి. మీ బాబు/పాప డైట్‌లొ విటమిన్లు,  ప్రొటీన్లు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అందుకోసం, నేరేడు పళ్ళు, గుమ్మడి, క్యారెట్, కర్జూరాలు బాధం, వాల్‌నట్స్‌,చేపలు, గ్రుడ్లు వంటి పధార్థాలు ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటూ, బి12, విటమిన్-E సమృద్ధిగా ఉండే పధార్థాలను పిల్లలకు తినిపించాలి.

షాంపూ మరియూ కండీషనింగ్

పిల్లలకు స్నానం చేయించేటప్పుడు తేలికపాటి షాంపూ లేదా సబ్బు వాడటం మంచిది. ఏది మంచి ఫలితాన్నిస్తుంటే దానినే కొనసాగించండి. స్నానం చేసే ముందు అయిల్ పెట్టడం వల్ల జుట్టు చిట్లిపోయే ప్రమాదం తగ్గుతుంది. స్నానం అయిన తర్వాత జుట్టుకు కండీషనింగ్ చేయాలి. దీని వల్ల జుట్టు కుదుళ్ళ బలంగా ఉంటాయి.

నూనెలో కొన్ని చుక్కలు తేనె వేసి జుట్టుకు పట్టించి, 15 నిముషాల తర్వాత స్నానం చేయిస్తే జుట్టుకు మంచి పోషణ అందుతుంది. లేదా పెరుగు, గ్రుడ్డులోని తెల్లసోనా, మందారంల మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 20 నిముషాల తర్వాత స్నానం చేయించనా ఫలితం కనిపిస్తుంది.

క్రమం తప్పకుండా దువ్వుతూ ఉండాలి

చిన్నపిల్లల జుట్టు చాలా తొందరగా చిక్కుపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజూ జుట్టును దువ్వడం మంచిది. రోజూ షాంపూ చేయడం వల్ల జుట్టు పొడిగా మారి చిక్కు పట్టే అవకాశం ఉంది కాబట్టి వారానికి 3 సార్లు షాంపూ చేస్తే సరిపోతుంది. మీ బాబు/పాపకు కర్లీ హెయిర్ ఉంటే రోజుకు 2 సార్లు తల దువ్వడం మంచిది దీని వల్ల రక్త ప్రసరణ పెరిగి జుట్టు బలంగా తయారవుతుంది.

గెలాటిన్

గెలాటిన్‌లో అమైనో యాసిడ్స్, గ్లైసిన్, ప్రోలిన్ వంటివి ఉంటాయి. వీటిలో జుట్టుకు కావలసిన పోషకాలతో పాటు రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేసే గుణాలు ఉంటాయి. గెలాటీన్‌కు సమపాళ్ళలో వేడి, చల్లని నీటిని కలిపి, కొంచెం తేనే, కొంచెం ఆపిల్ వెనిగర్‌ను కలిపి బాగా మిక్స్ చేసి పాప/బాబు జుట్టుకు పట్టీంచి కాసేపటి తర్వాత స్నానం చేయించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పటిష్టంగా తయారవుతుంది.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
60%
Wow!
40%
Like
0%
Not bad
0%
What?
scroll up icon