Link copied!
Sign in / Sign up
9
Shares

చనిపోయిన కొడుకుని వీర్యంతో బతికించిన గొప్ప తల్లి…


తల్లి ప్రేమకు హద్దులు ఉండవు. తమ బిడ్డల కోసం ఎంత దూరమైన వెళ్తారు. కానీ ఈ అమ్మ ఆ దూరాన్ని ఇంకాస్త పెంచింది. చనిపోయిన కొడుకుని తన వినూత్నమైన ఆలోచనతో బతికించింది. వివరాలలోకి వెళితే..

పుణెకు చెందిన రాజ్యశ్రీ సైన్స్ టీచర్ గా పనిచేస్తుంది. ఆమెకు ఒక కొడుకు, కూతురు. కొడుకు ప్రథమేష్ అమ్మ అందించిన ప్రోత్సాహంతో ఉన్నత చదువులు పొంది, జర్మనీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేసే వాడు. 27 ఏళ్ళ తన కొడుకు కు పెళ్ళి చేయాలనీ రాజ్యశ్రీ భావించింది. అంతా సంతోషంగా గడుస్తున్న ఈ సమయంలో కొడుకు ప్రథమేష్ కు బ్రెయిన్ ట్యూమర్ ఉందని తేలింది. దీనితో కుటుంబం మొత్తం దుఃఖం తో నిండిపోయింది.

అయినా ధైర్యం కోల్పోకుండా ప్రథమేష్ కు వైద్యం చేసి బతికించుకోవాలని కుటుంబం కోరుకుంది. బ్రెయిన్ ట్యూమర్ కు వైద్యం పుణేలో మొదలుపెట్టారు. రోజులు గడుస్తుండగా ప్రథమేశ్ కోలుకుంటాడనే ఆశ కుటుంబంలో నెలకొనింది. ఇలా గడుస్తుండగా కెమోథెరపీ లో భాగంగా ప్రథమేశ్ చూపు కోల్పోయాడు. వైద్యులు కూడా ప్రథమేష్ బతకడని తేల్చేసారు. దీనితో కుటుంబం మొత్తం తమ ఆశలను కోల్పోయింది. కానీ రాజ్య శ్రీ మాత్రం తన బిడ్డ చనిపోయిన తనతోనే ఉండాలనే తపనతో ఒక ఆలోచన చేసింది.

చనిపోబోతున్న తన కొడుకు వీర్యాన్ని సేకరించి, సర్రోగేసీ ద్వారా బిడ్డ కలిగితే, తన బిడ్డ తనతో ఉంటాడని ఆలోచించింది. దానికి వైద్యుల సహాయం తీసుకుంది. వీర్యం సేకరించింది. కొడుకు చనిపోయిన తరువాత, సర్రోగేసీ కోసం వెదికారు. అందుకు ఒప్పుకున్న ఒక మహిళ గర్భంలోకి ప్రథమేశ్ వీర్యాన్ని వైద్యుల ప్రవేశపెట్టారు. ఆమె గర్భం దాల్చి, ఈ మధ్య పండంటి కవలలకు జన్మినిచ్చింది. అందులో మెగా బిడ్డకు ప్రథమేశ్ అని పేరు పెట్టారు.

ఇలా తన ఆలోచనతో చనిపోయిన తన కొడుకును తల్లి మళ్ళి బతికించుకుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon