Link copied!
Sign in / Sign up
10
Shares

చలికాలంలో పిల్లలకు వచ్చే అంటు వ్యాధులు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పిల్లలలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన త్వరగా వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో వ్యాధుల ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. గజగజ వణికించే ఈ చలికాలంలో పిల్లలలో వచ్చే వ్యాధులు, ఈ వ్యాధులు రాకుండా తల్లితండ్రులు ముందే ఈ జాగ్రత్తలు తీసుకోండి.

ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం

చలికాలంలో జలుబు దగ్గు బాక్టీరియా లేదా వైరస్ వలన వ్యాపిస్తాయి. జలుబు దగ్గు మాములే కదా అని అశ్రద్ధ చేస్తే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. దీనినే న్యుమోనియా అని అంటారు. దీని కారణంగా ఊపిరితిత్తులలోకి నిమ్ము చేరి పిల్లలకు ప్రమాదంగా మారుతుంది. ఇలా నిమ్ము చేరకుండా  ఉండాలంటే తల్లి బిడ్డకు 6 నెలల వరకు పాలు ఇస్తే మంచిది.

ఆస్తమా

అపరిశుభ్రత, కాలుష్యంలోని పొప్పొడి రేణువుల వలన, శ్వాసనాళాలలో అడ్డుపడి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలా ఉండే పరిస్థితినే ఆస్తమా అని అంటారు. ఆస్తమా ఉన్నప్పుడు దగ్గు కూడా ఎక్కువగా ఉంటుంది. మంచు కురుస్తున్నప్పుడు పిల్లలను బయటకు తీసుకెళ్లడం చేయకూడదు. శ్వాసకోశాలు అడ్డుపడటం వలన గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

హైపోథరిమీయా

చలికాలంలో మంచుకి, చలికి కొందరి శరీరం తట్టుకోలేదు. ఎక్కువగా వణికిపోతుంటారు. ఈ సీజన్ లో చలి ప్రభావం కారణంగా కొందరి పిల్లలలో సాధారణం కంటే తక్కువ శరీర ఉష్ణోగ్రత ఉంటుంది. దీనినే వైద్య భాషలో హైపోథరిమీయా అని అంటారు. దీని కారణంగా కాళ్లు చేతులు పనిచేయకపోయే ప్రమాదం ఉంది.

ఫ్లూ జ్వరాలు

జలుబు దగ్గు నుండి ఫ్లూ జ్వరాలు వెంటనే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలను చేరుతాయి. అలాగే ఇంటి వాతావరణం సరిగా లేకపోయినా, కలుషిత నీటిని సేవించడం వలన, దోమలు ఎక్కువగా ఉండటం కారణంగా వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా వ్యాపిస్తాయి.

స్కిన్ అలర్జీ

చలికి చర్మం పొడిబారటం వలన మంట దురద కలగడంతో పిల్లలు వెంటనే చర్మంపై రుద్దడం, గిల్లడం చేస్తుంటారు. ఇలా ఒకరిని మరొకరు తాకినప్పుడు తామర, చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. ఐతే ఈ వ్యాధులు సోకకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి.

చలికాలంలో వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు:
పిల్లలను రానివ్వకూడదు

చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి బయటకు తీసుకెళ్లడం అలాగే ఉదయం సూర్యుడు వచ్చాక బయటకు రానివ్వడం చేయాలి. ఇంట్లో ముసలివారు ఉన్నా ఈ విధంగానే చేయాలి.

దుస్తులు

ఈ కాలంలో ఉన్ని దుస్తులు ధరించడం, తలకు మఫ్లర్, కాళ్ళు చేతులకు సాక్స్ ధరించడం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకు ఉన్ని దుస్తులు వేయడం మర్చిపోకూడదు.

ఏసీ, ఫ్యాన్స్

అసలే చలికాలం ఆపైన ఏసీలు, గిరగిరా తిరిగే ఫ్యాన్స్ వేయడం వలన మరింత చలి పుడుతుంది కాబట్టి వణికిపోతారు. ఏసీ పిల్లలకు పడకపోవడం వలన చలితో పాటు జ్వరం వచ్చే అవకాశం లేకపోలేదు.

చలికాలం క్రీమ్స్

చలికాలంలో చర్మ సంరక్షణ పిల్లలు, పెద్దలు తప్పకుండ చూసుకోవాలి. చర్మం పొడిబారి పక్కులు వచ్చి పెళుసులుగా ఊడిపోయి మంట దురదను కలిగిస్తాయి. అందుకని చర్మాన్ని కాపాడే చలికాలం క్రీమ్స్ రాయడం చేయాలి.

నీరు

పిల్లలకు ప్రతి రోజూ ఒక గ్లాస్ పాలతో పాటు ఎక్కువగా నీరు తాపించాలి. చలికాలం చాలామంది పిల్లలు నీరు తీసుకోవడానికి ఇష్టపడరు.  నీరు తక్కువైతే డీ హైడ్రేషన్ కలిగి జలుబు, ముక్కుల నుండి నీరు కావడం ఎక్కువగా ఉంటుంది. ఇంకా నీరు వేడిచేసి చల్లారిన తర్వాత ఇవ్వడం మంచిది.

సో, చలికాలం ఈ జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు రాకుండా మీ పిల్లలను కాపాడుకోవచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon