Link copied!
Sign in / Sign up
35
Shares

చెవులను శుభ్రం చేయడానికి కాటన్ ఇయర్ బడ్స్ ఉపయోగించవచ్చా..! అసలు నిజం తెలుసుకోండి

image source - 9coach Nine

తలస్నానం చేసి వచ్చిన వెంటనే చాలామంది కాటన్ ఇయర్ బడ్స్ ను ఉపయీగించడం చేస్తుంటారు. చెవిలో ఏదైనా నొప్పిగా ఉన్నప్పుడు, గులిమి తీయడానికి, చెవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వెంటనే ఇయర్ బడ్స్ తీసుకుని చెవులలో పెట్టి అటూఇటూ తిప్పుతూ ఉంటారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే అస్సలు వద్దని చెబుతున్నారు డాక్టర్లు. మన శరీరంలోని అత్యంత సున్నితమైన అవయవాలలో చెవులు ఒకటి. చెవులలో ఇంకా సున్నితమైన నరాలు ఉంటాయి. అందుకని ఇలా ఇయర్ బడ్స్ ను మాటిమాటికీ చెవులలో పెట్టి తిప్పడం వలన చెవులకు ప్రమాదమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే చెవులను ఎలా శుభ్రం చేయాలి? చెవి ఇన్ఫెక్షన్స్, చెవిపోటు ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలలో చెవి ఇన్ఫెక్షన్స్ ఎలా గుర్తించాలి మరియు ఎటువంటి సహజ చిట్కాలను ఫాలో అవ్వాలో ఇక్కడ తెలుసుకోండి. 

1.చెవులలో గులిమి ఎలా చేరుతుంది?

2.చెవులను ఎలా శుభ్రం చేసుకోవాలి?

3.చెవిపోటు, చెవి ఇన్ఫెక్షన్స్ నుండి ఎలా బయటపడాలి?

4. పిల్లలలో చెవి ఇన్ఫెక్షన్ మరియు ఇన్ఫెక్షన్ ను తగ్గించే సులభమైన మార్గాలు 

5.చెవులను వీటికి దూరంగా ఉంచండి

చెవినొప్పి, చెవిలో చీము, చెవిలో గులిమి..వీటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సున్నితమైన చెవులలో ఏదైనా చేరినప్పుడు పిల్లలైనా, పెద్దలైనా సరే ఒకే నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది. నొప్పిని తట్టుకునే శక్తి పెద్దవారికి కాస్త ఎక్కువగా ఉండవచ్చు కానీ బాధ మాత్రం అందరికీ ఒక్కటే.. కాబట్టి ముందుగా చెవిలోకి గులిమి ఎలా చేరుతుందో చూద్దాం..

1.చెవులలో గులిమి ఎలా చేరుతుంది?

దుమ్ము, ధూళి, కాలుష్యం కారణంగా, సబ్బు నురగను సరిగ్గా శుభ్రం చేసుకోనప్పుడు, బయట ఎక్కువగా తిరిగినప్పుడు చెవులలో గులిమి సాధారణంగా ఏర్పడుతుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం చెవులలోని లోపలి గదులను రక్షించడానికి చెవులలో ఏర్పడిన గులిమి ఉపయోగపడుతుందని అంటున్నారు. ఈ విధంగా ఏర్పడిన గులిమిని ప్రత్యేకంగా మనం శుభ్రం చేయాల్సిన అవసరం లేదని వాటంతట అవే చెవులలో ఏర్పడినటువంటి గులిమిని చెవులు శుభ్రం చేసుకోగలవని అంటున్నారు వైద్యులు. అది నిజమే కానీ, మనం బయట ఎక్కువగా తిరిగినప్పుడు చెవులలోకి చొరబడిన దుమ్ము ధూళి కాలుష్యాన్ని బయటకు పంపించడానికి ప్రత్యేకంగా ఇయర్ బడ్స్, తాళం చెవులు, ఇనుప వస్తువులు, పిన్నీసులు వంటివి వాడకుండా ఇక్కడ చెప్పుకునే విధంగా సహజ చిట్కాలను ఫాలో అవ్వడం మంచిది. 

2.చెవులను ఎలా శుభ్రం చేసుకోవాలి?

చెవులు చాలా సున్నితమైన అవయవాలని ఇది వరకే చెప్పుకున్నాం. జస్ట్, ఒక్కసారి ఊహించుకోండి ప్రతిరోజూ మంచి వినసొంపైన సంగీతాన్ని వింటూ, అందమైన కళ్ళతో అద్భుతమైన విజువల్స్ చూస్తున్నారు. ఒక్కసారిగా మనం చేస్తున్న తప్పుల కారణంగా మన చెవులు వినిపించకపోతే ఎలా ఉంటుందో.. అందుకని చెవులను జాగ్రత్తగా, ఎప్పటికీ శుభ్రంగా ఉంచుకోవడానికి ఇక్కడ చెప్పుకునే విధంగా శుభ్రం చేసుకుంటే మీ చెవులను కాపాడుకోవచ్చు. 

వెల్లుల్లి

చెవులను వెల్లుల్లిని ఉపయోగించి ఎలా శుభ్రం చేసుకోవాలో చాలామంది మహిళలకు తెలిసే ఉంటుంది. మనపెద్దలు ఎప్పటినుండి ఇది ఫాలో అవుతున్నారు కూడా. ముందుగా రెండు వెల్లుల్లి రిబ్బలను తీసుకోవాలి. రెండు స్పూన్ల ఆముదం లేదా కొబ్బరినూనెను చిన్న గిన్నెలోకి అందులో వెల్లుల్లి రిబ్బలను వేసుకుని వేడిచేసుకోవాలి. ఇలా వేడిచేసుకున్న తర్వాత కాసేపు చల్లార్చుకుని వెల్లుల్లిని (వెల్లుల్లితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు) బయటకు తీసి చెవులలో రెండు చుక్కలు వేసుకోవాలి. చెవుల నుండి ఈ నూనె చుక్కలు బయటకు రాకుండా కాటన్ అడ్డుగా ఉంచుకోవాలి. ఒక గంట తర్వాత స్నానం చేసుకునేటప్పుడు చెవులను శుభ్రం చేసుకుంటే చాలు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇలా చేసుకోచ్చు. వెల్లుల్లితో పాటు ఇంకా సులభంగా చెవులను ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.  చెవులను శుభ్రం చేసుకునే సులభమైన పద్ధతులు 

3.చెవిపోటు, చెవి ఇన్ఫెక్షన్స్ నుండి ఎలా బయటపడాలి?

ఏ నొప్పి నుండి అయినా బయటపడవచ్చేమో గానీ ఈ నొప్పిని తట్టుకోవడం చాలా కష్టంరా బాబూ అనుకునే బాధాకరమైన నొప్పులలో చెవి నొప్పి ఒకటి. చెవిపోటు, చెవిలో ఇన్ఫెక్షన్స్ కారణంగా వచ్చే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టమే. అందుకే ఇక్కడ సులభంగా చెవిపోటును, చెవి ఇన్ఫెక్షన్ సమస్య నుండి ఎలా బయటపడవచ్చో సహజ చిట్కాల ద్వారా తెలుసుకోండి. 

తులసి ఆకులు 

తులసిని దాదాపు చాలా రకాల వ్యాధులను, అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి ఆయుర్వేదాలలో ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. (తులసి మొక్క ఇంట్లో ఉన్నవారు ఈ తప్పులు చేయకండి ). కాగా చెవిపోటు, చెవిలో చీము, ఇన్ఫెక్షన్స్ సమస్య ఉన్నప్పుడు ముందుగా కొన్ని తులసి ఆకులను తీసుకుని బాగా నుజ్జుగా నూరుకోవాలి. తులసి ఆకుల నుండి వచ్చిన రసాన్ని ఒక మంచి క్లాత్ లో ఉంచి వడగగట్టుకోవాలి. ఈ తులసి ఆకుల రసాన్ని చెవులలో రెండు చుక్కలు వేసుకుని ఒక గంట తర్వాత క్లీన్ చేసుకుంటే చెవిపోటు సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు. కేవలం ఒక్క తులసి మాత్రమే కాదు, మీ వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో చెవిపోటు, చెవిలో చీము బాధ నుండి  ఎలా బయటపడవచ్చో ఇక్కడ తెలుసుకోవచ్చు. చెవినొప్పిని 5 నిముషాలలో తగ్గించే సులభమైన చిట్కాలు 

4. పిల్లలలో చెవి ఇన్ఫెక్షన్ మరియు ఇన్ఫెక్షన్ ను తగ్గించే సులభమైన మార్గాలు 

ఇంట్లో పసిపిల్లలున్నప్పుడు వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎందుకు ఏడుస్తారు? వారి ఆరోగ్య సమస్య ఏంటి? ఇలా తెలుసుకోవడం చాలా కష్టమైన పనే. కానీ పిల్లలు కొన్ని విషయాలను సైగల ద్వారా, చేతులను కళ్ళు, కడుపు, చెవులు, కాళ్ళ భాగాలలో తాకుతూ తమ బాధను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా పిల్లలు త్వరగా బాధపడే విషయాలలో చెవి సమస్యలు ఒకటి. పిల్లలలో చెవి ఇన్ఫెక్షన్స్ సమస్యను కనుక్కోవడం అమ్మలకు కాస్త కష్టమైన విషయమే. అందుకని ఈ గుర్తులు కనిపించినట్లయితే అది చెవి సమస్యగా గుర్తు పెట్టుకోండి. సరిగ్గా తినకపోవడం, చెవి నుండి ద్రవాలు వస్తూ ఉండటం, అటూఇటూ బెడ్ పై ఏడుస్తూ దొర్లుతూ ఉండటం, చెవి నుండి వాసన వస్తుండటం, చెవులు వత్తుకుంటూ ఉండటం, వాంతులు మరియు విరేచనాలు కలగడం పిల్లలలో చెవి ఇన్ఫెక్షన్స్ వలన కనిపించే గుర్తులు. ఇలాంటి గుర్తులు పిల్లలలో కనిపించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోగలరు. పసిపిల్లలలో తీవ్రమైన చెవి ఇన్ఫెక్షన్ ఎలా గుర్తించాలి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..5.చెవులను వీటికి దూరంగా ఉంచండి

చెవులలో గులిమి ఎలా ఏర్పడుతుంది, చెవులను సహజ చిట్కాలతో ఎలా శుభ్రం చేసుకోవచ్చు, చెవిపోటు మరియు చెవిలో చీమును ఎలా తగ్గించుకోవచ్చో చూశారు కదా. అయితే వినసొంపైన మాటలను, బయట నుండి వచ్చే శబ్దాలను మీరు ఎప్పటికీ పర్ఫెక్ట్ గా వినాలనుకుంటే మీ చెవులను వీటికి దూరంగా ఉంచండి. ఇయర్ బడ్స్ ఉపయీగించకూడదు, ఎక్కువ సౌండ్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడం, సినిమాలు చూడటం మీ చెవులకు అంత మంచిది కాదు, హోరుగా వినిపించే శబ్దాలు, టపాసులు శబ్దాలు వింటున్నప్పుడు చెవులలో కాటన్ పెట్టుకోవడం చేయాలి. పార్టీలలో ఎక్కువగా పెద్ద పెద్ద మైక్ సెట్స్ అరేంజ్ చేసి గట్టిగా శబ్దాలు చేస్తుంటారు కాబట్టి చెవి సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం బెటర్. 

చెవులు మన శరీరంలో అత్యంత సున్నితమైనవి కాబట్టి పైన చెప్పిన విషయాలను అస్సలు మర్చిపోకండి. ఈ సంగతులను అందరికీ తెలిసేలా షేర్ చేయగలరు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon