Link copied!
Sign in / Sign up
20
Shares

మీ చేతులు నల్లగా ఉన్నాయా..! అయితే ఒకే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మహిళలు చెప్పిన చిట్కాలు

ఉదయం నిద్రలేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునేవరకు గృహిణిగా మహిళకు ఎన్నో పనులు ఉంటాయి. పిల్లల దగ్గర నుండి భర్త, అత్తమామలు..ఇలా అందరినీ బాగా చూసుకుంటూ ఉంటుంది. ఇలా ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉండటం వలన చేతులపై నిగారింపు తగ్గిపోయి, అందంగా కనిపించకుండా నల్లగా మారిపోతుంటాయి. ముఖం, చర్మం కాంతివంతంగా ఉన్నా చేతుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం నలుపుదనం అలాగే ఉంటుంది. అందుకని ఈ చిట్కాలు ఫాలో అవ్వడం వలన మీ చేతులను అందంగా ఉంచుకోవచ్చు..

అందరూ గమనించేవి ఇవే..గుర్తుపెట్టుకోండి

బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్స్ కు వెళ్లినప్పుడు ముఖం, చిరునవ్వుతో పాటు మీ చేతులను, కాలి పాదాలను అందరూ గమనిస్తూనే ఉంటారు. ముఖం అందంగా ఉండి చేతులు కాంతివంతంగా అందంగా లేకపోతే మాత్రం ఏదో ఇబ్బందిగా ఉంటుంది అందరి ముందు.  ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కూడా.

తేనె మరియు ఆరంజ్ జ్యూస్

చిన్న బౌల్ లో రెండు స్పూన్ల తేనె, మూడు టేబుల్ స్పూన్ల ఆరంజ్ జ్యూస్, ఒక టేబుల్ స్పూన్ పంచదార తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసుకుని ఆ మిశ్రమాన్ని చేతులపై వేసుకుని నిమ్మకాయతో నెమ్మదిగా పైకి కిందకు రుద్దటం చేయాలి. పదిహేను నిముషాల తర్వాత చల్లని నీటితో చేసుకుంటే చేతులు అందంగా అవుతాయి.

ఆలివ్ ఆయిల్

ముందుగా ఒక బౌల్ లోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోవాలి. ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను అందులో మిక్స్ చేయాలి. తర్వాత రెండు స్పూన్ల నిమ్మరసం అందులో కలుపుకుని మిక్స్ చేయాలి. (ఇందులోనే గ్రీన్ టీ పౌడర్ ను కాస్త కలుపుకోవచ్చు..అది మీ ఇష్టం). పై మిశ్రమాన్ని పాదాలు మరియు చేతులపై రాసుకుని బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు.

కలబంద గుజ్జు

కలబంద గుజ్జును నలుపుగా ఉన్న చేతులు మరియు కాళ్లపై రాసుకుని ఆరిన తర్వాత క్లీన్ చేసుకుంటే మీ చేతులు అందంగా కాంతివంతంగా కనిపిస్తాయి.

శనగపిండి

నలుపుగా ఉన్న చేతులు, మెడ, కాళ్ళపై శనగపిండిని కాస్త నీటిలో కలిపి రాసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే ముల్తాన్ మట్టిలో కాస్త రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా రాసుకుని పది నిముషాల తర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ కింద ఉన్న వీడియో ప్రకారం కూడా ఫాలో అవ్వచ్చు..   

Video Credits : Simple Beauty Secrets

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon