Link copied!
Sign in / Sign up
0
Shares

చనిపోయిన కూతురిని 5 రోజుల పాటు తనతో పాటు ఉంచుకున్న తల్లి : అసలు ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు 😥😥👏👏

ఈ ప్రపంచంలో చాలా విలువైనది ఏంటంటే ఒకరి నుండి ప్రేమగా ప్రేమను పొందటం. ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు వారిని ప్రేమగా చూసుకోకుండా వారు పోయిన తర్వాత తలచుకుని ప్రేమించేవారు ఎక్కువ. ఇక్కడ పరిస్థితి అటువంటిది కాకపోయినా అమ్మ ప్రేమ ఎంత గొప్పదో, తల్లి మనస్సులో బిడ్డపై ఎంత ప్రేమ దాగి ఉంటుందో తెలిపే సంఘటన. మీ హృదయాలను ఇబ్బందిపెట్టి, కన్నీటిని తెప్పించినా ఈ తల్లి తన కూతురి ప్రేమ పొందటానికి ఏం చేసిందో తెలిస్తే మాత్రం మహిళగా మీరు గర్విస్తారేమో..

చనిపోయిన బిడ్డతో ఫోటో షూట్

ఈ సంఘటన 3 ఏళ్ళ క్రితం అమెరికాలోని సౌత్ డొకోటాలో గల రాపిడ్ సిటీలో జరిగింది. ఇటీవలే ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు తెలిసింది. రాపిడ్ అనే మహిళ కింద చిత్రంలో కనిపిస్తున్న అడిలైన్ అనే చిన్నారి జన్మించింది. ఎంతోముద్దుగా ఉండేది, ఐతే పుట్టిన కొన్ని రోజులకే అనారోగ్యం కారణంగా చనిపోయింది. పాప చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టమ్ చేసిన డాక్టర్లు అంత్యక్రియలు చేయడానికి తల్లితండ్రులకు అప్పగించారు. ఐతే పేగుబంధం వలనో ఏమో ఈ తల్లి కూతురికి అంత్యక్రియలు నిర్వహించకుండా 5 రోజుల పాటు తనతో పాటు ఉంచుకుని ఫోటో షూట్ చేయించుకుంది.

అసలు కారణం చెప్పిన కన్నతల్లి

చనిపోయిన బిడ్డతో ఆ దంపతులు ఫోటోషూట్ నిర్వహించడంతో అందరూ ఆమెను సోషల్ మీడియా ద్వారా తిట్టడం మొదలు పెట్టారు. అందుకు అందరికీ రిప్లై ఇస్తూ నా కూతురితో గొప్ప భవిష్యత్ ఊహించుకున్నానని, తనపై ప్రేమ వలనే ఇలా చేశానని, తన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండటానికే ఇలా చేశానని ఆ తల్లి కన్నీటి హృదయంతో తెలిపింది. నా కూతురు నా నుండి దూరం కావడంతో నా ప్రాణం పోయిందని తెలిపింది. కాగా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత పండంటి పాపకు జన్మను ఇచ్చింది.

#1

#2

#3

#4

అమ్మ ప్రేమ ఎంత గొప్పదో తెలుపుతూ తన కూతురితో తల్లి చేసిన ఫోటోషూట్ పట్ల మీ అభిప్రాయం చెప్పండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon