Link copied!
Sign in / Sign up
52
Shares

చిన్న పిల్లలు జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడానికి 10 చిట్కాలు

జలుబు, దగ్గు వంటివి పెద్దవాళ్లకు వస్తేనే చాలా సౌకర్యానికి గురవుతారు అలాంటిది చిన్న పిల్లలకు వస్తే, వారికి చాలా ఇబ్బందిగా ఉంటుది. వారు శ్వాస పీల్చలేకపోవడం, సరిగ్గా తినలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. అయితే, జలుబు, దగ్గు వచ్చిన తర్వాత కొన్ని చిట్కాలు పాటించడం వల్ల వాటిని సులభంగా ఎదుర్కోవచ్చు. అవేంటంటే...

తగినన్ని నీళ్ళు తాగించడం

శరీరంలో తగినంత నీరు ఉండటం వల్ల జలుబు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కాబట్టి, పుట్టిన బాబుకు లేదా పాపకు 6 నెలలు నిండినట్లైతే, రోజులో క్రమం తప్పకుండా వేడి చ్రేసి చల్లార్చిన నీళ్ళు తాగించండి.

సోంపు, వెల్లుల్లిలతో మర్ధనా చేయడం

సోంపు గింజలు, వెల్లుల్లిని కొంచెం సేపు వేయించి, వాటిని ఒక గుడ్డలో చుట్టి ఆ మూటతో బాబు/పాప చాతీ దగ్గర మర్ధనా చేయాలి. ఇలా చేస్తే వారికి శ్వాస బాగా అంది జలుబు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

వెచ్చని గాలి

బాబు/పాప పడుకునే గది వెచ్చగా ఉండేటట్లు చూసుకోండి. గదిని వెచ్చగా ఉంచడానికి హుమిడిఫైర్ అనే పరికరాన్ని గదిలో అమర్చడం మంచిది. దీంతో పాటూ బాబు లేదా పాపకు వేడి నీళ్ళతో స్నానం చేయించాలి. వేడి నీళ్ళతో స్నానం చేయించడం వల్ల బాగా నిద్రపోవడమే కాక శరీరం మీద ఉండే క్రిములు కూడా చనిపోతాయి.

మర్ధనా చేయాలి

బాబు/పాప వెంటనే ఉపశమనం పొందడానికి కాచిన ఆయిల్‌తో మసాజ్ చేయాలి. కాచిన ఆయిల్‌కు కొంచెం వెల్లుల్లి పేస్ట్‌ను జత చేసి మర్ధనా చేస్తే, బాబుకు శ్వాస బాగా అంది ఎటువంటి అంతరాయం లేకుండా నిద్రపోతాడు.

ఆవిరి పట్టించడం

ముక్కుదిబ్బడతో బాధపడుతున్న పిల్లలకు ఆవిరి పట్టించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అయితే, ఆవిరి పట్టించడానికి జండూబామ్, విక్స్ వంటి కృత్రిమ మిశ్రమాలు వాడకుండా సహజమైనవి వాడటం ఉత్తమం.

బాబు/పాప తల కింద దిండు పెట్టడం

బాబు పడుకునేటప్పుడు తల కింద ఏదైనా మెత్తటి వస్త్రాన్ని దిండుగా పెట్టాలి. ఇలా చేస్తే శ్వాస బాగా అందడమే కాక బాబుకు వెచ్చగా ఉంటుంది.

పసుపు

పసుపును ముద్దగా చేసి బాబు/పాప యొక్క నుదుటి మీద పూయాలి. దీనితో పాటూ పాప తాగే పాలలో కొంచెం పసుపు పొడి వేయాలి. ఇది యాంటి యాక్సిడెంట్‌గా పని చేసి జలుబు, దగ్గు వంటి వాటిని తొందరగా పోగొడుతుంది.

తేనె

దగ్గు ఎక్కువగా ఉన్నవారు తేనే తినడం వల్ల ఉపశమనం పొందవచ్చు. వెచ్చని నీళ్ళలోకి 4-5 తేనే చుక్కలు వేసి, రోజులో వీలైనన్ని సార్లు తాగించాలి. అలాగే ఒక స్పూన్ తేనేలో కొంచెం దాల్చిన చెక్క పొడి వేసి పిల్లలచే తాగించినా కూడా జలుబు తొందరగా తగ్గిపోతుంది. అయితే, ఈ చిట్కాను సంవత్సరంలోపు వయసు ఉన్న పిల్లలకు అమలుచేయకపోవడం మంచిది.

కర్పూరం

కొంచెం కర్పూరం పొడిని 3-4 చుక్కల కొబ్బరి నూనెలో కలిపి పాప/బాబు చాతీ మీద రుద్దాలి. ఇలా చేస్తే పిల్లలకు శ్వాస చక్కగా అందుతుంది. అయితే కర్పూరం చర్మానికి హాని కలిగించే అవకాశం ఉన్నందున చాలా తక్కువ మోతాదులో వాడాలి.

బెండకాయ

బాగా ఉడికిన బెండకాయను తక్కువ మోతాదులో పాప/బాబుకు తినిపించాలి. ఇలా చేస్తే జలుబు తొందరగా తగ్గిపోతుంది. అయితే, 6 నెలల కన్నా తక్కువ వయసు ఉన్న వారికి తినిపించకండి.

పై చిట్కాలు పాటించడం వల్ల మీ పాప/బాబులో రోగ నిరోధక శక్తి పెరిగి తొందరగా జలుబు, దగ్గు వంటి వాటి నుండి ఉపశమనం పొందుతారు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon