Link copied!
Sign in / Sign up
1
Shares

పెళ్లంటే ఇలా జరగాలి : సమంత ఫేస్ బుక్ లో షేర్ చేసిన కొత్త వీడియో


వివాహం... ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే చాలా ప్రత్యేకమైన వేడుక... ఇది ఇద్దరు మనుషుల మరియు వాళ్ళ కుటుంబాల కలయిక.. ఈ వేడుకకి అలంకరణ ఒక ఆకర్షనైతే.. ఆ సంబరాన్ని అంబరం చేర్చే సరదాలు, చిలిపి పనులు, సంతోషాలు ఒక అద్బుత జ్ఞాపకం... ఈ మధ్య కాలం లో అంత అద్బుతంగా జరిగిన వివాహాలలో ఒకటే, అక్కినేని కుటుంబంలో జరిగిన సమంత నాగ్ చైతన్ల వివాహం...

గతేడాది అక్టోబర్ లో గోవాలో సమంత నాగ్ చైతన్యలు తమ ప్రేమ బంధాన్ని, ఒక పవిత్ర వివాహ బంధంగా మార్చుకున్నారు. ఈ పెళ్ళి వాళ్ళ సంతోషాలకు ప్రతిరూపంగా వాళ్ళను అభిమానించే వాళ్ళకు కన్నుల పండుగలా అంగరంగ వైభవంగా జరిగింది.. అభిమానులందరి గుండెల్లో ఇంకా ఒక పండుగలా మిగిలిపోయింది..

అక్కినేని వాళ్ళు కేవలం తమ మరియు దగ్గుబాటి కుటుంబ సభ్యులను, మరియు సన్నిహితులను మాత్రమే ఈ వివాహంలో పాల్గొనేందుకు ఆహ్వానించారు... ఈ వివాహం వైవిధ్యంగా హిందూ మరియు క్రిస్టియన్ ఈ రెండు సంప్రదాయ పద్దతులలో జరిగింది.. పెళ్ళికి ముందు జరిగే సంగీత్, మెహందీ, ఇలా అన్నింటిని తమదైన శైలిలో ఆనందంగా జరుపుకున్నారు. అన్ని సందర్భాలలో అఖిల్, చైతు, రానాలు చేసిన అల్లరి ఒక ఎత్తైతే సమంత చేసిన అల్లరి ఇంకో ఎత్తు.. సంగీత్ లో దగ్గుబాటి సురేష్ బాబు గారితో సమంత వేసిన స్టెప్పులు మనం ఇంకా మర్చిపోలేం...

ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి క్షణం నవ్వులు, సంతోషాలతో నిండిపోయింది.. ఈ సంబరాన్ని తమ కెమెరాలో బంధించి వీడియో గా రూపుదిద్దారు జోసెఫ్ రాధిక గారు. ఆ పెళ్లి విడియోలోని కొన్ని సన్నివేశాలను మనకోసం ఈరోజే విడుదల చేసారు... ఇంకెందుకు ఆలస్యం.. నేనైతే ఆ వీడియో ఇప్పుడే చూసాను... మరి మీరు...?

Video Credits : Annapurna Studios

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon