Link copied!
Sign in / Sign up
30
Shares

చలికాలంలో పిల్లలకు తినిపించకూడని ఆహారం మరియు తప్పక తినిపించాల్సిన 5 ఆహారాలు

గజగజ వణికించే చలికాలంలో పిల్లల పట్ల తల్లితండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే పిల్లలకు త్వరగా వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. స్వెటర్స్, మఫ్లర్స్ విషయంలోనే కాకుండా ఎటువంటి ఆహారం ఇవ్వాలి. ఎటువంటి ఆహారం ఇవ్వకూడదో తప్పక తెలుసుకోవాలి. ఇది అందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి SHARE చేయండి.

ఫ్రిడ్జ్ లోని ఆహారం

ఫ్రిడ్జ్ లు వచ్చిన తర్వాత చాలామంది ముందే వంటలు చేసుకుని అందులో స్టోర్ చేసుకోవడం జరుగుతోంది. తినే సమయంలో వాటిని వేడిచేసుకుని తింటున్నారు. అయితే పిల్లలకు ఈ ఆహారం బదులు అప్పుడే చేసిన ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే చలికాలంలో తినిపించడం చేయాలి. ఫ్రిడ్జ్ ఆహారం వలన జలుబు, ఫ్లూ వచ్చే అవకాశం ఎక్కువ.

ఐస్ క్రీమ్స్ బర్గర్స్

పిల్లలకు ఎప్పుడు ఏది కావాలో సరిగ్గా తెలియదు. ఐస్ క్రీమ్ చూసిన వెంటనే కావాలని, ఫ్రిడ్జ్ లోని నీరు, కూల్ డ్రింక్స్ కావాలని ఏడుస్తూ ఉంటారు. అలాగే పిజ్జా, బర్గర్స్ ఒక్కసారి రుచిచూపిస్తే అవే కావాలని మారాం చేస్తుంటారు కాబట్టి వీటిని అస్సలు ఇవ్వకూడదు. చలికాలంలో ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

పిల్లలకు చలికాలంలో ఇవ్వాల్సిన ఆహారాలు

చలికాలంలో పిల్లలకు ఎటువంటి ఆహారం ఇవ్వకూడదు తెలుసుకున్నారు కదా..ఇక్కడ ఎటువంటి ఆహారాలనో ఇస్తో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకుందాం..

వేరు శనగలు

పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వేయించిన వేరు శనగలు లేదా ఉడికించిన వేరు శనగలను ఇవ్వడం వలన పిల్లల చర్మం పొడిబారకుండా చేస్తుంది. ఎందుకంటే వీటిలో నూనె శాతం ఎక్కువగా ఉండటమే కారణం. అలాగే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కూడా.

ఆపిల్

పిల్లలకు చలికాలంలో ఆపిల్ ఇవ్వడం వలన త్వరగా జీర్ణం అవుతుంది. చల్లగా ఉంటే కొద్దిసేపు గోరు వెచ్చని నీటిలో ఉంచి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఇవ్వడం వలన ఎంతో ఇష్టంగా తింటారు. మసాలా ఫుడ్స్ కన్నా ఇవి చాలా ఉత్తమం.

నువ్వులతో చేసిన ఆహారం

నువ్వులు చర్మం పొడిబారకుండా చేయడంలో మంచి పాత్ర పోషిస్తాయి కాబట్టి నువ్వులతో చేసిన లడ్డులు, నువ్వుల పిండిని పిల్లలకు సాయంత్రం స్నాక్స్ గా ఇవ్వడం చేయాలి. నువ్వులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

డ్రై ఫ్రూట్స్

పిల్లలు ఏ కాలంలో అయినా సరే డ్రై ఫ్రూట్స్ ను ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉండటం వలన త్వరగా ఎనర్జీ వస్తుంది మరియు జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది.

పాలు తాగే పిల్లలు

పాలు తాగే చంటిబిడ్డలకు తల్లి పాలే సురక్షితం కాబట్టి తల్లే మంచి పోషక విలువలతో కూడిన ఆహారం గ్రీన్ వెజిటేబుల్స్. పండ్లు, పాలకూర, చిలగడదుంప, దానిమ్మ బాగా తీసుకోవాలి. రాత్రి పూట పిల్లలను బయట తిప్పకూడదు. ఉదయం సూర్యుడు వచ్చాకే పిల్లలను బయటకు తీసుకురావాలి.

ఈ విషయాలు అందరికీ SHARE చేయడం మాత్రం మర్చిపోకండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon