Link copied!
Sign in / Sign up
4
Shares

చెవిపోటు, చెవిలో చీము నొప్పిని ఎలా తగ్గించాలి : సులభమైన చిట్కాలు మీకోసం..

ఏ నొప్పి వచ్చినా తట్టుకోవచ్చు గానీ చెవిపోటు వస్తే మాత్రం అస్సలు తట్టుకోలేం అంటుంటారు ఈ నొప్పితో బాధపడేవారు. కేవలం చెవిపోటు అనే కాదు.. కడుపునొప్పి, తలనొప్పి ఇలా ఏ నొప్పి వచ్చినా సరే దాన్ని తట్టుకుని భరించడం కాస్త కష్టమే. అయితే చెవులను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వలన, స్నానం చేసినప్పుడు చెవులలో చేరుకున్న నురుగు అలాగే ఉండటం వలన, దుమ్ము ధూళి కారణంగా చెవిపోటు, చెవిలో చీము చేరడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ చెప్పుకునే ఈ సులభమైన చిట్కాల ద్వారా ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో చూడండి. 

నువ్వులనూనె

చెవిపోటు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు రెండు చుక్కలు గోరు వెచ్చగా చేసినటువంటి ఆవాల నూనె లేదా నువ్వుల నూనెను చెవిలో వేసుకోవడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. 

చీము కారుతున్నప్పుడు 

చెవి సమస్యలలో ముఖ్యంగా చెవిలో చీము కారడం ఎక్కువగా చిన్న పిల్లలలో జరుగుతూ ఉంటుంది. అందుకని కొంచెం కొబ్బరి నూనె తీసుకుని అందులో కాస్త ఇంగువ కలుపుకుని వేడి చేసుకోవాలి. గోరు వెచ్చగా అయిన తర్వాత రెండు చుక్కలను చీము కారుతున్న చెవిలో వేసుకోవడం వలన చీము కారటాన్ని ఆపవచ్చు. 

తులసి ఆకులతో

చెవిపోటు, చెవిలో చీము, చెవి ఇన్ఫెక్షన్స్ సమస్యలకు తులసి ఆకులు బెస్ట్ రెమెడీగా చెప్పుకోవచ్చు. ఆయుర్వేద నిపుణులు చెప్పిన ఆరోగ్య సూచనల ప్రకారం చెవి సమస్యలు ఉన్నప్పుడు కొన్ని తులసి ఆకులను తీసుకుని నుజ్జుగా బాగా నూరుకోవాలి. తులసి ఆకుల నుండి వచ్చిన రసాన్ని శుభ్రంగా ఉన్నటువంటి క్లాత్ లో వడగట్టుకుని చెవిలో రెండు చుక్కలు వేసుంకుని ఆ తర్వాత శుభ్రం చేసుకోవడం వలన చెవి సమస్యలను తగ్గించుకోవచ్చు. 

వెల్లుల్లి 

ఇది దాదాపు అమ్మలందరికీ తెలిసిన హోమ్ రెమెడీ. రెండు స్పూన్ల ఆముదం లేదా నువ్వుల నూనెలో రెండు వెల్లుల్లి రిబ్బలను వేసుకుని వేడి చేసుకోవాలి. బాగా మరిగేంతవరకు ఉంచుకుని ఆ తర్వాత కిందకు దించుకోవాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు రెండు చుక్కలను చెవిలో వేసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. 

ఆలివ్ ఆయిల్ 

పైన చెప్పుకున్నట్లుగానే చెవి ఇన్ఫెక్షన్స్ ఉన్నపుడు గోరువెచ్చగా ఆలివ్ ఆయిల్ ఉండేలా చేసుకుని, రెండు చుక్కలను చెవిలో వేసుకోవడం వలన దీని నుండి కాస్త రిలీఫ్ గా ఉంటుంది. ఆ తర్వాత దూది లేదా కాటన్ తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. చెవులలో వేళ్ళు పెట్టడం, తాళం చెవి పెట్టి తిప్పడం, చెవులను శుభ్రం చేసుకునే ఈయర్ బర్డ్స్ ను ఎక్కువగా వాడటం మంచిది కాదు. 

చెవిలో చీము, చెవిపోటు సమస్యల నుండి తక్షణ ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకున్నారు కదా.. ఈ విషయాలను అందరికీ షేర్ చేయండి. 

cover image source : public domain pictures

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon