Link copied!
Sign in / Sign up
73
Shares

పసి పిల్లలు మీతో పాటు పడుకుని నిద్రిస్తే చాలా ప్రమాదం : ఈ 4 జాగ్రత్తలు తీసుకోండి

పిల్లలు పుట్టిన తర్వాత ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తారో, పిల్లల నిద్ర, వారు పడుకునే విధానం, వారిని ఎక్కడ పడుకోబెట్టాలి? అనే విషయాలు కూడా పిల్లలున్న ప్రతి తల్లితండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలామంది వాళ్ళు పడుకునే బెడ్ పైనే వాళ్ళ పక్కనే పిల్లలను పడుకోబెట్టుకుని నిద్రిస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన గడచిన 5 ఏళ్లలో దాదాపు 700 దాకా పిల్లలు చనిపోయారట. అందుకని ఇక్కడ చెప్పుకునే జాగ్రత్తలు తీసుకోండి. మీ పిల్లల ప్రాణాలకు అండగా ఉండండి…

ఇదే మొదటి కారణం

తల్లి నుండి బిడ్డను వేరుగా ఉండమని ఎప్పుడు ఎవరూ చెప్పరు, కానీ ప్రసవం తర్వాత బాలింత చుట్టూ, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లల చుట్టూ ఎక్కువగా క్రిములు దాడి చేస్తూ ఉంటాయి. అందుకని తల్లి ఎంతో శుభ్రంగా ఉండటం, తన చేతులను, కాళ్ళను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం, బిడ్డకు పాలు ఇచ్చే వక్షోజాల భాగం వాసన రాకుండా, చెమట లేకుండా జాగ్రత్త పడటంతో పాటు ఎప్పటికప్పుడు మీరు పడుకునే బెడ్ పై ఉండే దుప్పట్లను మారుస్తూ ఉండాలి.

శరీరం త్వరగా వేడి ఎక్కుతుంది

ఉద్యోగం చేస్తున్న మీ భర్త ఎంతో అలసటగా ఇంటికి రాగానే వెంటనే బెడ్ పై వాలిపోయి రెస్ట్ తీసుకోవడం చేస్తుంటారు. బయట ఎక్కడో తిరిగి వచ్చాక శరీరం కాస్త వేడిగా, శరీరం నుండి దుర్వాసన, బాక్టీరియా ప్రభావం ఎక్కువగా ఉండటం వలన పిల్లలకు అస్సలు మంచిది కాదు. అందుకే ఆయన దుస్తులు, శరీరం పరిశుభ్రంగా ఉంటేనే మీ పక్కన, బిడ్డతో పాటు పడుకోమని చెప్పాలి. లేదంటే వద్దు.

ఈ అలవాట్లు ఉంటే దూరం పెట్టండి

అందరూ అని కాదు గానీ కొందరు మద్యం సేవిస్తూ ఉండే మగవాళ్ళు ఉండవచ్చు. అలాగే ధూమపానం చేసేవాళ్ళు కూడా ఉండవచ్చు. వీళ్ళు పిల్లలకు దగ్గరగా ఉండటం వలన ఆ వాసన పిల్లలకు పడకపోవడం వలన ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుందని ఫలితంగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

6 నెలల తర్వాత ఇలా చేయండి

కొంతమంది పిల్లలు అమ్మకు దగ్గరగా, ఒడిలో ఉంటే బాగా నిద్రిస్తారు. మరికొందరు పిల్లలకు 6 నెలల వరకు బాగానే నిద్రపడుతుంది. ఐతే 6 నెలల వరకు పిల్లలను మీతో పాటు పడుకోబెట్టుకుంటే పైన చెప్పినట్లు చేయడం లేదా ఊయలలో పడుకోబెట్టడం వారి ఆరోగ్యానికే మంచిది.  పెద్దల శరీరంలోనే ఎక్కువగా బాక్టీరియా చేరి ఉంటుంది, రోగ నిరోధక శక్తి బాగా ఉండటం వలన అనారోగ్యానికి కారణం కాదు. కానీ పిల్లలలో అలా కాదు కదా..

ఎందుకు చెబుతున్నామో ఆలోచించండి. నచ్చితే అందరికీ SHARE చేయండి…    

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon