Link copied!
Sign in / Sign up
3
Shares

ఉదయాన్నే చల్ల నీరు - వేడి నీరు ఏది తాగడం ఆరోగ్యం? డాక్టర్లు చెప్పిన నిజాలు

చలికాలం, వర్షాకాలంలలో నీరు తాగడానికే చాలామంది ఇష్టపడరు, ఇక చల్లని నీరు ఏం తాగుతారు. అదే వేసవి కాలంలో ఐతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మరీ తాగడానికి ఇష్టపడతారు. కాగా, చల్లని నీరు, వేడి నీరు రెండిటిలో ఏది తాగితే ఆరోగ్యకరం అని కొందరు ప్రశ్నించగా డాక్టర్లు ఈ విధంగా సమాధానం ఇచ్చారు.  ఆ రహస్యాలు మీరు తెలుసుకోండి.

వేడి నీరు తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్య నిపుణులు జరిగిన ఆరోగ్య పరిశోధనల ప్రకారం నీటిని వేడి చేసుకుని సేవించడం చాలా ఉత్తమమమని తేల్చి చెప్పారు. అయితే ఎప్పుడు ఎందుకు వేడి  నీరు తాగితే మంచిదో వివరంగా మీకోసం…

జీర్ణప్రక్రియ సరిగ్గా జరగడానికి

ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు సేవించడం వలన జీర్ణప్రక్రియ సరిగ్గా జరుగుతుందని, ఈ జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే రక్తప్రసరణ సరిగ్గా జరిగేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.

శరీరంలోని విషతుల్యం

శరీరంలోని మలినాళాలను బయటకు పంపించడానికి నీటిని వేడి చేసుకుని కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడు సేవించడం వలన ఆరోగ్యకరమని డాక్టర్లు తెలిపారు. అలాగే నీరసం, శ్వాస సంబంధిత సమస్యలు, కీళ్లనొప్పులు దూరమవుతాయని డాక్టర్లు ఇస్తున్న సలహా.

చల్లని నీరు తాగడం వలన కలిగే ప్రయోజనాలు

వ్యాయామాలు చేసినప్పుడు, జిమ్ కు వెళ్లి వర్కౌట్స్ చేసినప్పుడు శరీరం బాగా వేడెక్కుతుంది. చమటలు బయటకు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు చల్లని నీరు తాగడం చాలా ఉత్తమమని ఆరోగ్య నిపుణులు ఇచ్చిన సలహా.

సమ్మర్ లో బయటకు వెళ్ళినప్పుడు

వేసవికాలంలో ఎండలు ఎలా మండుతుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరో నెలలో వేసవి వచ్చేస్తుంది. కాబట్టి ఎండకు బయటకు వెళ్లి వచ్చినప్పుడు ఒక గ్లాస్ చల్లని నీరు తాగడం చాలా మంచిది. వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.

బరువు తగ్గించేందుకు

చల్లని నీరు సేవించడం లేదా చల్లని నీటితో స్నానం చేయడం వలన మీ బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందని, రోజూ మొత్తం ఆక్టివ్ గా ఉండటానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే అన్నం తినేటప్పుడు చల్లని నీరు తాగడం వలన శరీరం వేడికి గురువుతుందని, జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు.

చల్లని నీరు కన్నా వేడి నీరు సేవించడం ఉత్తమమని, రక్తప్రసరణ, జీర్ణప్రక్రియ బాగా జరుగుతుందని తెలిపారు. ఐతే బయట ఎండకు తిరిగివచ్చినప్పుడు చల్లని నీరు తాగడం మీ శరీరానికి మంచిది. అందరికీ SHARE చేయగలరు… 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon