Link copied!
Sign in / Sign up
4
Shares

చలికాలంలోనే దంపతుల మధ్య శృంగారం ఎక్కువ జరుగుతుంది..ఎందుకు?

గజగజ వణికించే చలి తాపాన్ని తట్టుకోవడానికి వెచ్చదనాన్ని కోరుకుంటారు. అందుకే చలికాలాన్ని దంపతులు చాలా ఇష్టపడతారు. సంవత్సరంలో అన్ని ఋతువులకంటే ఈ సీజన్ అంటే మక్కువ ఎక్కువ. అలాగే ఈ కాలంలోనే దంపతుల మధ్య శృంగారం ఎక్కువ జరుగుతుందని ఆరోగ్య పరిశోధనల ప్రకారం వెల్లడైంది. ఇలా ఎందుకు జరుగుతుందో మీరే తెలుసుకోండి.

మీ మూడ్ ను మార్చివేస్తుంది

బయట చల్లనిగాలితో పాటు వెచ్చదనం కావాలి అని శరీరం కోరుకుంటుంది. ప్రతి ఒక్కరూ చలికాలంలో మఫ్లర్స్, స్వెటర్స్..వంటివి ఉపయోగిస్తున్నా మీ భర్త ఇంకా వెచ్చదనం కోరుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే భర్త భార్యకు దగ్గరగా ఉండటానికి, శృంగారం చేయడానికి మగవారి శరీరంలోని టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటాయి.

చలిని ఆపేది వెచ్చదనం కాబట్టి..

చలి నుండి రక్షించేది వెచ్చదనం, ఆ చలిని తట్టుకోవడానికి దంపతులకు ఉన్న ఒకే ఒక సులువైన మరియు ఇష్టమైన మార్గం శృంగారం. అందుకే మిగతా సీజన్ లలో కన్నా ఈ సీజన్ లో సెక్స్ పై దంపతులు ఇష్టం చూపించడానికి కారణం. శృంగారం తర్వాత కూడా ఒకరి నుండి ఒకరు దూరంగా వెళ్ళడానికి ఇష్టపడరు.

ఇది లేనిదే చలికాలం పూర్తవ్వదు

మగవారు స్నానాల గదిలో స్నానం చేస్తూ భార్యతో రొమాన్స్ చేయడం, అక్కడ కొన్ని క్షణాలు వారితో గడపడం అంటే వారికి చాలా ఇష్టం. ముఖ్యంగా చలికాలంలో వెచ్చని నీటితో లేదా షవర్ కింద ఒకటిగా కలిసి ఒకరి చేతులతో మరొకరు దేహాన్ని తాకుతూ చలికాలం మైమరిపించేలా చేస్తుంది.

ఒత్తిడిని తరిమికొడుతుంది

శృంగారం అన్నా, శృంగారం గురించి మాట్లాడుకుంటున్నా ఏదో తప్పుగా ఫీలవుతూ ఉంటారు చాలామంది. ఇకపై అలా అస్సలు అనుకోకండి. భార్యాభర్తల మధ్య చక్కటి రిలేషన్ కొన్నేళ్ల పాటు మైంటైన్ చేయడానికి, మీ ఒత్తిడిని దూరం చేసి, ప్రశాంతతను అందించే ఉత్తమ టెక్నీక్. అందులో చలికాలం మిమ్మల్ని ఇంకా బాగా దగ్గరకు చేస్తుంది.

కాళ్లకు సాక్స్ ధరించండి

శృంగారంలో ఎక్కువ సమయం గడపడలేక, త్వరగా స్కలనం కావడం వలన శృంగారంపై మీ భాగస్వామికి చిరాకు, అయిష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి దంపతులు కాళ్లకు సాక్స్ ధరించి శృంగారంలో పాల్గొనడం వలన ఎక్కువసేపు రతిలో పాల్గొనవచ్చని, స్కలనం జరగడానికి ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చలికాలంలో ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తి అవుతుందట.

సో, ఇదండీ సాధారణ శృంగారానికి, చలికాలంలో శృంగారంపై ఆసక్తి ఎక్కువ పెంచుకోవడానికి కారణం.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon