Link copied!
Sign in / Sign up
27
Shares

చలికాలంలో పసిపిల్లలకు ఎన్నిసార్లు స్నానం చేయించాలి?

పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి, ఏ ఆహారం బాగా ఇస్తే పిల్లల ఎదుగుదల బాగా  జరుగుతుంది, ఎటువంటి దుస్తులు వేస్తే మంచిది అని ప్రతి ఒక్కరికీ వచ్చే అనుమానాలు. అటువంటి వాటిలో పిల్లల స్నానం కూడా ఒకటి. ముఖ్యంగా పిల్లలకు చలికాలంలో ఎన్నిసార్లు స్నానం చేయించాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈ ముఖ్యమైన విషయాన్ని అందరికీ SHARE చేయండి.

ప్రతి రోజూ అవసరం లేదు

స్కిన్ కేర్ అనుభవజ్ఞుల ప్రకారం ప్రతి రోజూ పసి పిల్లలకు స్నానం అవసరం లేదు. సాధారణంగానే పిల్లలకు వారంలో రెండు లేదా మూడుసార్లు స్నానం చేయిస్తే సరిపోతుంది. మిగతా అన్ని రోజులు వేడినీటిలో మంచి క్లాత్ ను ఉంచి శరీరం తుడిస్తే చాలు. ఈ విధంగా చేయడం వలన చర్మం పొడిబారకుండా ఉంటుంది.

చలికాలంలో పసిపిల్లలకు స్నానం

ఇది ప్రతి తల్లికీ ఉండే అనుమానం. చలికాలంలో కూడా రోజు స్నానం అవసరం లేదు. మీరు ఎలాగు పిల్లల శరీర భాగాలను గోరు వెచ్చని నీటితో తుడవడం చేస్తుంటారు కాబట్టి వారానికి రెండు లేదా మూడుసార్లు స్నానం చేయిస్తే చాలు. అయితే చలికి చర్మం పొడిబారడం, పగలడం, పిల్లల చర్మం ఇంకా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఒక బకెట్ లో వేడి నీటిని ఉంచి పిల్లలకు దగ్గరలో గోరు వెచ్చగా ఉండేంత దూరంలో పెట్టుకోవాలి.

స్నానం చేయించిన తర్వాత

చలికాలంలో పిల్లలకు స్నానం చేయించిన తర్వాత వీలైనంత వరకు కెమికల్ క్రీమ్స్ కు దూరంగా ఉండటం మంచిది. వాటికి బదులుగా ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె రాయడం ఉత్తమం. పిల్లల చర్మం పొడిబారటం, తడిని వదిలేయడం వలన తామర, చర్మంపై పుండ్లు వంటి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే తడిగా ఉండే బట్టలు శరీరానికి చలి తగలకుండా ఉండే దుస్తులు వేయాలి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon