Link copied!
Sign in / Sign up
4
Shares

చన్నీటి గురించి ఈ రహస్యం తెలిస్తే ఎంత కష్టమైనా చలికాలంలో చల్లని నీళ్లతో స్నానం చేస్తారు

చలికాలం, పైగా చల్లని నీటితో స్నానం..వింటుంటూనే చాలామందికి భయం పుడుతూ ఉంటుంది. కానీ చన్నీటి రహస్యం గురించి తెలిస్తే మాత్రం ఇన్ని రోజులు చాలా తప్పుచేశామే అని బాధపడతారు. చల్లని నీటితో చలికాలంలో స్నానం చేయడం వలన ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకోండి..

వ్యాధులు దరిచేరవు

చల్లని నీటితో స్నానం చేయడం వలన మీ శరీరానికి వ్యాధులు దరిచేరవు ఎందుకంటే చల్లని నీరు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. అలాగే అనారోగ్యం బారిన పడకుండా, పడినా త్వరగా కోలుకుంటారని వైద్య నిపుణులు సైతం చెబుతున్నారు.

అందం పెరుగుతుంది

చల్లని నీటితో ప్రతి రోజూ స్నానం చేయడం వలన అందం పెరుగుతుంది. ముఖం కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. అలాగే చాలామంది తలస్నానానికి వేడి నీటిని ఉపయోగిస్తూ ఉంటారు. వీటికి బదులుగా చన్నీళ్ళు వాడటం వలన తలలో ఉండే దుమ్ము, ధూళి, చుండ్రు సమస్యలు తొలగిపోతాయి.

శ్వాస ప్రక్రియ బాగా జరుగుతుంది

చల్లని నీటితో స్నానం చేయడం వలన కలిగే ఈ ఆరోగ్య ప్రయోజనం గురించి తెలిస్తే ఇకపై ఇలా చేయకుండా ఉండలేరు. చల్లని నీటి వలన ఊపిరితిత్తులు తెరుచుకునేలా చేసి మంచి వ్యాయామంగా పనిచేస్తుంది. దీని కారణంగా శ్వాసక్రియ బాగా ఆడుతుంది.

జుట్టు రాలదు

అవును నిజమే.. మన ఋషులు దీని గురించి ఎప్పుడో చెప్పారు. చల్లని నీటితో తలస్నానం చేయడం వలన జుట్టు రాలదు మరియు చుండ్రు సమస్య ఉండదని ఎప్పుడో చెప్పారు కానీ మనం ఎవరు ఆ మాటలు పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ మనపెద్దలు చాలామంది చల్లని నీటితోనే స్నానం చేస్తున్నారంటే ఒక్కసారి గుర్తించండి ఎన్ని లాభాలు ఉన్నాయో..

వీర్యకణాలు తగ్గకుండా చేస్తుంది

వేడి నీటితో స్నానం చేయడం వలన మగవారిలో వీర్యకణాల సంఖ్యను తగ్గించివేస్తుందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెప్పిన విషయం. అందుకని చన్నీటితో స్నానం చేయడం వలన వీర్యకణాల సంఖ్య తగ్గకుండా చేస్తుంది.

యాక్టివ్ గా ఉండటానికి..

మీరు బాగా గమనించారో లేదో నిద్రలేవగానే చాలామంది అలసటగా, నీరసంగా ఉంటారు. ఇది సహజమే. అలాగే వేడినీటితో స్నానం చేశాక కూడా ఇంకా అలాగే ఉంటారు. ఐతే చల్లనినీటితో స్నానం చేసినట్లయితే రోజంతా యాక్టివ్ గా, చురుకుగా ఉండగలరు. గర్భిణీలు, బాలింతలు మాత్రం ఒక్కసారి డాక్టర్ ను సంప్రదించడం మంచిది..

నిజంగా చన్నీటితో భలే ప్రయోజనాలు ఉన్నాయి కదూ..మరి మీలో ఎంతమందికి చన్నీటి స్నానం అంటే ఇష్టం, అలవాటు.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon