Link copied!
Sign in / Sign up
3
Shares

చనుమొనల (నిపుల్ ) నొప్పిని పూర్తిగా తగ్గించే సులభమైన 5 చిట్కాలు


ప్రేగన్సీ తర్వాత, బ్రెస్ట్ ఫీడింగ్ చేసే దశలో శరీరంలో జరిగే హార్మోనల్ మార్పులు, రొమ్ముల్లో కొన్ని సమస్యలకు దారి తీస్తాయి. అందులో చనుమొనల నొప్పి,కూడా ఒకటి . దీని వలన చాలా బాధను భరించాల్సి ఉంటుంది. హార్మోనల్ మార్పులతో పాటు, చర్మం పొడిబారిపోవడం, సరైన సైజు బ్రాలు ధరించకపోవడం, లాంటి కారణాల వలన, చనుమొనల లో నొప్పి కలుగుతుంది. అంతే కాకూండా పగుళ్ళు కూడా ఏర్పడుతాయి. వివిధ డాక్టర్స్ ఇచ్చిన గణాంకాల ప్రకారం, బ్రెస్ట్ ఫీడింగ్ చేసే 80% మహిళలు, ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యను ఇంట్లోనే కొన్ని చిట్కాలతో నయం చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఇవే…

1. రొమ్ము పాలు (బ్రెస్ట్ మిల్క్)

అవును నిజం. చనుమొనల నొప్పికి, ఆ చనుమొనల నుండి వచ్చే పాలే ఒక మందు. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే ముందు, చేసిన తరువాత, చనుమొనలని రొమ్ముపాలతో మర్దన చేయండి. ఇలా రోజు చేయడం వలన నొప్పి తగ్గుతుంది.

2. కాపడం

మెత్తని బట్ట తీసుకొని, దానిని గోరువెచ్చని నీళ్ళలో తడిపి, చనుమొనలను మర్దన చేయండి. చనుమొనల నొప్పిని తగ్గించడానికి ఇదొక సులువైన పద్ధతి.

3. ఐస్ క్యూబ్స్

ఐస్ క్యూబ్స్ ను మెత్తని బట్టలో చుట్టి, చనుమొనల మీద సున్నితంగా రుద్దండి. ఇలా రోజు ఐస్ క్యూబ్స్ చనుమొనలను మర్దన చేయడం, నొప్పి నుంచి  కొంత ఉపశమనం ఇస్తుంది.

4. తులసి

ఇది అందరికి అందుబాటులో ఉండే, సులువుగా చేసుకోకలిగే ఇంటి వైద్యం. తులసి ఆకులని మెత్తగా రుబ్బి, ఆ పేస్ట్ ను చనుమొనల మీద పూసి, కాసేపు అరనివ్వండి. ఇలా రోజు 2-3 సార్లు చేయడం వలన, ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

5. కలబంద

చాలా సమస్యలకు కలబంద ఒక పరిష్కారం, అలాగే చనుమొనల నొప్పికి కూడా. కలబంద గుజ్జును రొమ్ములపై, చనుమొనల పై పూయండి. ఇలా రోజు చేస్తే, ఈ సమస్య తగ్గిపోతుంది.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon