Link copied!
Sign in / Sign up
3
Shares

నల్లగా మారిన పెదవులను ఎర్రగా, అందంగా మార్చాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి

మహిళలను మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంచేవి అందమైన పెదవులు. అయితే చలికాలంలో చాలామందికి ఎదురయ్యే సమస్య పెదవులు పొడి బారడం, పెదవులు చీలి రక్తం వస్తుండటం జరుగుతూ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలలోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ ఇంటి చిట్కాలు పాటించడం వలన అందమైన పెదాలు మీ సొంతం.

నెయ్యి లేదా మీగడ

పెదవులు పొడిబారుతూ లేదా చీలడం జరుగుతూ ఉంటే రాత్రి పడుకునేముందు నెయ్యి లేదా మీగడ రాసుకోవడం వలన పెదవులు అందంగా ఉంటాయి.

గులాబీ రేకుల పేస్ట్

పెదవులు పొడిబారినా లేదా నల్లగా ఉన్నా గులాబీ రేకులను తీసుకుని మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొన్ని పాలను మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో దూదిని ఉంచి పెదవులపై అప్లై చేసి కొన్ని నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే అందమైన ఆకర్షణీయమైన పెదవులు మీ సొంతం.

పగిలిన పెదవుల కోసం

పెదవులు పగిలినప్పుడు ఒక స్పూన్ పాల మీగడ తీసుకుని అందులో కాస్త దానిమ్మ రసం లేదా బీట్ రూట్ రసం కలుపుకుని పగిలిన పెదవులపై రాయడం వలన ఈ సమస్య నుండి బయటపడటమే కాకుండా మీ పెదవులు ఎర్రగా మారుతాయి కూడా.

టమోటో పేస్ట్

టమోటోను గుజ్జుగా చేసుకుని అందులో కాస్త పాల మీగడ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా పెదాలపై అప్లై చేసుకుంటూ ఉంటే పెదవులు చీలడం, పొడిబారడం సమస్య ఉండదు.

పెదాల నలుపు తగ్గడానికి

రాత్రి పడుకునేముందు కాస్త కలబంద గుజ్జు తీసుకుని పెదాలపై అప్లై చేసి పడుకోవడం వలన నల్లని పెదాల నుండి బయటపడవచ్చు. నిమ్మరసం లేదా గ్లిజరిన్ రాసి కొన్ని నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే పెదవులు ఎర్రగా మారుతాయి.

పెదవులపై నల్లని మచ్చలు

కొంతమందిలో పెదవులు తడి ఆరిపోయి నల్లని మచ్చలుగా ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి వారు కొత్తిమీరను రసంలా చేసుకుని ఆ రసాన్ని పెదవులపై రాసుకుని కొన్ని నిముషాల తర్వాత క్లీన్ చేసుకోవడం వలన నల్లటి మచ్చలకు చెక్ పెట్టవచ్చు.

ఇవే కాకుండా ఇంకా మీకు తెలిసిన ఇంటి చిట్కాలు పెదవుల కోసం తెలిసి ఉంటే COMMENT సెక్షన్ లో తెలుపవచ్చు. అలాగే అందరికీ SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon