Link copied!
Sign in / Sign up
2
Shares

చేతులు, కాళ్ళు లేని ఈ బాబు తండ్రి ఒడిని చేరుకోవడానికి చేసిన ప్రయత్నం చూస్తే చలించిపోతారు

జననం, మరణం అనేవి ఆ దేవుడు వల్లే జరుగుతుందని అంటారు. కానీ, ఒక జీవిని ఈ ప్రపంచంలోకి తీసుకువస్తున్నప్పుడు ఎందుకు ఇలా పుట్టిస్తాడో అర్థం కాదు. మనకు తెలియని వారు కాకపోయినా ఎవరికైనా ఏదైనా జరిగితే అయ్యో పాపం అంటూ జాలి, దయ చూపిస్తాం. కానీ పుట్టుకతోనే కాళ్ళు, చేతులు లేకుండా ఈ బాబు తన తండ్రిని ఒడిని చేరుకోవడానికి చేసిన ప్రయత్నం చూస్తే గుండె తరుక్కుపోతుంది. ప్రపంచమంతటా వైరల్ గా మారిన ఆ వీడియోను మీరు వీక్షించండి.

గర్వపడుతున్న తల్లి

వీడియోలో ఉన్న ఈ 4 ఏళ్ళ బాబు పేరు కాండెన్. అతని తల్లి తండ్రులు కేట్ విడన్, కోల్ గ్రీన్. కేట్ విడన్ 18 నెలల గర్భంతో ఉన్నప్పుడు తన బిడ్డకు ఇంకా కాళ్ళు, చేతులు రాలేదని తెలిసింది. బిడ్డ బయటకు వచ్చాక ఆ బాబు అమేలియా-ఫోకామేలియా (amelia-phocomelia) కారణంగానే ఈ విధంగా జరగడానికి కారణం అని తెలిపారు వైద్యులు. అయితే మొదట్లో తన బిడ్డను చూసి ఏమీ చేయలేడో అని ఏడ్చేసిన కేట్ విడన్, తండ్రి ఒడిని చేరుకోవడానికి చేసిన ప్రయత్నం చూసి నువ్వు నాకు కొడుకుగా పుట్టినందుకు గర్విస్తున్నాను అని తెలిపింది.

నువ్వు కూర్చోగలవు..పడిపోలేవు

తన బాబుకు ఎలాగైనా కొండంత అండగా నిలబడాలనుకున్నారు ఆ తల్లితండ్రులు. అందుకే 4 ఏళ్ళ వయస్సున్న కేట్ విడన్ కు నడవగలిగే ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని అందించాడు తండ్రి కోల్ గ్రీన్. ముందుకు రా, నువ్వు కూర్చోగలవు, నువ్వు నడవగలవు అంటూ ఆ బిడ్డకు కొంచెం దూరంగా కూర్చొని రమ్మని ప్రోత్సహించాడు. అంతే ఒక్క నిముషంలో చిన్న చిన్న అడుగులు వేస్తూ తండ్రి ఒడిని చేరుకున్నాడు. బిడ్డ వారి దగ్గరకు తల్లితండ్రుల కళ్ళలో నీళ్లు తిరిగాయి.

మొదట్లో ఏడుపు వచ్చింది

మొదటిసారి నా బాబును చేతుల్లోకి తీసుకోగానే కాళ్ళు లేవు, చేతులు లేవు. తను ఒక బొమ్మలా ఉండిపోవడం నాకు బాధ కలిగించింది. అయితే రెండు నెలల తర్వాత నేను, నా బాబు బెడ్ పై ఉండగా అక్కడ ఉన్న బొమ్మలను అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ తన్నడం మొదలుపెట్టాడు. అలా చేస్తుంటే ఏడుపు ఆపుకోలేకపోయాను, కానీ నా బిడ్డ నడవగలడు తన పని తాను చేసుకోగలడు అనే ధైర్యం కలిగింది. అందుకే ఈ వీడియోను మీ అందరితో SHARE చేసుకుంటున్నాను అంటూ ప్రపంచానికి తన కొడుకుని పరిచయం చేసింది ఆ బాబు తల్లి కేట్.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బాబును చూసిన ప్రతి ఒక్కరూ నువ్వు ఏదైనా సాధించగలవు అంటూ తమ బ్లెస్సింగ్స్ తెలుపుతున్నారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon