Link copied!
Sign in / Sign up
5
Shares

చేతి గోళ్ళ ఆకారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. ఎలాగో చూడండి !!

ఇప్పటివరకు చేతి వేళ్ళ సైజును బట్టి, కాలి పాదాలను బట్టి, హస్త రేఖల ఆధారంగా మీ వ్యక్తిత్వం గురించి, మీరు ఎలాంటి వారో తెలుసుకుని ఉండవచ్చు. ఐతే చేతి గోర్ల సైజును బట్టి కూడా మీ పర్సనాలిటీని ఈజీగా తెలుసుకోవచ్చు. అందరికీ గోర్లు ఒకే విధంగా ఉండవు. పొడవుగా, గుండ్రంగా, చతురస్రం, త్రిభుజం, వెడల్పుగా, కోడి గుడ్డు ఆకారంలో, కొన్ని గింజల ఆకారంలో రౌండ్ గా ఉంటాయి. మరి మీ చేతి గోర్ల ఆకారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం గురించి మీరే తెలుసుకోండి.

చేతి గోర్లు పొడవుగా ఉంటే

ఈ విధంగా గోర్లు కలిగిన వారు చాలా అందంగా ఉంటారు. అందరితో సులువుగా కలిసిపోతారు. ఏ పని చేసినా స్వార్థంతో చేసినా అది అందరికోసం మాత్రమే అయ్యి ఉంటుంది. ఆలస్యమైనా సరే చేసే పని కరెక్ట్ గా ఉండేలా చేస్తారు.

గుండ్రని గోళ్లు

మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు అని మనుషులలో పోల్చి చూస్తే మంచి అనే పదానికి ఉదాహరణగా వీరిని చెప్పుకోవచ్చు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. ఎదుటివాళ్ళ సమస్యని తమలా ఫీలై వారు అడక్కుండానే సహాయం చేస్తారు. క్రియేటివిటీగా ఆలోచించడం, ఏదైనా సరే పాజిటివ్ గా ఆలోచించడం, కొన్ని కొన్ని సార్లు ఒంటరిగా ఉండటానికి బాగా ఇష్టపడతారు.

C- షేప్ లో గోర్లు ఉంటే

చేతి గోర్లు ఈ విధంగా ఉంటే వీళ్ళు ఇంతకుముందు ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులను ఎదుర్కొని ప్రస్తుతం సెటిల్ అయ్యి ఉంటారు. చాలా కష్టపడేతత్త్వం కలిగిన వారు, అలాగే ఏ విషయం అయినా సరే ధైర్యంగా ముందుకు వెళతారు. ఎవరికీ భయపడని మనస్తత్వం.

గోళ్లు వెడల్పుగా ఉంటే

చేతి గోర్లు వెడల్పుగా ఉన్న వారికి కోపం ఎక్కువని అంటున్నారు. అలాగే భూదేవికి ఉన్నంత ఓర్పు కూడా వీరికి ఉంటుంది. ఏదైనా చెప్పేటప్పుడు ముక్కుసూటిగా చెబుతుంటారు. అది నిజమైనా, అబద్ధమైనా సరే. సున్నితమైన మనస్సు కలిగిన వారు. ఫ్యామిలీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు.

త్రిభుజాకారంలో ఉన్న గోళ్లు

ఈ విధంగా ఉన్నవారికి ఎమోషన్స్ ఎక్కువ. చిన్న చిన్న విషయాలకే త్వరగా బాధపడుతూ ఉంటారు. నమ్మినవాళ్లే మోసం చేస్తే అస్సలు తట్టుకోలేరు. తమతోపాటు ఉన్నవారి కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటారు.

గోర్లు షార్ప్ గా ఉంటే

కొందరికి గోర్లు పొడవుగా, వెడల్పుగా లేదా గుండ్రంగా ఉంటూనే షార్ప్ గా ఉంటాయి.  వీళ్ళు చాలా నిజాయితీ పరులు. ఆ పదలో నేనున్నాను అని ఆదుకునే టైప్. ప్రశాంతంగా, సైలెంట్ గా ఉండటానికి ఇష్టపడతారు. అందరినీ సులభంగా నమ్ముతారు. ఎవరితోనైనా వెంటనే కలిసిపోతారు.

పైన చెప్పుకున్న వాటిలో మీ గోర్లను కంపేర్ చేసి చూసుకోండి. నిజం ఐతే ‘అవును’ అని, కాకపోతే ‘కాదు’ అని టైప్ చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon