Link copied!
Sign in / Sign up
0
Shares

చనిపోయే 18 గంటల ముందు హాస్పిటల్ లో పెళ్లి చేసుకున్న మహిళ : ప్రపంచం మొత్తం వైరల్

విధి ఎప్పుడు ఎలా ఉంటుందో రాత రాసిన ఆ భగవంతుడు కూడా మార్చడం కష్టం అని అంటారు. అటువంటి కష్టమే ఈ దంపతులకు వచ్చింది. రెండేళ్లుగా ప్రేమించుకున్న ఈ గొప్ప ప్రేమికులు, క్యాన్సర్ కారణంగా ఒకరికొకరు దూరం అయ్యారంటే ఎంతో బాధాకరమైన విషయం. ఆమెపై తనకు ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఆమె చనిపోతున్న చివరి క్షణాలలో కూడా తన ప్రేయసిని సంతోషంగా ఉంచాలని పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్న వీరి ప్రేమ గురించి మీకోసం…

డ్యాన్స్ క్లాస్ లో కలుసుకున్నారు

ప్రేమ ఎప్పుడు ఎవరి మనస్సులో ఎలా పుడుతుందో చెప్పడం చాలా కష్టం. డేవిడ్ మోషర్ మరియు హీథర్ మోషర్ అలా 2015 లో డ్యాన్స్ క్లాస్ లో కలుసుకున్నారు. చాలా త్వరగానే ఒకరి మనసులు ఒకరి నచ్చడం, ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉండటంతో మంచి స్నేహితులు అయ్యారు. 2016 డిసెంబర్ 23 న గుర్రపు జట్కాలో హీథర్ ను కూర్చోబెట్టుకుని నగరం నడిబొడ్డున వీధి లైట్ల కాంతివెలుగుల మధ్య తన ప్రేమ విషయాన్ని చెప్పగా,తనకు ఇష్టం కావడంతో వెంటనే ఓకె చెప్పింది.

క్యాన్సర్ అని తెలిసినా పెళ్ళికి సిద్ధమయ్యారు

హీథర్ మోషర్ బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతోందని ఎక్కువ రోజులు బ్రతకదని డేవిడ్ తన ప్రేమ విషయాన్ని చెప్పకముందే తెలిసింది. కానీ తనకు ధైర్యంగా, అండగా నిలవాలనుకున్నాడు. బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించి సర్జరీ, కీమోథెరపీలు చేసినా కూడా సరైన ఫలితం లేకపోయింది. క్యాన్సర్ తీవ్రం కావడంతో అప్పటినుండి హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చింది. కాగా, 2017 డిసెంబర్ 30 న డేవిడ్, హీథర్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

చనిపోయే 18 గంటల ముందు

హీథర్ మోషర్ ను ఆ పరిస్థితిలో చూసి డేవిడ్ తట్టుకోలేకపోయాడు. పెళ్లి డేట్ వైద్యులకు చెప్పగా, హీథర్ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమని చేతులెత్తేశారు. పెళ్లి డేట్ దగ్గర పడేకొద్దీ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. కాగా తాము అనుకున్న పెళ్లి డేట్ ను డిసెంబర్ 22 కు పోస్ట్ పోన్ చేసుకున్నారు, మరో 18 గంటలలో ఆమె చనిపోతుందనగా డేవిడ్, హీథర్ ఉంగరాలు మార్చుకుని ఒక్కటయ్యారు. హీథర్, డేవిడ్ బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. హీథర్ ను పెళ్లి కూతురు గౌను, జుట్టుమొత్తం క్యాన్సర్ కారణంగా తీసివేయటంతో తలకు విగ్గును ఉంచారు. డేవిడ్ ఉంగరం తొడగగానే హీథర్ ఎంతో సంతోషించింది. ఆ మరుసటి రోజు కన్నుమూసింది.

అందుకే కదా ఎప్పుడు విధి రాత, ఎవరిని ఎందుకు కలుపుతుందో విడదీస్తుందో ఎవ్వరూ చెప్పలేరు.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon