Link copied!
Sign in / Sign up
9
Shares

చపాతీలు మెత్తగా, రుచిగా ఉండాలంటే ఇలా చేస్తే చాలు..

ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో రాత్రి లేదా ఉదయం బ్రేక్ ఫాస్ట్ టైంలో చపాతీలు చేసుకోవడం కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ఎక్కువగా రైస్ తీసుకోవడం కంటే చపాతీలు తీసుకోవడం బెస్ట్ అని, బరువు తగ్గడానికి బాగా  ఉపయోగపడుతుందని చపాతీలు ఇష్టపడుతున్నారు. ఐతే చాలామంది చపాతీలు చాలా  గట్టిగా ఉన్నాయని, మృదువుగా లేవని బాధపడుతూ ఉంటారు. చపాతీలు మెత్తగా, మృదువుగా రావాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

చపాతీలు మెత్తగా రావడానికి ఏం చేయాలి..!

1. చపాతీలు చేసుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే చేసుకోకూడదు. అరగంట ముందు నీటితో పిండిని నానబెట్టుకుని ఆ తర్వాత చపాతీలు  చేసుకోవడం వలన మృదువుగా మరియు మెత్తగా ఉంటాయి.

2. చపాతీ పిండిలో కాసిన్ని గోరువెచ్చని పాలు వేసి పిండిని కలుపోవడం వలన మెత్తగా మరియు రుచికరంగా ఉంటాయి.

3. చపాతీ పిండి కలుపుకునేటప్పుడు లేదా రొట్టెలు చేసుకునేటప్పుడు గోరువెచ్చని నీటితో పిండిని కలుపుకుంటే మంచిది.  ఇలా చేయడం వలన చపాతీలు మెత్తగా మృదువుగా వస్తాయి. అలాగే ఇందులో అర స్పూన్ మోతాదులో చక్కర కలుపుకోవడం వలన మరింత రుచిగా ఉంటాయని కొందరు మహిళలు చెబుతున్నారు.

4. చపాతీలు పొంగడానికి మెత్తగా ఉండటానికి చపాతీ పిండిలో అర స్పూన్ బేకింగ్ సోడా కలుపుకోవడం వలన చపాతీలు మెత్తగా వస్తాయి.

5. చపాతీలు చేసుకునే సమయంలో పొడి పిండిని ఎక్కువగా కలుపుకోకూడదు.

6. చపాతీలు కాల్చుకున్న వెంటనే ఏదైనా ఒక పాత్రలో లేదా హాట్ బాక్స్ లో పెట్టుకుని మూత పెట్టుకోవడం వలన చపాతీలు గట్టిగా ఉండకుండా మెత్తగా మృదువుగా ఉంటాయి.

ఇవి కాకుండా మీకు ఏమైనా మీకు తెలిసి ఉంటే COMMENT చేసి చెప్పవచ్చు. ఇది మీకు నచ్చితే వెంటనే అందరికీ SHARE చేయండి.    

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon