Link copied!
Sign in / Sign up
0
Shares

మీ పిల్లలకు 'హెయిర్ కట్' చేయిస్తున్నారా..! ఎప్పుడు, ఎలా చేయించాలి? ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి

పుట్టిన కొన్ని నెలలకు పిల్లలకు పుట్టెంట్రుకలు తీయించడం ఆనవాయితీ. అంటే మొదటిసారి తలపై ఉన్న జుట్టును కత్తిరించడమన్నమాట. ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయడానికి పావుగంట పైనే పడుతుంది. ఈ పని చిన్నదే అయినా నిజానికి ఇదో పెద్ద తతంగమే. ఎందుకంటే పుట్టెంట్రుకలు తీయడానికి పిల్లలు ఒక పట్టాన ఒప్పుకోరు. మారాం చేస్తారు. ఏడుస్తారు. ఎవరైనా కొత్తవాళ్లను చూస్తే పిల్లలకు భయమేస్తుంది. ఎవరో కొత్తమనిషి తమ తల దగ్గర పదునైన కత్తి ఉంచడాన్ని చూసి దడుసుకుంటారు. కుదురుగా కూచోరు. సెలూన్ కెళ్లిన తర్వాత పిల్లలు సీన్ క్రియేట్ కాకుండా చేయడానికి కొన్ని చిట్కాలున్నాయి.

1. బుజ్జగించి నచ్చచెప్పాలి

ఫస్ట్ టైం హియిర్ కట్ చేయడానికి ముందు పేరెంట్ గా మీరు బాబును కూల్ చేయాలి. మీరు భయపడుతున్నట్టు, టెన్షన్ గా ఉన్నట్టు కనిపించకూడదు. మీ ఫేస్ ను చూసి పిల్లలు ఇట్టే కనిపెట్టేస్తారు. ఇదేమంత పెద్ద పనికాదని, చాలా సింపుల్ అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అలా చేస్తే జుట్టు కత్తిరించేటప్పుడు వాళ్లకు కలిగే భయం తగ్గుతుంది.

2. పిల్లాడిని రెడీ చేయాలి

జుట్టు కత్తిరించే పనికి ముందు వాళ్లను అందుకు రెడీ చేయాలి. హఠాత్తుగా ఏదో మాల్ కు తీసుకెళ్లి, సెలూన్ లో సీట్ లో కూచోబెట్టకండి. హెయిర్ కటింగ్ సెలూన్ లో ఏం చేస్తారు?, జుట్టు ఎందుకు కత్తిరించాలి అన్నది ఓపిగ్గా చెప్పండి. జుట్టు కత్తిరించడానికి కత్తెర, క్యాప్ ఎందుకు వాడతారో చెప్పండి. సెలూన్ కు తీసుకెళ్లే ముందు బాబును మీ ఇంట్లోనే ఒక సీట్ లో కూచోబెట్టండి. ఒక ట్రయల్ హెయిర్ కట్ చేయండి. సెలూన్ లో ఏం చేస్తారో అప్పుడు బాబుకు అర్థమవుతుంది.

3. సరైన సెలూన్ కెళ్లాలి

పిల్లలకు అనువుగా, ఫ్రెండ్లీగా ఉండే పార్లర్ ను ఎంచుకోండి. ప్రొఫెషనల్ పార్లర్లు ఏడిచే పిల్లవాడిని బుజ్జగించలేవు. పిల్లలకోసం కొన్ని సెలూన్లు ఉంటాయి. అక్కడ పిల్లలు కోరుకునే వాతావరణం ఉంటుంది. మీ బాబుకు అలాంటివి చక్కగా కుదురుతాయి.

4. సిద్ధపడే వెళ్లండి

పుట్టెంట్రుకలు కత్తిరించే ముందు పిల్లలు ఏడుస్తారు. గోలచేస్తారు. కాబట్టి మీరు అందుకు సిద్ధమై వెళ్లండి. కటింగ్ చేసే సమయంలో పిల్లవాడి మనసును మరల్చేందుకు మీ వెంట ఆటబొమ్మల్ని తీసుకెళ్లండి. అలాగే, బాబు ఇష్టంగా తినే స్నాక్స్ ను కూడా పట్టుకెళ్లండి. హెయిర్ కటింగ్ పూర్తయిన తర్వాత, బాబు ఆ భయం నుంచి తేరుకోడానికి ఐస్ క్రీమ్ కొనివ్వండి.

5. దగ్గరే ఉండండి

మొదటిసారి బాబు హెయిర్ కటింగ్ కు కొంత టైం పడుతుంది. దాన్ని అంచనా వేసుకుని మీ పనులను సర్దుబాటు చేసుకోండి. హెయిర్ కటింగ్ అయినంతసేపూ బాబు దగ్గరే ఉండండి. ఆ టైంలో మీ పిల్లాడికి కేటలాగ్ లో అందమైన బొమ్మలు చూపించండి. ఆ బొమ్మల్లో ఉండే స్టైల్ లో మీరు చేస్తే బాబు ముచ్చటపడి చూస్తాడు.

ఇలాంటి కొన్ని పద్ధతుల్ని అనుసరిస్తే మీ బాబు ఫస్ట్ హెయిర్ కట్ (పుట్టెంట్రుకలు తీయించడం) ఒక సమస్యగా మారదు. సులభంగా చేయించవచ్చు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon