చిన్న పిల్లల కోసం: 5 ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన గంజి(జావ) వంటకాలు
చిన్న పిల్లలకు గంజి (జావ) వంటకాలు తినిపించడం అత్యంత శ్రేయస్కరం. గంజి సహజంగానే మృదువుగా, పలుచగా ఉండడంతో పిల్లలకు జీర్ణ సమస్య రాదు. గంజిలో అపారమైన పోషక విలువలు ఉండే కారణ౦గా ఇది పిల్లల ఎదుగుదలను పెంచుతుంది. గంజి యొక్క గొప్పదనం తెలుసుకుని ఈ రోజుల్లో అనేక మంది దీనిని వారి రోజు వారి ఆహారంలో భాగం చేస్తున్నారు. ఇప్పడు పిల్లలకు ఉపయోగపడే రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన గంజి ఎలా తాయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
1. అన్నం గంజి
దీనిని 6 నెలలు పైబడిన పిల్లలకు మాత్రమే ఇవ్వాలి.
కావలసిన పదార్థాలు
అర కప్పు నీరు
2 టీ స్పూన్ల ఇంట్లో తయారు చేసుకున్న బియ్యపు పిండి
తయారు చేయు విధానము
1. ఒక పెనుములో నీరు పోసి బాగా మరిగించాలి.
2. ముందుగా తాయారు చేసుకున్న బియ్యపు పిండిని నీలల్లో వేసి ఉంటలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి.
3. బియ్యపు పిండి ఉడికి క్రీము లా తాయారు అయ్యేంత వరకు ఉండాలి.
4. దీనికి కాసిన్ని రొమ్ము పాలు కలిపి పలుచగా చేసుకుంటే మరీ మంచిది.
5. తీపిదనం కోసం మీకు నచ్చిన పండు తో కలిపి మీ బిడ్డకు తినిపించండి.
2. రాగి గంజి
రాగి యొక్క గొప్పదనం మన తరం వాళ్ళు మర్చిపోతున్నాము. రాగిలో మన శరీరానికి కావాల్సిన అతి విలువైన పోషకాలు ఉంటాయి. రోజు రాగి గంజి తాగడం వలన మన శరీరం ధృడంగా మారుతుంది. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు రాగి గంజి ఎంతో మేలు చేస్తుంది.
దీనిని కూడా 6 నెలలు పైబడిన పిల్లలకు మాత్రమే ఇవ్వాలి.
కావలసిన పదార్థాలు
అర కప్పు నీరు
ఒక టీ స్పూన్ ఇంట్లో తాయారు చేసుకున్న రాగి పిండి (ఇంట్లో తాయారు చేసుకున్న రాగిపిండి స్వచ్చంగా ఉంటుంది)
తయారు చేయు విధానము
మరుగుతున్న నీటిలో రాగి పిండి కలిపి బాగా ఉడికించాలి. ఉంతలు కట్టే ప్రమాదం ఉంది కాబట్టి ఆ మిశ్రమాన్ని గంటితో తిప్పుతూ ఉండాలి. 10 - 15 నిముషాలలో రాగి గంజి తాయారు అయిపోతుంది. అలాగే రాగిముద్ద ఎలా తయారు చేసుకోవాలి, రాగిముద్ద ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వోట్స్ గంజి
దీనిని కూడా 6 నెలలు పైబడిన పిల్లలకు మాత్రమే ఇవ్వాలి
కావలసిన పదార్థములు
అర కప్పు వోట్స్
తగినన్ని నీళ్ళు
తయారు చేయు విధానము
1. నీటిని ఒక గిన్నెలో బాగా మరిగించాలి
2. అందులో వోట్స్ ను వేసి పూర్తిగా ఉడికేంత వరకు ఉంచాలి.
3. వోట్స్ లోని సారమంతా నీటిలోకి వచ్చేశాక వోత్స్ ని నీటిలో నుంచి తీసేయాలి
4. దీనిని ఏదైనా పండు గుజ్జు తో మీ పిల్లలకు తినపించవడం ద్వారా రుచిగా ఉంటుంది.
సగ్గు బియ్యం
సగ్గు బియ్యం గంజి 7 నెలలు దాటిన పిల్లలకు మాత్రమే ఇవ్వాలి.
కావలసిన పదార్థములు
రెండు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం
చిటికెడు యాలకల పొడి
చిటికెడు బాదం పొడి
తయారు చేయు విధానము
1. సగ్గు బియ్యం ని బాగా కడగాలి.
2. చిన్న సగ్గు బియ్యం అయితే ఒక గంట, పెద్ద సగ్గు బియ్యం అయితే రాత్రంతా నాన పెట్టాలి.
3. నీటిని మరిగించి అందులో సగ్గు బియ్యం వేసి అపారదర్సాక స్తితికి వచ్చేవారు ఉడికించాలి.
4. చివరగా యాలకల పొడి మరియు బాదం పొడి కలపాలి.
రవ్వ గంజి
6 నెలలు దాటిన పిల్లలకు మాత్రమే దీనిని ఇవ్వాలి.
కావలసిన పదార్థములు
1. ఒక కప్పు రవ్వ
2. రెండు టీ స్పూన్ల నెయ్యి
3. మూడు కప్పుల నీరు
4. చిటికెడు యాలకల పొడి
తయారు చేయు విధానము
ముందుగా రవ్వని దోరగా వేయించాలి. తరువాత రవ్వని ఒక ప్లేట్ లో తీసుకొని, పెనుములో నీరు పోసి మరిగించాలి. బాగా మరుగుతున్న నీటిలో ముందుగ వేయించిన రావ్వని వేసి ఉంటలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. చివరగా కొంచెం నెయ్యి, చిటికెడు యాలకలు వేసి రవ్వని సున్నితంగా అయ్యేంత వరకు పెనుము మీద ఉంచాలి.
గంజి పిల్లలకు సులువుగా జీర్ణమవ్వడమే కాకుండా తినడానికి కూడా బాగుంటుంది. అందువలన అప్పుడప్పుడే ఘన పదార్థాలు మొదలు పెడుతున్న పిల్లలకి గంజి ఇవ్వడం అత్యంత శ్రేయస్కరం.
..............................
మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..
Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.
ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.
Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
