Link copied!
Sign in / Sign up
12
Shares

చలికాలంలో మీ పిల్లలకు తప్పక తినిపించాల్సిన 6 ఆహారాలు

పిల్లలకు ఏ ఆహారం తినిపిస్తే ఆరోగ్యంగా ఉండగలరు అనేది ప్రతి తల్లికీ ఎప్పుడు ఎదురయ్యే ప్రశ్న. సీజన్ మారుతున్న కొద్దీ పిల్లలకు ఇచ్చే ఆహారంలోనూ మార్పు తప్పక ఉండాలి. వర్షాకాలంలో ఏ ఆహారం మంచిది, చలికాలంలో ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి.. ఇలా ప్రతి ఒక్కరికీ ఉన్న అనుమానమే. ప్రస్తుతానికి చలికాలంలో మీ బిడ్డకు ఎటువంటి ఆహారం మంచిదో ఇక్కడ తెలుసుకోండి. నచ్చితే అందరికీ SHARE చేయండి.

మిశ్రమ బెర్రీలు

మీ పిల్లలకు చలికాలంలో ఉత్తమ ఆహారంగా దీనిని చెప్పుకోవచ్చు. కొంచెం తియ్యగా, ఎర్రగా ఉండటం వలన పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే వీటిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ ‘c’ ఉన్నాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా లేదా పెరుగుతో గానీ పెరుగన్నంతో గానీ కలిపి ఇవ్వవచ్చు.

చిలగడదుంప (స్వీట్ పొటాటో)

చిలగడదుంపను ఉడకబెట్టి, ఫ్రై చేసి ఇలా ఎలాగైనా సరే మీ పిల్లలకు ఇవ్వవచ్చు. ఇది పిల్లలకు బెస్ట్ ఫుడ్ గా చలికాలంలో చెప్పుకోవచ్చు. ఇది త్వరగా జీర్ణం చేయగలదు మరియు ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్స్ ఉండటం వలన పిల్లల ఆరోగ్యానికి మంచిది కూడా. వీటితో సూప్ తయారుచేసి కూడా పిల్లలకు ఇవ్వవచ్చు.

కాలే

ఆకులు విడివిడిగా ఉండి క్యాబేజీ రకానికి చెందిన కూరగాయ ఇది. వింటర్ లో పిల్లలకు మరో ఉత్తమమైన ఆహారం. ఇందులో అధిక శాతం న్యూట్రియంట్స్, విటమిన్ ఎ, సి ఉండటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిని తినడానికి మొదట్లో పిల్లలు కాస్త మారాం చేస్తారు కాబట్టి తియ్యగా ఉండే అరటిపండు, చిలగడదుంపలతో కలిపి వీటిని తినిపించడం చేయాలి.

కాయధాన్యాలు

మీ పిల్లలకు మీరు ఎక్కువగా శాకాహారం అలవాటు చేస్తున్నట్లయితే అందులో వీటిని ఖచ్చితంగా ఉండేలా చేసుకోవాలి. వీటిలో ఉండే ఐరన్ మంచి రక్తానికి దోహదపడుతుంది. అలాగే పిల్లలలో తరచూ వచ్చే జలుబును దూరం చేస్తుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

టర్కీ కోళ్ల మాంసం

మీ పిల్లలకు మాంసాహారం అలవాటు చేస్తున్నట్లయితే చలికాలంలో తాజా టర్కీ కోడి మాంసం ఇవ్వవచ్చని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. వీటి గురించి చాలా తక్కువ మందికే తెలుసు కూడా. ఇందులో అధిక శాతంలో ప్రోటీన్స్ ఉండటం వలన నీరసం, అలసట లేకుండా ఆక్టివ్ గా ఉండేలా చేస్తుంది.

మొలకలు

చిన్నతనం ఉండే వీటిని మీ పిల్లలకు అలవాటు చేయడం వలన మంచి ఆరోగ్యాన్ని మీ పిల్లలకు ఇచ్చిన వారవుతారు. ఎలాగో ఇవి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి తప్పనిసరిగా ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం మీ పిల్లలకు అలవాటు చేయండి. వింటర్ లో ఇది ఉత్తమ ఆహారం కూడా.

అందరికీ ఉపయోగపడే ఈ సమాచారాన్ని అందరికీ SHARE చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon